twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Oct 19th show: కంటెస్టెంట్‌ను సిగ్గుండాలి అని ప్రశ్నించిన ఎన్టీఆర్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

    |

    అత్యంత ప్రేక్షకదారణను సొంతం చేసుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో మరోసారి ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ హాట్ సీట్‌పైకి వచ్చారు. ఎక్కడ తడబాటు గురికాకుండా చక్కగా సమాధానాలు చెబుతూ చకచకా ముందుకెళ్లాడు. మంగళవారం ఆటలో ఆయన ఎంత గెలుచుకొన్నారు? షో నుంచి ఎంత తీసుకెళ్లనున్నారు? ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలను మీరు చెప్పగలరా అనే విషయాన్ని ఓ సారి చెక్ చేసుకోండి..

    సాధారణంగా వీటిని, అవి జరిగే సమయాల ఆధారంగా తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి

    సాధారణంగా వీటిని, అవి జరిగే సమయాల ఆధారంగా తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి

    A) జన గణన
    B) లోక్‌సభ ఎన్నికలు
    C) ఐపీఎల్
    D) వన్డే క్రికెట్ వరల్డ్ కప్

    Answer: C, D, B, A

    పైన ఇవ్వబడిన ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ అతివేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో గెలుచుకొనే మొత్తంతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నారు.

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    కార్డియాలజీ అని పిలువబడే పరిస్థితుల అధ్యయనం ఏ అవయవానికి సంబంధించినది?
    a) మెదడు
    b) కిడ్నీ
    c) గుండె
    d) కాలేయం

    Answer: గుండె

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    అక్టోపస్ మరియు అక్టోబర్ వంటి పదాలతో అక్టో అంటే ఏమిటి?
    a) ఐదు
    b) ఆరు
    c) ఏడు
    d) ఎనిమిది

    Answer: గుండె

     3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి?
    a) ఇటలీ
    b) నైజీరియా
    c) కొలంబియా
    d) యూఎస్ఏ

    Answer: యూఎస్ఏ

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    వీటిలో, జాన సరస్వతి మూలవిరాట్టుగా ఉండే దేవస్థానం ఏది?
    a) యాదగిరిగుట్ట
    b) భద్రాచలం
    c) బాసర
    d) ధర్మపురి

    Answer: బాసర

     10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రంలోనిదో గుర్తించండి
    a) పైసా వసూల్
    b) నరసింహ నాయుడు
    c) లెజెండ్
    d) సింహా

    Answer: నరసింహ నాయుడు

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    ఏ ఒలంపిక్ క్రీడలో అభినవ్ బింద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పతకాలు సాధించారు?
    a) షూటింగ్
    b) జావెలిన్ త్రో
    c) డార్ట్స్
    d) ఆర్చరీ

    Answer: షూటింగ్

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న
    రామాయణంలో, రామలక్ష్మణులని కలవడానికి సుగ్రీవుడి దూతంగా వెళ్లినది ఎవరు?
    a) వాలి
    b) అంగదుడు
    c) హనుమంతుడు
    d) జాంబవంతుడు

    Answer: హనుమంతుడు
    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో సురేంద్రనాథ్ తన తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. సమాధానం తెలియకపోవడంతో దానిని తెలుసుకొనేందుకు ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. ఎక్కువ మంది హనుమంతుడు అని సమాధానం చెప్పడంతో 40 వేల రూపాయలు గెలుచుకొన్నారు.

    80000 రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

    80000 రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

    వీటిలో, ఒక ఇండోనేషియా ద్వీపం అలాగే ఒక ప్రోగ్రామింగ్ భాష పేరుగల పదం ఏది?
    a) ఇనియాక్
    b) జావా
    c) స్విఫ్ట్
    d) స్కోలా

    Answer: జావా

    160000 రూపాయల కోసం తొమ్మిదో ప్రశ్న

    160000 రూపాయల కోసం తొమ్మిదో ప్రశ్న

    ప్రభుత్వ సంస్థ DRDO మొదటి డీ దేనిని సూచిస్తుంది?
    a) ఢిఫెన్స్
    b) డెవలప్‌మెంట్
    c) డైనమిక్స్
    d) ఢిల్లీ

    Answer: ఢిఫెన్స్

    320000 రూపాయల కోసం పదో ప్రశ్న

    320000 రూపాయల కోసం పదో ప్రశ్న

    జూన్ 2021లో ఏ దేశపు ప్రధానమంత్రి అయిన బెంజిమిన్ నేతన్యహు 12 ఏళ్ల పదవీ కాలానికి నెఫ్తాలి బెన్నెట్ ముగింపు పలికారు?
    a) ఈజిప్టు
    b) టర్కీ
    c) మొరాకో
    d) ఇజ్రాయిల్

    పై ప్రశ్నకు చాలా వేగంగా సమాధానం చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. నేను ప్రశ్నను చదివినంత సేపు కూడా ఆగకుండా వేగం సమాధానం చెప్పారు. మీకు కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా అని ఎన్టీఆర్ అడిగితే.. నాకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఆలస్యం చేయకుండా సమాధానం చెప్పాను అని సురేంద్రనాథ్ తెలిపారు.

    Answer: ఇజ్రాయిల్

    640000 రూపాయల కోసం పదకొండో ప్రశ్న

    640000 రూపాయల కోసం పదకొండో ప్రశ్న

    1941 కవితా సంపుటి గబ్బిలం రచయిత ఎవరు?
    a) కృష్ణశాస్త్రి
    b) అల్లం నారాయణ
    c) గుర్రం జాషువా
    d) శ్రీరంగం శ్రీనివాసరావు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన రెండో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. తన అక్కకు వీడియో కాల్ చేసి ప్రశ్నను వినిపించగా వెంటనే ఆమె గుర్రం జాషువా అని సమాధానం చెప్పారు. దాంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి 640000 గెలుచుకొన్నారు. అయితే ఆడియెన్స్‌లో కూర్చున్న తన కూతురు హర్షకు సమాధానం ముందే తెలుసు అని చెప్పడంతో.. ఎంబీఏ ఫైనాన్స్ చదివిన మీకు ఆ సమాధానం తెలియదా? మీకు సిగ్గుండాలి అని ఎన్టీఆర్ సరదాగా అన్నారు. దాంతో సురేంద్రనాథ్ కూడా నవ్వుల్లో మునిగిపోయారు.

    Answer: గుర్రం జాషువా

    1250000 ప్రశ్నను సురేంద్రనాథ్ ముందుకు తీసుకురావడానికి ఎన్టీఆర్ ప్రయత్నించగా, శంఖం మోగింది. దాంతో అక్టోబర్ 19వ తేదీ ఆట ఆగింది. 12వ ప్రశ్నతో అక్టోబర్ 20వ తేదీన మళ్లీ సురేంద్రనాథ్ గేమ్ ఆడనున్నారు. మరో లైఫ్‌లైన్ ఉన్న ఆయన ఎంత గెలుచుకొంటారో వేచి చూడాల్సిందే.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 19th Episode: Surendranath of Rajamundri comes to hot seat in Evaru Meelo Koteeswarulu. He played well with confidance and won 640000 in first day. He is the roll over contestant for next day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X