NTR's EMK Sept 29th Show: ఎన్టీఆర్‌కే షాకిచ్చిన విశాఖపట్నం యువతి.. కోటిపై దృష్టిపెట్టిన మోనిత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ గేమ్‌ గ్రాండ్‌గా కొనసాగుతున్నది. ఎన్టీఆర్ వేస్తున్న ప్రశ్నలకు ప్రతిభావంతులైన కంటెస్టెంట్లు సమాధానాలు చెబుతూ భారీగా సొమ్మును గెలుచుకొంటున్నారు. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో విశాఖపట్నంకు చెందిన మోనిషా హాట్ సీట్‌పైకి వచ్చారు. మోనిషా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ అధికారి కావాలని కోరుకొంటున్నారు. ఆమె ఎంత గెలుచుకొన్నారు. ఎలాంటి ప్రశ్నలకు తడబాటుకు గురయ్యారు. ఎన్టీఆర్‌ను ఎలా ఆకట్టుకొన్నారనే విషయాల్లోకి వెళితే..

 హాట్ సీట్‌పైకి రావడానికి ఫాస్టెష్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

హాట్ సీట్‌పైకి రావడానికి ఫాస్టెష్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

వీటిలో, వారు ఆడే క్రీడను బట్టి తక్కువ నుంచి ఎక్కువ మందిని అమర్చండి
A) బాడ్మింటన్ డబుల్స్
B) చదరంగం
C) వాలీబాల్
D) క్రికెట్

Answer: B, A, C, D

పై ప్రశ్నకు కరెక్ట్‌గా, వేగంగా సమాధానం చెప్పిన మోనిషా హాట్ సీట్‌పైకి చేరారు. హాట్ సీట్‌పై ఉండి తన జర్నీ వీడియోను చూసి ఆటను మొదలుపెట్టారు.

1000 రూపాయల ప్రశ్న

1000 రూపాయల ప్రశ్న

సాంప్రదాయంగా, కాబోయే వధూవరులు నిశ్చితార్థ సమయంలో వీటిలో ఏం మార్చుకొంటారు?

a) పుస్తకాలు
b) తల్లిదండ్రులు
c) ఉంగరాలు
d) ఫేస్‌బుక్ పాస్‌వర్డులు

Answer: ఉంగరాలు

 2000 రూపాయల ప్రశ్న

2000 రూపాయల ప్రశ్న

కాపుచినో, మోకా, ఎస్ప్రెస్సో, ఫ్రాప్సే, ల్యాటే మొదలైనవి వీటిలో దేనిలో రకాలు?

a) టీ
b) కాఫీ
c) పండ్ల రసం
d) లస్సీ

Answer: కాఫీ

3000 రూపాయల ప్రశ్న

3000 రూపాయల ప్రశ్న

చెట్టు కాండాన్ని వాటి ముక్కుతో రంధ్రం చసి గూడు ఏర్పరుచుకొనే పక్షులు ఏవి?
a) బాతులు
b) నిప్పుకోళ్లు
c) పెంగ్విన్‌లు
d) వడ్రంగి పిట్టలు

Answer: వడ్రంగి పిట్టలు

5000 రూపాయల ప్రశ్న

5000 రూపాయల ప్రశ్న

రంజీ ట్రోఫి టోర్నమెంట్ ఏ క్రీడలో ఆడతారు?
a) ఫుట్‌బాల్
b) క్రికెట్
c) హాకీ
d) టెన్నిస్

Answer: క్రికెట్

10000 రూపాయల ప్రశ్న

10000 రూపాయల ప్రశ్న

టెక్ట్సింగ్‌లో ఉపయోగించే LOL అంటే ఏమిటి?
a) లవ్ ఆఫ్ లైఫ్
b) లివ్ అవర్ లైఫ్
c) లాఫ్ ఔట్ లౌడ్
d) లివ్ ఆఫ్ లాంగ్

Answer: లాఫ్ ఔట్ లౌడ్

 20000 రూపాయల ప్రశ్న

20000 రూపాయల ప్రశ్న

ఈ పాట పాడిన సంగీత దర్శకుడిని గుర్తించండి
a) రమణ గోగుల
b) దేవీ శ్రీ ప్రసాద్
c) RP పట్నాయక్
d) తమన్

Answer: రమణ గోగుల

40000 రూపాయల ప్రశ్న

40000 రూపాయల ప్రశ్న

వీటిలో సాధారణంగా ఎరుపు రంగులో ఉండే రత్నం ఏది?
a) పచ్చ
b) నీలం
c) కెంపు
d) ముత్యం

Answer: కెంపు

80000 రూపాయల ప్రశ్న

80000 రూపాయల ప్రశ్న

వీరిలో ఎవరు ఎర్రగులాబీని వారి జాకెట్ బటన్‌లో పెట్టుకొనే వారు
a) భగత్ సింగ్
b) జవహర్ లాల్ నెహ్రూ
c) మహాత్మా గాంధీ
d) సుభాష్ చంద్రబోస్

Answer: జవహర్ లాల్ నెహ్రూ

160000 రూపాయల ప్రశ్న

160000 రూపాయల ప్రశ్న

హిందూ పురాణాలలో, బాణం కలిగి ఉన్న రాముడిని వీటిలో ఏ పేరుతో పిలుస్తారు?

a) జానకీ వల్లభ
b) కౌసలేయ
c) కోదండరామ
d) రాజీవ్

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మోనిషా లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ లైఫ్‌లైన్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. అయితే ఎక్కువ మంది కోదండరామ అని సమాధానం ఇవ్వడంతో ఆమె అదే సమాధానాన్ని చెప్పి 160000 గెలుచుకొన్నారు.

Answer: కోదండరామ

320000 రూపాయల ప్రశ్న

320000 రూపాయల ప్రశ్న

లేపాక్షి హస్తకళల చిహ్నంలో వీటిలో ఏది కనిపిస్తుంది?
a) పెయింట్ బ్రష్
b) వయోలిన్
c) పక్షి
d) కీలుబొమ్మ

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మళ్లీ లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకోవడంతో పక్షి, వయోలిన్ ఆప్షన్లు మిగిలాయి. అయితే పక్షి అనే సమాధానం చెప్పి 320000 రూపాయలను గెలుచుకొన్నారు.

Answer: పక్షి

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
 640000 రూపాయల ప్రశ్న

640000 రూపాయల ప్రశ్న

640000 రూపాయల ప్రశ్న
సరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు ఏ భారత రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేస్తున్నారు?
a) ఉత్తర ప్రదేశ్
b) పశ్చిమ బెంగాల్
c) ఉత్తరాఖండ్
d) మధ్య ప్రదేశ్

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియోకాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. తన స్నేహితురాలికి ఫోన్ చేయడంతో ఆమె పశ్చిమ బెంగాల్ అని సమాధానం చెప్పారు. దాంతో ఆమె అదే సమాధానం చెప్పి 640000 గెలుచుకొన్నారు.

Answer: పశ్చిమ బెంగాల్


అప్పటికే శంఖం మోగడంతో ఆట ఆగిపోయింది. విశాఖపట్నంకు చెందిన మోనిష మళ్లీ గురువారం రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా గేమ్ మొదలుపెట్టనున్నారు. గురువారం మోనిష ఎంత గెలుచుకొంటారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X