NTR's EMK : 320000 ప్రశ్నకు జవాబు చెప్పలేక 160000తో వెనుతిరిగిన కంటెస్టెంట్.. మీకు సమాధానం తెలుసా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో మరో కొత్త కంటెస్టెంట్‌తో నవంబర్ 11న ముందుకొచ్చింది. హోస్ట్ ఎన్టీఆర్ కొత్త కంటెస్టెంట్లను పరిచయం చేసి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌తో ఆటను ప్రారంభించారు. అయితే గురువారం రోజున సింగరాయకొండకు చెందిన రైల్వే ఉద్యోగి వెంకట రవి హాట్ సీట్ పైకి వచ్చారు. వెంకట రవి ఎలా ఆడారు? ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు? గేమ్‌లో ఎంత గెలుచుకొన్నారనే విషయాల్లోకి వెళితే..

ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్
ఈ భారత సరిహద్దు దేశాలను వాయువ్యం నుండి మొదలుపెట్టి, ప్రపంచపటంలో అవి కనిపించే విధంగా అపసవ్య దిశలో అమర్చండి
C: పాకిస్తాన్
A: శ్రీలంక
D: మయన్మార్
B: చైనా
పై ప్రశ్నకు వెంకట రవి వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. వెంకట రవి రైల్వే శాఖలో పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా అదే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యం ఉన్నా అనుకోని కారణాలతో అవ్వలేదు. అందుకే అవ్వాలని కష్టపడుతున్న వారికీ గైడెన్స్ ఇస్తూ ఉంటారు.

1000 రూపాయల ప్రశ్న కోసం
'PE టీచర్' వృత్తిలో 'P' అంటే ఏమిటి?
A: ప్రాక్టీస్
B: పేషన్స్
C: ప్రాక్టికల్
D: ఫిజికల్
Answer: D: ఫిజికల్

2000 రూపాయల ప్రశ్న కోసం
ఈ చిత్రంలోని వస్తువుని గుర్తించండి అంటూ స్టెతస్కోప్ ను ప్రదర్శించారు.
A: స్పిగ్మోమానోమీటర్
B: స్టెతస్కోప్
C: ఆక్సీమీటర్
D: థర్మామీటర్
Answer: B: స్టెతస్కోప్

3000 రూపాయల ప్రశ్న కోసం
హిందూ పురాణాలలో ఎవరిని మధుసూదనుడు అని కూడా పిలుస్తారు?
A: శివుడు
B బ్రహ్మ
C. కృష్ణుడు.
D: రాముడు
Answer: C. కృష్ణుడు.

5000 రూపాయల ప్రశ్న కోసం
'CD' లో 'D' మరియు 'DVD' లో రెండవ 'D' అంటే ఏమిటి?
A: డిజిటల్
B: డైరెక్ట్
C: డబుల్
D: డిస్క్
Answer: D: డిస్క్

10000 రూపాయల ప్రశ్న కోసం
ఈ నగరాల్లో లైట్ హౌస్ ఎక్కడ చూడవచ్చు?
A : హైదరాబాద్
B: తిరుపతి
C: విశాఖపట్నం
D: కర్నూలు
Answer: C: విశాఖపట్నం

20000 రూపాయల ప్రశ్న కోసం
ఈ ఆడియో క్లిప్ లోని పాటకు సంగీత స్వరకర్త ఎవరు? అంటూ గజినీ సినిమాలోని హృదయం ఎక్క్డున్నాదీ అనే సాంగ్ ప్లే చేశారు.
A: హారిస్ జైరాజ్
B: ఎ ఆర్ రెహమాన్
C: ఇళయరాజా
D: యువన్ శంకర్ రాజా
ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆయన ఆడియన్స్ పోల్ అనే ఒక లైఫ్ లైన్ ఎంచుకున్నారు. అయితే అందులో ఎక్కువ మంది హ్యారిస్ జయరాజ్ పేరు చెప్పారు. అదే ఆన్సర్ చెప్పగా అది కరెక్ట్ అయింది.

40000 రూపాయల ప్రశ్న కోసం
కోవిడ్-19కి స్పుత్నిక్ V వ్యాక్సినన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది?
A: చైనా
B: జపాన్
C: యూ ఎస్ ఏ
D: రష్యా
Answer: D: రష్యా

80000 రూపాయల ప్రశ్న కోసం
జూన్ 2021లో, చదరంగం గ్రాండ్ మాస్టర్ అయిన అతి పిన్న వయస్కుడు ఎవరు?
A: మాగ్నస్ కార్ల్సన్
B: అభిమన్యు మిశ్రా
C: గుకేష్ డి
D: ఆర్ ప్రజ్ఞానంద
ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆయన వీడియో కాల్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకున్నారు. సమతా అనే తన కొలీగ్ కు కాల్ చేస్తే ఆమె బీ అన్నారు, దీంతో ఆయన కూడా దానినే ఫిక్స్ చేశారు. చివరికి అదే కరెక్ట్ ఆన్సర్ అయింది.

160000 రూపాయల ప్రశ్న కోసం
వీటిలో, ఏ గ్రహం యొక్క ఒక ఉపగ్రహం బుధగ్రహం కన్నా పెద్దది?
A: భూమి
B: యురేనస్
C:శని
D: నెప్ట్యూన్
ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆయన 50-50 ఆప్షన్ ఎంచుకున్నారు. దీంతో బీ, డీ ఆప్షన్లు తీసేసారు బిగ్ బాస్, ఇక ఆయన శని అనే ఆప్షన్ ఎంచుకున్నారు. అదే కరెక్ట్ అయింది.
Recommended Video

320000 రూపాయల ప్రశ్న కోసం
జాతీయ వయోజన విద్యా కార్యక్రమాన్ని 1978లో రోజున అధికారికంగా ప్రారంభించారు?
A: బాలల దినోత్సవం
B గణతంత్ర దినోత్సవం
C. గాంధీ జయంతి
D: ఉపాధ్యాయుల దినోత్సవం
అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆయన క్విట్ చేశారు. దీంతో 160000 రూపాయలతో వెనుతిరిగారు.


Click it and Unblock the Notifications











