NTR's EMK Oct 27th show: ఎన్టీఆర్ షోలో ఎవరు కూడా జవాబు చెప్పలేకపోయారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ షోలో నరసింహరావు రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా హాట్ సీట్‌పైకి వచ్చారు. నిన్నటి షోలో రూ.5 వేలు గెలుచుకొన్న ఆయన 10 వేల ప్రశ్నతో గేమ్‌ను మొదలుపెట్టారు. అయితే ఆయన ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు? ఎంత గెలిచారు? ఈ గేమ్‌లో ఎవరూ సమాధానం చెప్పలేని ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఏది అనే విషయంలోకి వెళితే..

10 వేల రూపాయల కోసం ప్రవ్న

10 వేల రూపాయల కోసం ప్రవ్న

వీటిలో మైక్రో‌సాఫ్ట్ ఆఫీస్‌లో ఒక అప్లికేషన్ కానిది ఏది?
a) వర్డ్
b) ఎక్సెల్
c) పవర్ పాయింట్
d) ఫోటోషాప్

Answer: ఫోటోషాప్

20 వేల రూపాయల కోసం ప్రశ్న

20 వేల రూపాయల కోసం ప్రశ్న

ఈ యోగా భంగిమలలో, దేనికి ప్రదర్శకుడు ముఖంపైకి, చేతుల పక్కకి పెట్టుకొని పడుకొని ఉంటాడు?
a) మయురాసన
b) శవాసన
c) పద్మాసన
d) వృక్షాసన

Answer: శవాసన

40 వేల రూపాయల కోసం ప్రశ్న

40 వేల రూపాయల కోసం ప్రశ్న

మన్మోహన్ సింగ్ ఏ ప్రధానమంత్రి వద్ద ఆర్థికశాఖమంత్రిగా పనిచేశారు?
a) రాజీవ్ గాంధీ
b) ఇందిరా గాంధీ
c) పీవీ నరసింహరావు
d) వీపీ సింగ్

Answer: పీవీ నరసింహరావు

80 వేల రూపాయల కోసం ప్రశ్న

80 వేల రూపాయల కోసం ప్రశ్న

వీటిలో తెలంగాణలోని ట్రైసీటిలో భాగం కాని నగరం ఏది?
a) వరంగల్
b) హన్మకొండ
c) ఖమ్మం
d) కాజీపేట

Answer: ఖమ్మం

1 లక్ష 60 రూపాయల కోసం ప్రశ్న

1 లక్ష 60 రూపాయల కోసం ప్రశ్న

వీరిలో దు:ఖము లేని అని అర్ధం పేరు ఉన్న రాజు ఎవరు?
a) అశోకుడు
b) సముద్రగుప్తుడు
c) కనిష్కుడు
d) బిందుసారుడు

Answer: అశోకుడు

320000 రూపాయల కోసం ప్రశ్న

320000 రూపాయల కోసం ప్రశ్న

వీటిలో ఏ అంశాల్లో చేసిన కృషికి, 2021లో భౌతికశాస్త్రంలో మనాటే మరియుడ హోసెల్మాన్ నోబుల్ బహుమతిని పొందారు?
a) సాపేక్షత సిద్దాంతం
b) గ్లోబల్ వార్మింగ్
c) రేడియోయాక్టివిటి
d) ఉపపరమాణు కణాలు

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో నరసింహరావు 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. అయితే స్క్రీన్ మీద సాపేక్షత సిద్దాంతం, గ్లోబల్ వార్మింగ్ మిగిలాయి. అయితే నర్సింహారావు గ్లోబల్ వార్మింగ్ అని సమాధానం చెప్పి 320000 గెలుచుకొన్నారు.

Answer: గ్లోబల్ వార్మింగ్

వీటిలో, ఏ దేశపు రాజ్యాంగం యొక్క ప్రవేశిక వి ద పీపుల్ ఆఫ్ అనే మాటలతో మొదలవ్వదు?

వీటిలో, ఏ దేశపు రాజ్యాంగం యొక్క ప్రవేశిక వి ద పీపుల్ ఆఫ్ అనే మాటలతో మొదలవ్వదు?

a) బంగ్లాదేశ్
b) యూఎస్ఏ
c) దక్షిణాఫ్రికా
d) యునైటెడ్ కింగ్‌డమ్

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో నరసింహారావు తన వీడియో కాల్ లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. అయితే తన స్నేహితుడు కూడా సమాధానం సరిగా చెప్పలేకపోయాడు. దాంతో ఆయన బంగ్లాదేశ్ అని సమాధానం చెప్పి లాక్ చేశారు. అయితే నరసింహరావు తప్పు చెప్పడంతో గేమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో కంటెస్టెంట్ కోసం ప్రశ్న అడిగారు.

Answer: యునైటెడ్ కింగ్‌డమ్

మొదటి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

మొదటి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

మొదట ఉనికిలోకి వచ్చిన దానితో మొదలుపెట్టి ఈ మతాలను సరైన కాలక్రమంలో అమర్చండి
A) సిక్కు మతం
B) బౌద్ధమతం
C) క్రైస్తవ మతం
D) ఇస్లాం మతం

Answer: B, C, D, A

పై ప్రశ్నకు ఎవరూ కరెక్ట్ సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఈ సీజన్‌లో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో రెండోసారి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడించారు.

రెండవ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

రెండవ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

గరిష్ట పొడవు ఆధారంగా, వీటిని తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి
A) మామిడాకు
B) పూదీనా ఆకు
C) అరిటాకు
D) బొప్పాయి ఆకు

Answer: B, A, D, C

అచ్యుత అలియాస్ అచ్యుత వెంకట పద్మావతి సాయివళ్లి వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు.

 వీటిలో, బియ్యపు పిండి మరియు వేరుశనగపప్పు ప్రధాన పదార్థాలుగా తయారు చేసే కరకరలాడే రోటీ లాంటిది ఏది?

వీటిలో, బియ్యపు పిండి మరియు వేరుశనగపప్పు ప్రధాన పదార్థాలుగా తయారు చేసే కరకరలాడే రోటీ లాంటిది ఏది?

a) బొబ్బట్టు
b) పెసరట్టు
c) చపాతీ
d) సర్వపిండి

Answer: సర్వపిండి

వీటిలో సాధారణంగా రహదారి నిర్మాణాలలలో వాడని పదం ఏది?

వీటిలో సాధారణంగా రహదారి నిర్మాణాలలలో వాడని పదం ఏది?

b) ఓవర్ పాస్
c) ట్రెస్ పాస్
d) అండర్ పాస్

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మొదటి లైఫ్‌లైన్‌ను అచ్యుత ఉపయోగించుకొన్నారు. ఎక్కువ మంది ట్రెస్ పాస్ అని ఓటు వేయడంతో అదే సమాధానాన్ని చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

Answer: ట్రెస్ పాస్

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
 మురగ దేవుడికి అంకితమైన దేవాలయానికి ఈ పట్టణాలలో ఏవి ప్రసిద్ది చెందాయి?

మురగ దేవుడికి అంకితమైన దేవాలయానికి ఈ పట్టణాలలో ఏవి ప్రసిద్ది చెందాయి?

a) మహాబలేశ్వరం
b) పళని
c) ద్వారక
d) ధర్మస్థల

Answer: పళని

నాలుగో ప్రశ్న కోసం సిద్దమవుతుండటంతో శంఖం మోగింది. దాంతో ఆ రోజు ఆట ఆగినట్టు ఎన్టీఆర్ చెప్పారు. అచ్యుత రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X