twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Oct 13th show: శ్రీరాముడిని అలా నిద్ర లేపింది ఎవరు? ఎన్టీఆర్ షోలో ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో నిరాటకంగా బుల్లితెరపై కొనసాగుతున్నది. ఎందరో మేధస్సును కొలుచుకొంటూ ఆర్థికంగా అదృష్ఠాన్ని కూడా పరీక్షించుకొంటున్నారు. అయితే విజయవాడకు చెందిన శ్రీనివాసరావు హాట్ సీట్‌పైకి వచ్చి గేమ్ ఆడారు. ఫర్నీచర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఆయన ప్రస్తుతం పది లక్షల అప్పును కలిగి ఉన్నాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో పాల్గొని అప్పులు తీర్చుకోవాలనుకొన్నాడు. ఇంతకు శ్రీనివాసరావు ఎంత గెలుచుకొన్నారనే విషయాన్ని తెలుసుకొందా. అంతేకాకుండా శ్రీనివాసరావు ముందుకు వచ్చిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా? ఓసారి ఆ ప్రశ్నలకు జవాబు చెప్పండి

    ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఈ మానవ ఆవిష్కరణలను, అవి కనిపెట్టబడిన కాలం ఆధారంగా, సరైన క్రమంలో అమర్చండి
    A) చక్రం
    B) బుల్లెట్ రైలు
    C) సైకిలు
    D) విమానం

    పై ప్రశ్నకు శ్రీనివాస రావు వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. తన కష్టాలను, తన అనుభవాలను చెప్పుకొంటూ ఆయన గేమ్‌ను పంచుకొన్నారు. పై ప్రశ్నకు సరైన సమాధానం ఇదే..

    Answer: A, C, D, B

     1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    సాధారణంగా, ఐస్ క్యూబ్‌లు వీటిలో దేనిలో నిల్వ చేయబడతాయి?
    a) గ్యాస్ స్టవ్
    b) రిఫ్రిజిరేటర్
    c) మైక్రోవేవ్ ఓపెన్
    d) గ్రైండర్

    Answer: రిఫ్రిజిరేటర్

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో కఠినమైనది ఏది?
    a) పళ్లు
    b) ముక్కు
    c) చెవులు
    d) నాలుక

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మొదటి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఎంచుకొన్నారు. ఎక్కువ మంది పళ్లు అనే సమాధానం ఇవ్వడంతో అదే జవాబు చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

    Answer: పళ్లు

     3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    హిందూ దేవుడైన శివుని కళాత్మక వర్ణనలో సాంప్రదాయకంగా వీటిలో ఏది కలిగి ఉండదు?
    a) సింహం
    b) చంద్రుడు
    c) సర్పం
    d) త్రిశూలం

    Answer: సింహం

     5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి
    a) సుడాన్
    b) దక్షిణాఫ్రికా
    c) ఈజిప్టు
    d) ఇరాన్

    Answer: ఈజిప్టు

    10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో దేనికి మోటార్ ఉండదు
    a) ఎలక్ట్రిక్ ఫ్యాన్
    b) వాటర్ పంప్
    c) ఎలక్ట్రిక్ స్కూటర్
    d) బల్బ్

    Answer: బల్బ్

    20000 రూపాయల కోసం ప్రశ్న

    20000 రూపాయల కోసం ప్రశ్న

    నావికాదళం యొక్క తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

    a) పారదీప్
    b) చెన్నై
    c) విశాఖపట్నం
    d) కోల్‌కతా

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రెండో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. తెరపైన పారదీప్, విశాఖపట్నం ఉండటంతో విశాఖపట్నం అని జవాబు చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

    Answer: విశాఖపట్నం

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న

    12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం జరిగిన ప్రాంతం ఏ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంది?
    a) విజయనగరం
    b) గుంటూరు
    c) అనంతపురం
    d) కర్నూలు

    Answer: గుంటూరు

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    మహాబలిపురం షోర్ టెంపుల్ వీటిలో ఏ రాష్ట్రంలో ఉంది?
    a) ఒడిశా
    b) తమిళనాడు
    c) కర్ణాటక
    d) మహారాష్ట్ర

    Answer: తమిళనాడు

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    రామయణంలో, రాముడిని కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ నిద్ర లేపేది ఎవరు?
    a) విశ్వామిత్రుడు
    b) శబరి
    c) సీత
    d) హనుమంతుడు

    Answer: విశ్వామిత్రుడు

    అయితే పై ప్రశ్నకు హనుమంతుడు అని సమాధానం చెప్పారు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం విశ్వామిత్రుడు కావడంతో శ్రీనివాసరావు గేమ్ నుంచి నిష్క్రమించారు. దాంతో ఆయన 10 వేల రూపాయలతో వెనుదిరుగారు.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 25th Episode: Srinivasa Rao of Vijayawada participated but, he answer wrogly for 160000 question, went back with Rs.10000.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X