twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Sept 23rd Show: ఎన్టీఆర్ షోలో నంద్యాల వాసి.. 1250000 ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పి..

    |

    యంగ్ టైగర్ ఎన్ టీ రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన శ్రీనివాసరావు హాట్ సీట్‌పైకి వచ్చారు. ఆయన జీఎస్టీ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందిస్తున్నారు. ఈ షోలో గెలిచిన మొత్తాన్ని అయితే ఆయన ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎంత మొత్తాన్ని గెలుచుకొని షో నుంచి నిష్క్రమించారనే విషయాల్లోకి వెళితే..

    కంటెస్టెంట్ల ముందు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    కంటెస్టెంట్ల ముందు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఈ వ్యక్తులను, వారు భారత రాష్ట్రపతులు అయిన కాలక్రమంలో అమర్చండి

    A) రామ్ నాథ్ కోవింద్
    B) ప్రతిభా పాటిల్
    C) ఏపీజే అబ్దుల్ కలాం
    D) ప్రణబ్ ముఖర్జి

    Answer: C, B, D, A

    పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన శ్రీనివాసరావు హాట్ సీట్‌పైకి చేరుకొన్నారు. ఆయన 5 సెకన్లలోపే సమాధానం చెప్పారు.

    1000 రూపాయల కోసం

    1000 రూపాయల కోసం

    ఫ్రాక్చర్ అనేది సాధారణంగా ఏ శరీర భాగంలో ముడిపడి ఉంటుంది?
    a) ఎముక
    b) జుట్టు
    c) గోరు
    d) చెవి

    Answer: ఎముక

    2000 రూపాయల కోసం

    2000 రూపాయల కోసం

    వీటిలో ఒక పండుగ పేరు మరియు అన్నంతో చేసే ఒక ఆహార పదార్థం పేరు అయినది ఏది?

    a) పొంగల్
    b) విషు
    c) ఓణం
    d) బిహు

    Answer: పొంగల్

    3000 రూపాయల కోసం

    3000 రూపాయల కోసం

    మహా భారతంలో కృష్ణుడి విశ్వరూప దర్శనం కోసం ఎవరికీ చూపు ప్రసాదించారు?

    a) ద్రోణాచార్యుడు
    b) భీష్ముడు
    c) ధృతరాష్ట్రుడు
    d) యుధిష్టరుడు

    Answer: ద్రోణాచార్యుడు

    5000 రూపాయల కోసం

    5000 రూపాయల కోసం

    ఈ ఆడియో క్లిప్‌ ఏ చిత్రంలోనిదో గుర్తించండి (బ్రహ్మానందం డైలాగ్స్ వినిపించారు)

    a) రెడీ
    b) బాద్‌షా
    c) దూకుడు
    d) బ్రూస్ లీ

    Answer: బాద్‌షా

    10000 రూపాయల కోసం

    10000 రూపాయల కోసం

    10000 రూపాయల కోసం
    విద్యుత్‌ పదజాలంలో AC లోని A అంటే ఏమిటి?
    a) అడ్జాయినింగ్
    b) ఆటోమేటిక్
    c) అల్టర్నేటింగ్
    d) అడ్వాన్స్‌డ్

    Answer: ఆల్టర్నేటింగ్

    20000 రూపాయల కోసం

    20000 రూపాయల కోసం

    మహా భారతంలో కృష్ణుడి విశ్వరూప దర్శనం కోసం ఎవరికి చూపు ప్రసాదించారు?
    a) ద్రోణాచార్యుడు
    b) భీష్ముడు
    c) ధృతరాష్ట్రుడు
    d) యుధిష్టిరుడు

    Answer: ధృతరాష్ట్రుడు

    ఈ చిత్రంలోని పక్షిని గుర్తించండి

    ఈ చిత్రంలోని పక్షిని గుర్తించండి

    a) నెమలి
    b) హంస
    c) నిప్పు కోడి
    d) అల్బాట్రాస్

    Answer: నిప్పు కోడి

    40000 రూపాయల కోసం

    40000 రూపాయల కోసం

    మైదానం నవల రచయిత ఎవరు?
    a) యండమూరి వీరేంద్రనాథ్
    b) గుడిపాటి వెంకటాచలం
    c) ముళ్లపూడి వెంకటరమణ
    d) మొక్కపాటి నరసింహ శాస్త్రి

    Answer: గుడిపాటి వెంకటాచలం

    80000 రూపాయల కోసం

    80000 రూపాయల కోసం

    వీటిలో పాపికొండ జాతీయ ఉద్యానవనం ఏ నది ఒడ్డున ఉన్నది?
    a) కృష్ణ
    b) పెన్నా
    c) తుంగభద్ర
    d) గోదావరి

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో శ్రీనివాసరావు లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఈ ప్రశ్నకు జవాబు కోసం ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఎంచుకొని సరైన సమాధానం చెప్పారు.

    Answer: గోదావరి

    160000 రూపాయల కోసం

    160000 రూపాయల కోసం

    ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ప్రియదర్శిని రాగాన్ని ఎవరికి నివాళిగా సృషించారు?
    a) ఇందిరా గాంధీ
    b) లతా మంగేశ్కర్
    c) ఎంఎస్ సుబ్బలక్ష్మి
    d) సరోజిని నాయుడు

    Answer: ఇందిరా గాంధీ

    320000 రూపాయల కోసం

    320000 రూపాయల కోసం

    2020లో ఏ రోజున ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు?
    a) నూతన సంవత్సర రోజు
    b) క్రీడా దినోత్సవం
    c) అతని పుట్టిన రోజు
    d) స్వాతంత్ర్య దినోత్సవం

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రెండో లైఫ్ లైన్‌ను ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకోవడంతో స్క్రీన్ పై క్రీడా దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం ఆప్షన్లు మిగిలాయి. శ్రీనివాసరావు స్వాతంత్ర్య దినోత్సవం ఆప్షన్ చెప్పి 320000 గెలుచుకొన్నారు.
    Answer: స్వాతంత్ర్య దినోత్సవం

    640000 రూపాయల కోసం

    640000 రూపాయల కోసం

    జూన్ 2021లో బిట్ కాయిన్ లావాదేవీలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది?
    a) వెనుజులా
    b) టర్కీ
    c) ఎల్ సాల్వేడార్
    d) అర్జెంటీనా

    Answer: ఎల్ సాల్వేడార్

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
    1250000 రూపాయల కోసం

    1250000 రూపాయల కోసం

    వీటిలో అన్నిటికన్నా ముందుగా నెలకొల్పబడిని సంస్థ ఏది?
    a) టాటా గ్రూప్
    b) గోద్రేజ్ గ్రూప్
    c) కిర్లోస్కర్ గ్రూప్
    d) వాడియా గ్రూప్

    Answer: వాడియా గ్రూప్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మూడో లైఫ్ లైన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. తన స్నేహితుడికి కూడా సరైన సమాధానం తెలియకపోవడంతో కాల్ ముగిసింది. అయితే తప్పు సమాధానం చెప్పిన ఆయన 640000 నుంచి కిందకు పడిపోయి.. 320000 రూపాయలతో వెనుదిరిగాడు. ఆయన గేమ్ నుంచి నిష్క్రమించిన తర్వాత శంఖం మోగడంతో ఆట గురువారానికి ముగిసింది.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show September 23rd Episode: Nandyala's GST deputy Commissioner Srinivasa Rao participated in EMK. He won the 320000 in the game.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X