twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK October 7th show: ఎన్టీఆర్ షోలో ఒకే రోజు ఇద్దరు అవుట్.. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో విజయనగరం జిల్లాలోని చింతపల్లిపేటకు చెందిన నాగరాణి వేగంగా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పి బుధవారం హాట్ సీట్‌పైకి వచ్చారు. మంచి గాయని, సంగీతం నేర్చుకోవాలని అనుకొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొంది తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకొంటున్నారు. అయితే అక్టోబర్ 6వ తేదీన 80 వేల రూపాయలు గెలుచుకొన్న నాగమణి.. రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా ఎన్టీఆర్‌తో కలిసి గేమ్ ఆడారు. ఆమె ఎంత గెలుచుకొన్నారు? కోటి రూపాయలు గెలుచుకోవడంలో సఫలమయ్యారా అనే విషయాల్లోకి వెళితే..

    160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    జూన్ 2021లో, వరంగల్ అర్బన్ జిల్లా పేరును వీటిలో ఏ పేరుగా మార్చనున్నట్టు ప్రకటించారు?
    a) ఖాజీపేట
    b) హన్మకొండ
    c) జయశంకర్
    d) ఓరుగల్లు

    Answer: హన్మకొండ

    ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే ఎక్కువ మంది హన్మకొండ అని సమాధానం ఇవ్వడంతో అదే సమాధానాన్ని చెప్పారు. దాంతో 160000 గెలుచుకొన్నారు.

    320000 రూపాయల కోసం ప్రశ్న

    320000 రూపాయల కోసం ప్రశ్న

    నూర్జహాన్ ఈ మొఘల్ చక్రవర్తులలో ఎవరి భార్య
    a) అక్బర్
    b) హుమాయూన్
    c) ఔరంగజేబ్
    d) జహంగీర్

    Answer: జహంగీర్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మరో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. పై ప్రశ్నకు మొదట 50:50 లైఫ్‌లైన్‌ను, ఆ తర్వాత వీడియో కాల్ ఆప్షన్‌ను వినియోగించుకొన్నారు. తన స్నేహితుడు జహంగీర్ అని చెప్పడంతో అదే జవాబును చెప్పి 320000 రూపాయలు గెలుచుకొన్నారు.

    640000 రూపాయల కోసం ప్రశ్న

    640000 రూపాయల కోసం ప్రశ్న

    వాస్కోడగామా ఏ దేశం నుంచి బయలుదేరారు?
    a) ఇటలీ
    b) స్పెయిన్
    c) పోర్చుగల్
    d) డెన్మార్క్

    Answer: పోర్చుగల్

    640000 రూపాయల కోసం ప్రశ్న

    640000 రూపాయల కోసం ప్రశ్న

    రామాయణంలో, సీతారాములు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు సీతమీద దాడి చేసిన రాక్షసుడు ఎవరు?
    a) జటాసురుడు
    b) విరాధుడు
    c) ప్రహస్తుడు
    d) కంబంధుడు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యారు. దాంతో ఆమె 640000 రూపాయలు గెలుచుకొని గేమ్ నుంచి నిష్క్రమించారు.

    Answer: విరాధుడు

     ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఈ సేవలు, అవి భారతదేశానికి అందుబాటులోకి వచ్చిన కాలక్రమంలో అమర్చండి

    A) విమానయానం
    B) ఇంటర్నెట్
    C) రైల్వేలు
    D) షిప్పింగ్

    Answer: D, C, A, B

    నాగరాణి నిష్క్రమించడంతో మళ్లీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడారు. అందులో యాదాద్రికి చెందిన హేమలత వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. టీచర్‌గా పనిచేస్తున్న హేమలత ఎంఏ ఎకనామిక్స్ చదువుకొన్నారు.

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    ఈ సామెతను పూర్తి చేయండి: ----- పుడకలాగా
    a) రసగుల్లాలో
    b) ముంజల్లో
    c) పానకంలో
    d) అడ్డులో

    Answer: పానకంలో

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    వీటిలో, దేనికి విద్యుత్ అవసరం లేకుండా పనిచేస్తుంది?
    a) మిక్సర్ గ్రైండర్
    b) ప్రెషర్ కుక్కర్
    c) రిఫ్రిజిరేటర్
    d) మైక్రోవేవ్ ఓెన్

    Answer: ప్రెషర్ కుక్కర్

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    హిందూ పురాణాలలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపిన విష్ణుమూర్తి అవతారం ఏది?

    a) వరాహ
    b) మత్స్య
    c) వామన
    d) కల్కి

    Answer: వరాహ

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    సాధారణంగా కాఫీ పౌడర్ ప్యాకెట్‌లో ఏ వేరు మొక్క నుంచి తీసిన పొడిని కలుపుతారు?
    a) చికోరి
    b) అల్లం
    c) పసుపు
    d) వెల్లుల్లి

    Answer: చికోరి

     10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    వీటిలో మీటుతూ వాయించే వాయిద్యం ఏది?

    a) కంజీరా
    b) ఘటం
    c) మృదంగం
    d) వీణ

    Answer: వీణ

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    ఒలంపిక్స్‌లో భారత్ ఏ వ్యక్తిగత క్రీడలో అత్యధిక పతకాలు సాధించింది?
    a) బాక్సింగ్
    b) బాడ్మింటన్
    c) రెజ్లింగ్
    d) షూటింగ్

    Answer: రెజ్లింగ్

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    వీటిలో భారతదేశపు సరికొత్త కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం ఏది?
    a) డామన్
    b) లద్దాఖ్
    c) అండమాన్
    d) చంఢీగడ్

    Answer: డామన్

    అయితే పై పశ్నకు సమాధానం చెప్పడంతో కేవలం పదివేల రూపాయలు గెలుచుకొని హేమలత గేమ్ నుంచి అవుట్ అయ్యారు. ఆ తర్వాత శంఖం మోగడంతో ఈ వారానికి గేమ్ పూర్తిఅయింది. వచ్చేవారం సరికొత్త కంటెస్టెంట్లతో గేమ్ ప్రారంభమవుతుంది.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 7th Episode: Nagamani of Vijayanagaram. She won 640000 and quit the game after unable to answer to 1250000 rupees question.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X