For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show అబ్దుల్ కలాంపై 640000 ప్రశ్న.. జవాబు చెప్పలేకపోయిన కంటెస్టెంట్.. మీరు చెప్పగలరా?

  |

  ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో చాలా జనరంజకంగా సాగుతున్నది. ప్రతిభావంతులు తన సామర్థ్యాన్ని నిరూపించుకొంటూ భారీ మొత్తాలను గెలుచుకొంటున్నారు. తాజా ఎపిసోడ్‌లో హైదరాబాద్‌కు చెందిన శివానీ హాట్ సీట్‌పై అద్భుతంగా తన ప్రతిభను చాటుకొన్నారు. ఎంబీఏ చదువుతున్న ఈ యువతి పేదరికాన్ని, కుటుంబ సమస్యలను అధిగమించి చదువులో ప్రతిభను చాటుకొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ ముందు హాట్ సీట్‌పై శివానీ ఎంత గెలుచుకొన్నది? ఆమె ఏ ప్రశ్నలకు తడబాటుకు గురైంది? ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా? ఓ సారి వాటిపై మీరు లుక్కేయండి..

  డిసెంబర్ 1 తేదీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

  డిసెంబర్ 1 తేదీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

  మానవ శరీరంలోని ఈ భాగాలను వరుసగా పై నుంచి కిందకు అమర్చండి

  A) మోకాళ్లు
  B) మెదడు
  C) స్వరపేటిక
  D) ఊపిరితిత్తులు

  పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన హైదరాబాద్‌కు చెందిన శివానీ హాట్ సీట్‌పైకి వచ్చి ఎవరు మీలో కోటీశ్వరులు ఆడే అవకాశాన్ని దక్కించుకొన్నారు. ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా తన గేమ్‌ను కొనసాగించారు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలు ఇవే..

  Answer: B, C, D, A

  Rs. 1000 కోసం ప్రశ్న

  Rs. 1000 కోసం ప్రశ్న

  వీటిలో ఏదీ సాధారణంగా జతగా రాదు?
  a) చెవి కమ్మలు
  b) కాలి మెట్టలు
  c) షూస్
  d) హారం

  Answer: హారం

   Rs. 2000 కోసం ప్రశ్న

  Rs. 2000 కోసం ప్రశ్న

  2007 చిత్రం యమదొంగలో చిత్రగుప్తుడు పాత్రలో నటించింది ఎవరు?
  a) ఆలీ
  b) బ్రహ్మానందం
  c) మోహన్ బాబు
  d) నరేష్

  Answer: బ్రహ్మానందం

   Rs. 3000 కోసం ప్రశ్న

  Rs. 3000 కోసం ప్రశ్న

  ఈ గృహోపకరణాలలో సాధారణంగా ఉష్ణోగ్రతను సరిచేసుకోవడానికి వాడే పరికరం ఏది?
  a) కంప్యూటర్
  b) టెలివిజన్
  c) ఫ్యాన్
  d) ఎయిర్ కండీషనర్

  Answer: ఎయిర్ కండీషనర్

  Rs. 5000 కోసం ప్రశ్న

  Rs. 5000 కోసం ప్రశ్న


  వీటిలో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో ప్రధాన పదార్థం ఏది?
  a) బంగాళ దుంపలు
  b) ఉల్లిపాయలు
  c) గుమ్మడి కాయలు
  d) బీన్స్

  Answer: బంగాళ దుంపలు

  Rs. 10000 కోసం ప్రశ్న

  Rs. 10000 కోసం ప్రశ్న


  వీటిలో ఏ జంతువు యొక్క శరీరం ఛారలతో కప్పబడి ఉంటుంది?
  a) జీబ్రా
  b) జిరాఫీ
  c) ఎలుగుబంటి
  d) సింహం

  Answer: జీబ్రా

  Rs. 20000 కోసం ప్రశ్న

  Rs. 20000 కోసం ప్రశ్న


  ఈ జంటపదాలలో వాడుకలో ఉపయోగించని జత ఏది?
  a) అందచందాలు
  b) ధనధాన్యాలు
  c) ఆటతోట
  d) తప్పుఒప్పులు

  Answer: ఆటతోట

   Rs. 40000 కోసం ప్రశ్న

  Rs. 40000 కోసం ప్రశ్న

  ఈ చిత్రంలోని వస్తువుని గుర్తించండి?
  a) మైక్రోస్కోప్
  b) కెలిడియోస్కోప్
  c) పెరీ స్కోప్
  d) టెలిస్కోప్

  Answer: టెలిస్కోప్

  Rs. 80000 కోసం ప్రశ్న

  Rs. 80000 కోసం ప్రశ్న

  వీటిలో దేనిలోని పోస్టులకు లైక్, కేర్, హాహా, స్యాడ్, యాంగ్రీ మరియు వావ్ రియాక్షన్లు ఇవ్వచ్చు
  a) ట్విట్టర్
  b) ఫేస్‌బుక్
  c) కూ
  d) యూట్యూబ్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో శివానీ తన తొలి లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ పై ఫేస్‌బుక్, యూట్యూబ్ మిగిలాయి. దాంతో ఆమె ఫేస్‌బుక్ అని సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: ఫేస్‌బుక్

  Rs.160000 కోసం ప్రశ్న

  Rs.160000 కోసం ప్రశ్న

  ఒక 2021 చిత్రంలో పరిణితి చోప్రా ఏ ఒలంపిక్ పతక విజేత పాత్రలో నటించింది?
  a) సైనా నేహ్వాల్
  b) పీవీ సింధు
  c) పీటీ ఉష
  d) సానియా మిర్జా

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మరో లైఫ్‌లైన్ ఉపయోగించకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో ఆడియెన్స్ సైనా నెహ్వాల్ అని జవాబు చెప్పారు. దాంతో శివానీ అదే సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: సైనా నేహ్వాల్

  Rs. 320000 కోసం ప్రశ్న

  Rs. 320000 కోసం ప్రశ్న

  హిందూ పురాణాలలో కృష్ణుడిని చంపాలనుకొన్న అతని మేనమామ ఎవరు?
  a) భీష్ముడు
  b) వసుదేవుడు
  c) కంసుడు
  d) ధృతరాష్ట్రుడు

  Answer: కంసుడు

  Recommended Video

  Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
   Rs. 620000 కోసం ప్రశ్న

  Rs. 620000 కోసం ప్రశ్న

  హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో మిసైల్ కాంప్లెక్స్‌కు వీరిలో ఎవరి పేరు పెట్టారు?
  a) రాజా రామన్న
  b) విక్రమ్ సారాభాయ్
  c) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
  d) సీఎన్ఆర్ రావు

  పై ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో శివానీ మూడో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో తన స్నేహితుడు విక్రమ్ సారాభాయ్ అని సమాధానం చెప్పారు. అదే సమాధానం చెప్పి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. అసలు సమాధానం డాక్టర్ ఏపీజే అబ్దులు కలాం కావడంతో గేమ్ నుంచి తప్పుకొన్నారు. 320000 గెలుచుకొని గేమ్ నుంచి బయటకు వెళ్లారు.

  Answer: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show December 1st Episode: Shivani of Hyderabad has occupied the Hot seat. She won the 320000 lakhs in the game.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X