NTR's EMK Oct 28th show: ఇద్దరిని కంగారుపెట్టిన ఎన్టీఆర్.. యంగ్ టైగర్ అభిమాని ఎంత గెలుచుకొన్నారో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో విశాఖపట్నంకు చెందిన అచ్యుత అలియాస్ అచ్యుత వెంకట పద్మావతి సాయివళ్లి వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. బుధవారం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అచ్యుత రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మారారు. అయితే ఆమె ఎంత గెలచుకొన్నారు. అచ్యుత తర్వాత మళ్లీ హాట్ సీట్‌పైకి వచ్చారనే విషయంలో వెళితే...

5000 రూపాయల కోసం ప్రశ్న
వీటిలో, ఏ క్రీడలో చైర్ అంపైర్ ఆటను నిర్వహిస్తాడు?
a) టెన్నిస్
b) హాకీ
c) పుట్‌బాల్
d) రగ్బీ
Answer: టెన్నిస్

10000 రూపాయల కోసం ప్రశ్న
ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి
a) ఫ్రాన్స్
b) ఇటలీ
c) స్పెయిన్
d) ఆస్ట్రియా
Answer: ఇటలీ

20000 రూపాయల కోసం ప్రశ్న
తెలంగాణ ప్రభుత్వ మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్ట్‌లో భాగంగా వీటిలో ప్రాథమికంగా వేటి ద్వారా వైద్య సరఫరాలను చేరవేస్తారు?
a) హెలికాప్టర్
b) హాట్ ఎయిర్ బలూన్
c) డ్రోన్
d) గైడెడ్ మిసైల్
Answer: డ్రోన్

40000 రూపాయల కోసం ప్రశ్న
హిందూ పురాణాలలో వీరిలో శతృంజయ అనే ఏనుగు కలవారు ఎవరు?
a) రాముడు
b) కృష్ణుడు
c) భీముడు
d) లక్ష్మణుడు
పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ చేయడంతో తన తండ్రి స్నేహితుడి సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు. దాంతో అచ్యుత మరో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించకోవడంతో రాముడు, లక్ష్మణుడు మిగిలాయి. దాంతో ఆమె రాముడు జవాబు చెప్పి ముందుకెళ్లారు.

80000 రూపాయల కోసం ప్రశ్న
కాఫీ మొక్క ఏ ఖండంలో నుండి వచ్చింది?
a) దక్షిణ అమెరికా
b) ఆస్ట్రేలియా
c) ఐరోపా
d) ఆఫ్రికా
పై ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో ఆమె గేమ్ నుంచి అవుట్ అయ్యారు. తప్పు సమాధానం చెప్పడంతో 10000 రూపాయలతో గేమ్ నుంచి వెళ్లిపోయారు.

మొదటి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్
పరిపాలన పరిధి ఆధారంగా వీటిని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి
A) రాష్ట్రం
B) మండలం
C) జిల్లా
D) గ్రామ పంచాయితి
Answer: D, B, C, A
పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పి మురళీధర్ హాట్ సీట్‌పైకి వచ్చారు. ఎన్టీఆర్‌తో కలిసి గేమ్‌ను మొదలుపెట్టారు.

రూ. 1000 కోసం మొదటి ప్రశ్న
వీటిలో ఏ కంపెనీ ద్వారా తయారు చేయబడిన అనేక ఉత్పత్తులు పేర్లు i అక్షరంతో మొదలవుతాయి?
a) గూగుల్
b) ఫేస్‌బుక్
c) టెస్లా
d) ఆపిల్
Answer: ఆపిల్

రూ. 2000 కోసం మొదటి ప్రశ్న
ఈ చిత్రంలో ఈకను బట్టి పక్షిని గుర్తించండి
a) డేగ
b) నెమలి
c) పెంగ్విన్
d) గుడ్లగూబ
Answer: నెమలి

రూ. 3000 కోసం మొదటి ప్రశ్న
హిందూ పురాణాలలో, వీరిలో ముక్కోపిగా తెలిసినవారు ఎవరు?
a) నారదుడు
b) దుర్వాసుడు
c) కాముడు
d) విదురుడు
Answer: దుర్వాసుడు

రూ. 5000 కోసం మొదటి ప్రశ్న
ఈ పాట ఏ చిత్రంలోనిదో గుర్తించండి
a) అజ్దాతవాసి
b) వకీల్ సాబ్
c) తీన్‌మార్
d) జల్సా
పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్ పోల్ లైఫ్‌లైన్ ఉయోగించుకొన్నారు. ఎక్కువ మంది అజ్దాతవాసికి ఓటు వేయడంతో దానిని తన జవాబు చెప్పి ముందుకెళ్లారు.

రూ. 10000 కోసం మొదటి ప్రశ్న
ఈ పేర్లలో ఏ పేరుతో మోహన్దాస్ కే గాంధీ ప్రసిద్దిగాంచలేదు?
a) బాపు
b) జాతిపిత
c) చాచా
d) మహాత్మా
Answer: చాచా
Recommended Video

రూ. 20000 కోసం మొదటి ప్రశ్న
ఈ సంఘటనలలో ఏది 2022లో జరుగబోతున్నది?
a) క్రికెట్ ప్రపంచ కప్పు
b) వేసవి ఒలంపిక్స్
c) యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్
d) శీతాకాల ఒలింపిక్స్
Answer: శీతాకాల ఒలింపిక్స్
పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. అందులో వేసవి ఒలింపిక్, శీతాకాల ఒలంపిక్ మిగిలాయి. అయితే వేసవి ఒలింపిక్ అని తప్పుడు సమాధానం చెప్పి మురళీధర్ గేమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన అవుట్ అయిన తర్వాత శంఖం మోగింది. దాంతో ఈవారం ఆటకు తెరపడింది.


Click it and Unblock the Notifications











