twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK October 4th show: ఒకే రోజు ఇద్దరు అవుట్.. ముగ్గురితో ఎన్టీఆర్.. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులను మెప్పిస్తూ సాగుతున్నది. ఎన్టీఆర్ హోస్టింగ్ అందర్నీ ఆకట్టుకొంటూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గత గురువారం హాట్ సీట్‌పైకి వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన రవి ప్రకాశ్ రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా గేమ్‌ ఆడటానికి వచ్చారు. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆప్టిట్యూడ్ ట్రైనర్‌గా పనిచేసే రవి ప్రకాశ్ ఏ సమాధానం వద్ద తడబట్టారు. ఆ తర్వాత వచ్చిన సూరజ్ పరిస్థితి ఏమిటనే విషయంలోకి వెళితే...

    640000 రూపాయల కోసం ప్రశ్న

    640000 రూపాయల కోసం ప్రశ్న

    1915లో ఎస్ఎస్ అరేబియా అనే ఓడలో గాంధీ ఏ దేశం నుంచి భారతదేశానికి వచ్చారు?
    a) దక్షిణాఫ్రికా
    b) యూఎస్ఏ
    c) ఇంగ్లాండ్
    d) సింగపూర్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. అయితే తన స్నేహితుడు దక్షిణాఫ్రికా అని సమాధానం చెప్పారు. 90 శాతం దక్షిణాఫ్రికా అని అన్నారు. దాంతో దక్షిణాఫ్రికా జవాబును ఫిక్స్ చేశారు. అయితే తప్పుడు సమాధానం కావడంతో గేమ్ నుంచి 360000 తీసుకొని బయటకు వచ్చారు.

    Answer: ఇంగ్లాండ్

    రవి ప్రకాశ్ గేమ్ నుంచి అవుట్ కావడంతో మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న వేశారు. అయితే

    రవి ప్రకాశ్ గేమ్ నుంచి అవుట్ కావడంతో మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న వేశారు. అయితే

    ఈ వాహనాలను వాటి గరిష్ట వేగం ఆధారంగా, తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి.

    A) ఎడ్లబండి
    B) ఆటోరిక్షా
    C) స్పేస్ రాకెట్
    D) రేస్ కారు

    Answer: A, B, D, C

    పై ప్రశ్నకు అతి వేగంగా విజయవాడకు చెందిన సూరజ్ వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. మూడు సంవత్సరాల అమెరికాలో పనిచేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.

    1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో మసాల దినుసు కానిది ఏది?

    a) పసుపు
    b) లవంగం
    c) ఉప్పు
    d) మిరియాలు

    Answer: ఉప్పు

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2018 చిత్రం భరత్ అనే నేను‌లో మహేష్ బాబు నటించిన పాత్ర ఏ పదవి పోషిస్తుంది?
    a) జిల్లా కలెక్టర్
    b) ముఖ్యమంత్రి
    c) ప్రధానమంత్రి
    d) ప్రధాన న్యాయమూర్తి

    Answer: ముఖ్యమంత్రి

    3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో నియమాలను ఉల్లంఘిస్తే పసుపు మరియు ఎరుపు కార్డులు ఇచ్చే ఆట ఏది?
    a) క్రికెట్
    b) బాస్కెట్ బాల్
    c) గోల్ఫ్
    d) ఫుట్‌బాల్

    Answer:ఫుట్‌బాల్

    5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ హిందూ దేవుళ్లలో సాధారణంగా కమలంలో కూర్చున్నట్టు కనిపించేది ఎవరు?
    a) బ్రహ్మ
    b) వాయువు
    c) గణేశుడు
    d) శివుడు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. ఎక్కువ మంది చెప్పిన బ్రహ్మ సమాధానాన్ని సూరజ్ తన జవాబుగా చెప్పి ముందుకెళ్లాడు.

    Answer:బ్రహ్మ

    10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో జంతు ప్రపంచంలో పిల్లి కుటుంబంలో భాగం కానిది ఏది?

    a) సింహం
    b) పులి
    c) చిరుత
    d) ఎలుగుబంటి

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నాడు. అయితే సింహం, ఎలుగుబంటి స్క్రీన్ పై మిగలడంతో ఎలుగుబంటి సమాధానం చెప్పి సూరజ్ తన గేమ్‌లో ముందుకెళ్లాడు.

    Answer:ఎలుగుబంటి

    20000 రూపాయల కోసం ప్రశ్న

    20000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో ఏ దేశానికి రాజు లేదా రాణి ఉంటారు?
    a) యునైటెడ్ కింగ్‌డమ్
    b) యూఎస్ఏ
    c) పాకిస్థాన్
    d) చైనా

    Answer: యునైటెడ్ కింగ్‌డమ్

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న

    భారత రెవెన్యూ శాఖ యొక్క దర్యాప్తు సంస్థ ఈడీలో ఈ దేనిని సూచిస్తుంది?
    a) ఎమర్జెన్సీ
    b) ఎరాడికేషన్
    c) ఎంటర్‌టైన్‌మెంట్
    d) ఎన్‌ఫోర్స్‌మెంట్

    Answer:ఎన్‌ఫోర్స్‌మెంట్

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ చిత్రంలోని నిర్మాణం ఎక్కవ ఉన్నదో గుర్తించండి

    a) కచ్
    b) కన్యాకుమారి
    c) కలకత్తా
    d) కార్వార్

    పై ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పడంతో సూరజ్ గేమ్ నుంచి అవుట్ అయ్యారు. కేవలం 10000 రూపాయలు తీసుకొని గేమ్ నుంచి వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నను వేశారు.

    Answer: కన్యాకుమారి

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
     సూరజ్ అవుట్ అయిన తర్వాత నిర్వహించిన ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

    సూరజ్ అవుట్ అయిన తర్వాత నిర్వహించిన ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

    2021లో జరిగిన ఈ సంఘటనలను కాలక్రమంలో అమర్చండి

    A) గణతంత్ర దినోత్సవ పరేడ్
    B) టోక్యో ఒలంపిక్స్
    C) అఫ్గనిస్తాన్ నుంచి యూఎస్ నిష్క్రమణ
    D) ఐపీఎల్ ప్రారంభం


    Answer: A, D, B, C

    పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన లేడి కంటెస్టెంట్ ప్రత్యూష 6.7 సెకన్లలో సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. అయితే శంఖం మోగడంతో సోమవారం గేమ్ ముగిసింది.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 4th Episode: Ravi Prakash, Suraj out from the EMK Game.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X