For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's Evaru Meelo Koteeswarulu..ఎన్టీఆర్ అడిగిన 320000 ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

  |

  తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో మరో కొత్త కంటెస్టెంట్‌తో నవంబర్ 10న ముందుకొచ్చింది. హోస్ట్ ఎన్టీఆర్ కొత్త కంటెస్టెంట్లను పరిచయం చేసి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌తో ఆటను ప్రారంభించారు. అయితే బుధవారం రోజున హైదరాబాద్‌కు చెందని డిఫెన్స్ ఉద్యోగి వేణునాథ్ హాట్ సీట్ పైకి వచ్చారు. వేణునాథ్ ఎలా ఆడారు? ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు? గేమ్‌లో ఎంత గెలుచుకొన్నారనే విషయాల్లోకి వెళితే..

  ఫస్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ క్వశ్చన్

  ఫస్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ క్వశ్చన్

  ఈ భారత రాష్ట్ర రాజధానులను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి
  A) తిరువనంతపురం
  B) బెంగళూరు
  C) భోపాల్
  D) చంఢీగడ్

  పై ప్రశ్నకు వేణునాథ్ వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. వేణునాథ్ కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన స్టార్టప్ కంపెనీ పెట్టాలనే కోరికతో ఉన్నారు. 10వ తరగతిలో చంద్రబాబు చేత పురస్కారం అందుకొన్నాడు.

  Answer: D, C, B, A

   1000 రూపాయల ప్రశ్న కోసం

  1000 రూపాయల ప్రశ్న కోసం

  వీటిలో, ఏది సాధారణంగా పర్వతాలు, కొండల లోపల నిర్మించబడుతుంది?
  a) విగ్రహాలు
  b) ప్లైఓవర్లు
  c) సొరంగాలు
  d) ఆకాశసౌధాలు

  Answer: సొరంగాలు

  2000 రూపాయల ప్రశ్న కోసం

  2000 రూపాయల ప్రశ్న కోసం

  ఈ చిత్రంలోని పురుగును గుర్తించండి
  a) సాలీడు
  b) టేకింగ్
  c) సీతాకోక చిలుక
  d) తేనేటిగ

  Answer: తేనేటిగ

  3000 రూపాయల ప్రశ్న కోసం

  3000 రూపాయల ప్రశ్న కోసం

  3000 రూపాయల ప్రశ్న కోసం
  ఈ ఆడియో క్లిప్‌లోని పాటను గుర్తించండి
  a) భేల్ పూరి
  b) దహీ పూరి
  c) పానీ పూరి
  d) మసాల పూరి

  Answer: భేల్ పూరి

  5000 రూపాయల ప్రశ్న కోసం

  5000 రూపాయల ప్రశ్న కోసం

  సాధారణంగా, రాజధాని ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టబడిన రైళ్లకు గమ్యస్థానం ఏది?
  a) ముంబై
  b) ఢిల్లీ
  c) చెన్నై
  d) హైదరాబాద్

  Answer: ఢిల్లీ

  10000 రూపాయల ప్రశ్న కోసం

  10000 రూపాయల ప్రశ్న కోసం

  2021లో, గణతంత్ర దినోత్సవం మంగళవారం అయితే, వాలంటైన్స్ డే ఏ రోజున వచ్చింది?
  a) శుక్రవారం
  b) శనివారం
  c) ఆదివారం
  d) సోమవారం

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో అందరూ ఆదివారం అని ఓట్ వేశారు. దాంతో వేణునాథ్ ఆదివారం సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: ఆదివారం

   20000 రూపాయల ప్రశ్న కోసం

  20000 రూపాయల ప్రశ్న కోసం

  హిందూ, పురాణాలలో, వీరిలో గంగ తన తల్లి కాబట్టే గాంగేయుడు అని పిలవబడిన వారు ఎవరు?
  a) జాంబవంతుడు
  b) భీష్ముడు
  c) బలరాముడు
  d) నళుడు

  Answer: భీష్ముడు

  40000 రూపాయల ప్రశ్న కోసం

  40000 రూపాయల ప్రశ్న కోసం

  బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తల్లి జాతీయస్థాయిలో ఏ క్రీడలో ఆడారు?
  a) క్రికెట్
  b) టెన్నిస్
  c) హాకీ
  d) వాలీబాల్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మరో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. తొలుత వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే వీడియో కాలర్ తనకు సమాధానం తెలియకపోవడంతో డౌట్‌గా వాలీబాల్ అని చెప్పారు. ఆత తర్వాత జవాబు చెప్పడానికి 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. చివరికి క్రికెట్, వాలీబాల్ స్క్రీన్ పై ఉండటంతో వాలీబాల్ అని సమాధానం చెప్పి గేమ్‌లోకి వెళ్లారు.

  Answer: వాలీబాల్

  80000 రూపాయల ప్రశ్న కోసం

  80000 రూపాయల ప్రశ్న కోసం

  1932లో ఏ వ్యాపార సంస్థ ఎయిర్ ఇండియాను స్థాపించింది?
  a) బిర్లా
  b) రిలయన్స్
  c) టాటా
  d) బజాజ్

  Answer: టాటా

  160000 రూపాయల ప్రశ్న కోసం

  160000 రూపాయల ప్రశ్న కోసం

  బుద్దుని జన్మస్థలం లుంబిని ఏ దేశంలో ఉంది?
  a) చైనా
  b) ఇండియా
  c) నేపాల్
  d) భూటాన్

  Answer: నేపాల్

  Recommended Video

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  శ్రీకాకుళ మహా విష్ణువు గురించి ఆంధ్రనాయక శతకం రచించింది ఎవరు?

  శ్రీకాకుళ మహా విష్ణువు గురించి ఆంధ్రనాయక శతకం రచించింది ఎవరు?

  a) కాసుల పురుషోత్తమ కవి
  b) గోగులపాటి కూర్మానాథ
  c) పింగిళి సూరన్న
  d) కూచిమంచి తిమ్మకవి

  Answer: కాసుల పురుషోత్తమ కవి

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show November 10th Episode: Venunath of Hyderabad occupied hot seat before NTR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X