For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show.. 640000 ప్రశ్నకు తడబడిన కేసముద్రం మండలం వాసి.. ఆ జవాబు చెప్పగలరా?

  |

  బుల్లితెర మీద విశేషంగా ప్రేక్షకదారణను సొంతం చేసుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఆసక్తిగా సాగుతున్నది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోలో తన ప్రతిభను చాటుకొంటూ భారీగా ప్రైజ్‌మనీని సొంతం చేసుకొంటున్నారు. తాజాగా ప్రసారమైన అంటే నవంబర్ 24వ తేదీన టెలికాస్ట్ అయిన షోలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన భవానీ హాట్ సీట్‌పైకి వచ్చారు. భవానీ ఎంత గెలుచుకొన్నది? ఏ ప్రశ్నలకు తడబాటు పడింది? ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా?

   ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

  వీటికున్న విలువ ప్రకారం.. తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

  A) 2 రూపాయలు
  B) 4 లక్షల రూపాయలు
  C) 50 పైసలు
  D) 1 కోటి రూపాయలు

  పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన భవానీ హాట్ సీట్‌పైకి వచ్చే అవకాశాన్ని దక్కించుకొన్నారు. మహబూబాబాద్ జిల్లాల కేసముద్రం మండలంలోని అమీనాపురం గ్రామానికి చెందిన భవానీ రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఎంఫార్మసీ చదువుకొన్నారు. సొంతంగా వ్యాపారం చేయాలన్నది ఆమె కోరిక. తన తండ్రి కోసం ఒక భూమిని కొనుగోలు చేసి తన సొంత బోటిక్ కూడా ప్రారంభించాలనుకొంటున్నది?

  Answer: C, A, B, D

   Rs.1000 కోసం ప్రశ్న

  Rs.1000 కోసం ప్రశ్న

  కాలర్ సాధారణంగా, వీటిలో ఏ వస్త్రాలలో కనబడుతుంది?
  a) ప్యాంట్స్
  b) షర్ట్స్
  c) గ్లవ్స్
  d) హ్యాట్స్

  Answer: షర్ట్స్

   Rs.2000 కోసం ప్రశ్న

  Rs.2000 కోసం ప్రశ్న

  వీటిలో పాదం మరియు ఒక పాట భాగం అనే అర్ధం కలిగిన పదం ఏది?
  a) హస్తం
  b) పల్లవి
  c) సాకీ
  d) చరణం

  Answer: చరణం

   Rs.3000 కోసం ప్రశ్న

  Rs.3000 కోసం ప్రశ్న

  ఈ చిత్రంలో కనిపించే వాటి ప్రకారం క్రీడను గుర్తించండి
  a) చదరంగం
  b) టెన్నిస్
  c) బిలియర్డ్స్
  d) క్రికెట్

  Answer: టెన్నిస్

  Rs.5000 కోసం ప్రశ్న

  Rs.5000 కోసం ప్రశ్న

  నేలపై అత్యంత వేగవంతమైన పక్షి ఏది?
  a) నెమలి
  b) పెంగ్విన్
  c) పావురం
  d) నిప్పుకోడి

  Answer: నిప్పుకోడి

  Rs.10000 కోసం ప్రశ్న

  Rs.10000 కోసం ప్రశ్న


  ఈ పదాలలో ఏది భారత దేశ తూర్పు తీరాన్ని సూచిస్తుంది?
  a) కోరమండల్
  b) కొంకణ్
  c) మలబార్
  d) దక్కను

  పై ప్రశ్నకు తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను వాడుకొన్నారు. ఆడియెన్స్‌లో ఎక్కువ మంది కోరమండల్ అని సమాధానం చెప్పడంతో ఆమె కూడా అదే సమాధానాన్ని చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: కోరమండల్

   Rs.20000 కోసం ప్రశ్న

  Rs.20000 కోసం ప్రశ్న

  ఈ పాట ఏ సినిమా నుంచి తీసుకోబడిందో గుర్తించండి
  a) టైగర్
  b) ఎక్స్‌ప్రెస్ రాజా
  c) వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
  d) జోరు

  Answer: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

   Rs.40000 కోసం ప్రశ్న

  Rs.40000 కోసం ప్రశ్న

  మామో గ్రఫి అనే వైద్య విధానం వీటిలో దేనిని గుర్తిస్తుంది?
  a) రొమ్ము క్యాన్సర్
  b) ఊపిరితిత్తుల క్యాన్సర్
  c) మెదడు కణితి
  d) మూత్రాశయ క్యాన్సర్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన రెండో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. స్క్రీన్ పై రొమ్ము క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ మిగిలాయి. చివరకు రొమ్ము క్యాన్సర్ సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

  Answer: రొమ్ము క్యాన్సర్

  Rs.80000 కోసం ప్రశ్న

  Rs.80000 కోసం ప్రశ్న

  వీటిలో, ఏ దేవాలయానికి వెళ్లే భక్తులు నలుపు వస్త్రాలు ధరించి 41 రోజులు దీక్ష చేసి వెళ్తారు?
  a) శబరిమల అయ్యప్ప దీక్ష దేవాలయం
  b) పళని మురుగన్ దేవాలయం
  c) తిరుపతి దేవాలయం
  d) మధురై మీనాక్షి దేవాలయం

  Answer: శబరిమల అయ్యప్ప దీక్ష దేవాలయం

   Rs.160000 కోసం ప్రశ్న

  Rs.160000 కోసం ప్రశ్న

  ఈ దేశాలలో ఒకప్పుడు సిలోన్‌గా పిలువబడినది ఏది?
  a) భారతదేశం
  b) మయన్నార్
  c) శ్రీలంక
  d) భూటాన్

  Answer: శ్రీలంక

  Rs.320000 కోసం ప్రశ్న

  Rs.320000 కోసం ప్రశ్న

  సెప్టెంబర్ 2021 నాటికి, భారత క్రికెట్ జట్టుకి ప్రధాన కోచ్ ఎవరు?
  a) డంకన్ ఫ్లెచర్
  b) రవి శాస్త్రి
  c) అనిల్ కుంబ్లే
  d) గ్యారీ కిరెస్టెన్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మూడో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొని తన చెల్లెలికి కాబోయే భర్తకు కాల్ చేశారు. ఆయన రవిశాస్త్రి అని సమాధానం చెప్పడంతో భవానీ కూడా అదే జవాబు చెప్పి 320000 గెలచుకొన్నారు.

  Answer:

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  Rs.640000 కోసం ప్రశ్న

  Rs.640000 కోసం ప్రశ్న

  కేంద్ర సాహిత్య యువ పురస్కారం పొందిన చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తక రచయిత్రి ఎవరు?
  a) మెర్సీ మార్గరేట్
  b) అపర్ణ తోట
  c) చైతన్య పింగిలి
  d) మానస ఎండ్లూరి

  Answer: చైతన్య పింగిలి

  పై ప్రశ్నకు మానస ఎండ్లూరి అని సమాధానం చెప్పారు. అయితే కరెక్ట్ జవాబు చైతన్య పింగిలి కావడంతో భవానీ గేమ్ నుంచి అవుటయ్యారు. 320000 రూపాయలతో గెలుచుకొని గేమ్ నుంచి బయటకు వెళ్లారు. అంతలోనే శంఖం మోగడంతో బుధవారం గేమ్ ముగిసింది.

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show November 24th Episode: Bhavani of Ameenapuram of Kesamudram Mandal has occupied the Hot seat. She won the 320000 lakhs in the game.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X