For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK October 6th show: 50 లక్షల ప్రశ్నకు ప్రత్యూష జవాబు.. ఎన్టీఆర్‌కు షాక్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా

  |

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రోల్ ఓవర్ కంటెస్ట్ ప్రత్యూష ఇప్పటికే 1250000 కోట్లు గెలుచుకొని హాట్ సీట్‌పై ఉన్నారు. 25 లక్షల ప్రశ్నకు ప్రత్యూష సిద్ధమైంది. ఈ ఆటలో ప్రత్యూష కోటి రూపాయలు గెలుచుకొన్నారా అనే విషయంలోకి వెళ్తే...

  2500000 రూపాయల కోసం

  2500000 రూపాయల కోసం

  లాటిన్ పరిభాషలో కరోనావైరస్ పదంలో కరోనా అంటే అర్ధం ఏమిటి?
  a) కిరీటం
  b) విషం
  c) తోక
  d) గ్రహణం

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. కరెక్ట్ సమాధానం కోసం 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ మీద కిరీటం, విషం ఆప్షన్లు మిగిలాయి. అయితే కరోనా జవాబు ఫిక్స్ చేసుకొని 25 లక్షలు గెలుచుకొన్నారు. అయితే లాటిన్ భాషలో కరోనాను కిరీటం అని ఎందుకు అంటారంటే.. మైక్రో స్కోప్‌లో చూస్తే.. కరోనావైరస్ ఆకారం కిరీటం మాదిరిగా కనిపిస్తుందట. అందుకే లాటిన్‌లో కిరీటంగా వ్యవహరిస్తున్నారు.

  Answer: కిరీటం

  5000000 రూపాయల ప్రశ్న కోసం

  5000000 రూపాయల ప్రశ్న కోసం

  2000 మొదలైన కొత్త మిలీనియంలో భారత తపాల శాఖ విడుదల చేసిన మొదటి స్మారక తపాల బిల్ల మీద వీరిలో కనిపించిన వ్యక్తి ఎవరు?

  a) ఎన్‌జీ రంగా
  b) పొట్టి శ్రీరాములు
  c) ఎన్టీ రామారావు
  d) బూర్గుల రామకృష్ణారావు

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ లైఫ్‌లైన్ ఉయోగించుకొన్నారు. తన సోదరుడు రోహిత్‌కు కాల్ చేశారు. అయితే అతడు సరైన సమాధానం చెప్పడంలో విఫలమయ్యాడు. దాంతో ప్రత్యూష టెన్షన్‌లో పడ్డారు. అయితే ఎన్టీఆర్ అని సమాధానం చెప్పారు. కానీ జవాబు బూర్గుల రామకృష్ణరావు కావడంతో ఆమె గేమ్ నుంచి అవుట్ అయ్యారు. 25 లక్షలు గెలుచుకొన్న ప్రత్యూష 25 లక్షల రూపాయల నుంచి 320000 రూపాయలకు పడిపోయారు. 3.20 లక్షలు గెలుచుకొని గేమ్ నుంచి నిష్క్రమించారు. మార్చి 13, 2000 రోజున తపాలశాఖ ఈ స్టాంపును విడుదల చేసింది.

  Answer: బూర్గుల రామకృష్ణారావు

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  ప్రస్తుత వారంలో మూడు రోజులు పాటు హాట్ సీట్‌పైన ప్రత్యూష ఉన్నారు. ఓ తప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్పి భారీ మూల్యం చెల్లించుకొన్నారు. ఆ తర్వాత పాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నను కంటెస్టెంట్ల ముందుకు తెచ్చారు.

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  సగటు ఉష్ణోగ్రత ఆధారంగా, వీటిని తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

  a) మానవ శరీరం
  b) ఐస్ క్యూబ్
  c) లావా
  d) మరిగే నీళ్లు

  Answer: B, A, D, C

  పై ప్రశ్నకు విజయనగరం జిల్లాలోని చింతపల్లిపేటకు చెందిన నాగరాణి వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. మంచి గాయని, సంగీతం నేర్చుకోవాలని అనుకొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొంది తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకొంటున్నారు.

  1000 రూపాయల ప్రశ్న కోసం

  1000 రూపాయల ప్రశ్న కోసం

  ఘల్లు ఘల్లు అని శబ్దం వినిపించే ఆభరణం ఏమిటి?

  a) హారం
  b) ముక్కుపుడక
  c) గజ్జెలు
  d) కమ్మలు

  Answer:గజ్జెలు

  2000 రూపాయల ప్రశ్న కోసం

  2000 రూపాయల ప్రశ్న కోసం


  ఈ సామెతను పూర్తి చేయండిఫ తంతే ---- గంపలో పడ్డట్టు
  a) కొబ్బరి
  b) బూరెల
  c) పండ్ల
  d) ఆకులు

  Answer: బూరెల

  3000 రూపాయల ప్రశ్న కోసం

  3000 రూపాయల ప్రశ్న కోసం


  మగధీర చిత్రంలో షేర్ ఖాన్ పాత్రలో నటించింది ఎవరు?
  a) ప్రకాశ్ రాజ్
  b) సాయికుమార్
  c) శ్రీహరి
  d) సోనుసూద్

  Answer: శ్రీహరి

  5000 రూపాయల ప్రశ్న కోసం

  5000 రూపాయల ప్రశ్న కోసం


  వీటిలో వలుచుకొని తినే పండు ఏది
  a) అరటి పండు
  b) యాపిల్
  c) ద్రాక్ష
  d) జామ

  Answer: అరటిపండు

  10000 రూపాయల ప్రశ్న కోసం

  10000 రూపాయల ప్రశ్న కోసం


  సాధారణంగా, అత్యవసరంగా చైన్ లాగి దేనిని ఆపవచ్చు?
  a) బస్
  b) రైలు
  c) ఆటో రిక్షా
  d) విమానం

  20000 రూపాయల ప్రశ్న కోసం

  20000 రూపాయల ప్రశ్న కోసం


  వీటిలో కంప్యూటర్లు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అనే అర్ధాన్ని ఇచ్చే పదం ఏది?
  a) మీటర్
  b) సైబర్
  c) హైపర్
  d) టిండర్

  Answer: సైబర్

  40000 రూపాయల ప్రశ్న కోసం

  40000 రూపాయల ప్రశ్న కోసం


  ఈ స్వాతంత్య సమరయోధుడిని గుర్తించండి?
  a) జవహర్ లాల్ నెహ్రూ
  b) సయ్యద్ ఆహ్మద్ ఖాన్
  c) రాజేంద్ర ప్రసాద్
  d) బీఆర్ అంబేద్కర్

  Answer: బీఆర్ అంబేద్కర్

  కరోనాని కరివేపాకు లా తీసిపడేసిన Jr NTR | తారక్ పంచ్ లు
  80000 రూపాయల ప్రశ్న కోసం

  80000 రూపాయల ప్రశ్న కోసం


  ఆరెంజ్ ఆర్మీ అనే పదం ఏ ఐపీఎల్ జట్టుకు సంబంధించినది?
  a) సన్ రైజర్స్ హైదరాబాద్
  b) పంజాబ్ కింగ్స్
  c) రాజస్థాన్ రాయల్స్
  d) చెన్నై సూపర్ కింగ్స్

  Answer: సన్ రైజర్స్ హైదరాబాద్

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show October 6th Episode: Pratyusha of hyderabad is chasing for One crore. She won 1250000 rupees on October 6th episode. And turns as roll over contest for October 6th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X