twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK October 5th show: కోటి రూపాయలపై కన్నేసిన హైదరాబాద్ అమ్మాయి.. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ గేమ్ షో మంచి రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. అక్టోబర్ 4వ తేదీన ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌లో వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి చేరిన హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష శంఖం మోగడంతో రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మారారు. అక్టోబర్ 5న ప్రసారమైన షోలో హాట్ సీట్‌పైకి వచ్చారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సినిమా రివ్యూ రాస్తూ బ్లాగ్‌ను కూడా నడుపుతున్నారు. అయితే అద్భుతంగా, సమయస్పూర్తితో ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఎన్టీఆర్‌ను ఆకట్టుకొన్నారు. అయితే 50 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు తన గేమ్‌ను కొనసాగించింది. చివరకు ఎంత గెలుచుకొని వెనుకకు వెళ్లారంటే..

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    వీటిలో ఆచారాల ప్రకారం, సంబంధాలు కలుపుకోవడానికి కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలవడాన్ని సూచించేది ఏది?

    a) కన్యాదానం
    b) వరపూజ
    c) పెళ్లిచూపులు
    d) కాశీయాత్ర

    Answer: పెళ్లిచూపులు

    తన భర్తను పెళ్లికి ముందు మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా పరిచయం జరిగింది. ఆ తర్వాత ఇద్దరం కొంత కాలం మాట్లాడుకొన్న తర్వాత ఫార్మల్‌గా పెళ్లిచూపులు జరిగాయి. ఆ తర్వాత దంపతులుగా మారిపోయామని ప్రత్యూష చెప్పారు.

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    వీటిలో ప్రధానంగా డెనిమ్ అనే మెటిరియల్ నుండి తయారు చేయబడేది ఏది?
    a) జీన్స్
    b) సాక్స్
    c) టైస్
    d) గ్లవ్స్

    Answer: జీన్స్

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    వీటిలో ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలలో ప్రఖ్యాతిగాంచినవి ఏవి?

    a) డచ్ కేఫ్
    b) ఇరానీ కేఫ్
    c) అరేబియన్ కేఫ్
    d) రష్యన్ కేఫ్

    Answer:ఇరానీ కేఫ్

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    హిందూ పురాణాల్లో ఒక పక్షి వాహనంగా కలిగిన దేవుడు ఎవరు?
    a) శివుడు
    b) విష్ణువు
    c) అగ్ని
    d) వరుణుడు

    Answer: విష్ణువు

     10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    ప్రామాణికంగా ఈ సంగీత వాయిద్యాలలో 88 కీలు కలిగినవి ఏది?
    a) పియానో
    b) పిల్లన గోవి
    c) డ్రమ్స్
    d) వయోలిన్

    Answer: పియానో

    20000 రూపాయల కోసం 6వ ప్రశ్న

    20000 రూపాయల కోసం 6వ ప్రశ్న

    ఈ చిత్రంలోని క్రీడాకారిణిని గుర్తించండి?
    a) హర్మన్ ప్రీత్ కౌర్
    b) పూనమ్ రౌత్
    c) జూలన్ గోస్వామి
    d) మిథాలీ రాజ్

    Answer: మిథాలీ రాజ్

    40000 రూపాయల కోసం 7వ ప్రశ్న

    40000 రూపాయల కోసం 7వ ప్రశ్న

    ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రంలోనిదో గుర్తించండి

    a) శ్రీరామదాసు
    b) అన్నమయ్య
    c) ఓం నమో వెంకటేశాయ
    d) పాండురంగడు

    Answer: అన్నమయ్య

     80000 రూపాయల కోసం 8వ ప్రశ్న

    80000 రూపాయల కోసం 8వ ప్రశ్న

    ఈ తెలంగాణ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన ఉన్నది ఏది?

    a) ఆదిలాబాద్
    b) నిజామాబాద్
    c) సిద్దిపేట
    d) నల్గొండ

    Answer: నల్గొండ

    160000 రూపాయల కోసం 9వ ప్రశ్న

    160000 రూపాయల కోసం 9వ ప్రశ్న

    వీటిలో, గ్వీడో వాన్ రోసం కనిపెట్టిన ప్రఖ్యాత ప్రోగ్రామింగ్ భాష పేరు కలిగియున్న జంతువు ఏది?
    a) అనకొండ
    b) వైపర్
    c) పైతాన్
    d) కోబ్రా

    Answer: పైతాన్

    ప్రత్యూష చాలా వేగంగా ఆడుతుంటే.. ఎన్టీఆర్ ప్రశంసలు గుప్పించారు. అయితే మీ తల్లికి ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంది. ఇంతకు మీ తల్లికి ఏం జరిగింది? అంటే ఏలూరుకు సమీపంలో యాక్సిడెంట్ జరిగింది? మూడు రోజులు కోమాలో ఉన్నారు. ముఖంపై సర్జరీలు జరిగాయి అని చెప్పారు.

    320000 రూపాయల కోసం 10వ ప్రశ్న

    320000 రూపాయల కోసం 10వ ప్రశ్న

    సికింద్రాబాద్ మణుగూరుల మధ్య వరంగల్ మీదుగా నడిచే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు పేరుని ఏ రాజవంశం పేరు మీద పెట్టారు?
    a) పాండ్య
    b) చేర
    c) చోళ
    d) కాకతీయ

    Answer: కాకతీయ

    6,40,000 రూపాయల కోసం 11వ ప్రశ్న

    6,40,000 రూపాయల కోసం 11వ ప్రశ్న

    తన భార్య మెలిండాతో కలిస చేసిన సమాజిక సేవకు గాను పద్మభూషన్ పురస్కారం పొందిన వ్యక్తి వీటిలో ఏ సంస్థకు సహవ్యవస్తాపకుడు?
    a) మైక్రోసాఫ్ట్
    b) ఆపిల్
    c) ఫేస్‌బుక్
    d) అమెజాన్

    Answer: మైక్రోసాఫ్ట్

    Recommended Video

    MAA Elections: Prakash Raj VS Manchu Vishnu మంచు ఫ్యామిలీ కంటే నేనే మంచి తెలుగు మాట్లాడుతా..
    12,50,000 రూపాయల కోసం 12వ ప్రశ్న

    12,50,000 రూపాయల కోసం 12వ ప్రశ్న

    రోమన్ కాథలిక్ చర్చిక అధిపతి అయిన పోప్ ఫ్రాన్సిస్ ఏ దేశానికి చెందిన వారు?
    a) జర్మనీ
    b) అర్జెంటీనా
    c) మెక్సికో
    d) సిరియా

    Answer: అర్జెంటీనా

    పై ప్రశ్నకు సమాధానం చెప్పి ఎన్టీఆర్ మనసు గెలుచుకొన్నారు.. అయితే తదుపరి ప్రశ్నకు వెళ్తుండగా.. శంఖం మోగింది. దాంతో మంగళవారం ఆట నిలిచిపోయింది. 1250000 గెలుచుకొన్న ప్రత్యూష 50 లక్షల రూపాయల ప్రశ్నను ఎదుర్కొనేందుకు కూడా సిద్దమయ్యారనేది ప్రోమోలో చూపించి బుధవారం ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచారు.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 5th Episode: Pratyusha of hyderabad is chasing for One crore. She won 1250000 rupees on October 5th episode. And turns as roll over contest for October 6th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X