twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Show.. 320000 ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన కంటెస్టెంట్.. మీరు చెప్పగలరా?

    |

    బుల్లితెర మీద ఆకట్టుకొంటున్న రియాలిటీ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. గురువారం అంటే నవంబర్ 24వ తేదీన గుడివాడకు చెందిన ఫణీంద్ర, నూజివీడుకు చెందిన సాధన స్రవంతి హాట్ సీట్‌పైకి వచ్చారు. ఫణీంద్ర ఎంత గెలుచుకొన్నారు? అలాగే సాధాన ఎంత సంపాదించారు అనే విషయాల్లోకి వెళితే..

    మొదటి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

    మొదటి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

    A) విశాఖపట్నం
    B) ఎవరెస్ట్ పర్వతం
    C) అరకు లోయ
    D) లేహ్

    Answer: A, C, D, B

    పై ప్రశ్నకు గుడివాడకు చెందిన ఫణీంద్ర వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు.

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న


    వీటిలో దేని శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది?
    a) గద్ద
    b) కుక్క
    c) ఎలుక
    d) పిల్లి

    Answer: గద్ద

    2000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    2000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    వీటిలో రీఫిల్ ఎందులో వాడుతారు?
    a) పెన్
    b) పెన్సిల్
    c) ఎరేజర్
    d) రూలర్

    Answer: పెన్

    3000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    3000 రూపాయల కోసం మొదటి ప్రశ్న


    సాధారణంగా ఫుట్‌బాల్ ఆటలో చేతితో బంతిని పట్టుకొనే అవకాశం ఉన్న ఒకే ఒక్క ఆటగాడు ఎవరు?
    a) ఫార్వర్డ్
    b) మిడ్ ఫిల్డర్
    c) గోల్ కీపర్
    d) డిఫెండర్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఫణీంద్ర తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఉపయోగించుకోగా, ఆడియెన్స్ ఎక్కువ మంది గోల్ కీపర్ అని సమాధానం చెప్పడంతో ఆయన కూడా అదే జవాబు చెప్పి ఆటలో ముందుకెళ్లారు.

    Answer: గోల్ కీపర్

    4000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    4000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    భౌగోళికంగా వీటిలో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతం కానిది ఏది?
    a) రాయలసీమ
    b) కోస్తాంధ్ర
    c) ఉత్తరాంధ్ర
    d) కోలార్

    Answer: కోలార్

    5000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    5000 రూపాయల కోసం మొదటి ప్రశ్న


    సాధారణంగా ఒక వెబ్ అడ్రస్‌లో కామ్ మరియు ఇన్ అనే డొమైన్‌ల ముందు ఏ చిహ్రం ఉపయోగిస్తారు?
    a) కామా
    b) డాట్
    c) క్వశ్చన్ మార్క్
    d) అండర్ స్కోర్

    Answer: డాట్

     20000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    20000 రూపాయల కోసం ఐదో ప్రశ్న


    ఒక బాబాయి, మరియు అబ్బాయి, వీటిలో ఒకే పేరుతో రెండు వేర్వేరు చిత్రాల్లో నటించిన చిత్రం పేరు ఏది?
    a) బద్రి
    b) తొలి ప్రేమ
    c) ఫిదా
    d) ఖుషీ

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రెండో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నాడు. 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ పై తొలి ప్రేమ, ఖుషి మిగిలాయి. దాంతో ఫణి తొలి ప్రేమ సమాధానాన్ని చెప్పి గేమ్‌లో ముందుకెళ్లాడు.

    Answer: తొలి ప్రేమ

    40000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    40000 రూపాయల కోసం ఆరో ప్రశ్న


    మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సంప్రదాయంగా ఇవ్వబడే ప్రసాదం ఏది?
    a) పొంగలి
    b) సకినాలు
    c) పానకం
    d) లడ్డు

    Answer: పానకం

    80000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    80000 రూపాయల కోసం ఏడో ప్రశ్న


    సాధారణంగా, స్వతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి వీటిలో ఎక్కడ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు?
    a) ఇండియా గేట్
    b) గేట్ వే ఇండియా
    c) తాజ్ మహల్
    d) ఎర్రకోట

    Answer: ఎర్రకోట

    160000 రూపాయల కోసం 9వ ప్రశ్న

    160000 రూపాయల కోసం 9వ ప్రశ్న


    వీటిలో, ప్రధానంగా ఉపిరితిత్తులను దెబ్బతీసే వ్యాధి ఏది?
    a) మధుమేహం
    b) క్షయ
    c) కీళ్లవాతం
    d) హ్రస్వదృష్టి

    Answer: క్షయ

    320000 రూపాయల కోసం 10వ ప్రశ్న

    320000 రూపాయల కోసం 10వ ప్రశ్న


    వీటిలో శ్రీశ్రీ రచించని పుస్తకం ఏది?
    a) మహాప్రస్థానం
    b) ఇది నా గొడవ
    c) ఖఢ్గసృష్టి
    d) సిప్రాలి

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో మూడో లైఫ్‌లైన్ ఉపయోగించుకోన్నారు. తన స్నేహితుడు హేమంత్ కాల్ చేయడంతో తనకు తెలియకపోయినా ఖడ్గసృష్టి అని చెప్పారు. ఫణింద్ర కూడా అదే సమాధానం చెప్పారు. అయితే ఆ జవాబు తప్పు కావడంతో కేవలం 10 వేల రూపాయలు గెలుచుకొని ఇంటికి వెళ్లారు.

    Answer: ఇది నా గొడవ

    సెకండ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

    సెకండ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్


    హనుమాన్ చాలీసాలో ఒక పద్యం వచ్చే మాదిరిగా వీటిని సరైన క్రమంలో అమర్చండి?
    A) జాన గుణ సాగర
    B) జయ హనుమాన
    C) జయ కపీశ తిహు
    D) లోక ఉజాగర

    Answer: B, A, C, D

    నూజీవీడుకు చెందిన తిరుమలశెట్టి సాధన లక్ష్మి స్రవంతి వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌ మీదకు వచ్చారు. ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు.

    వీటిలో సాధారణంగా పాఠశాలలో నల్లబోర్డుపై రాయడానికి ఉపయోగించేది ఏది?

    వీటిలో సాధారణంగా పాఠశాలలో నల్లబోర్డుపై రాయడానికి ఉపయోగించేది ఏది?


    a) చాక్
    b) పెన్సిల్
    c) క్రేయాన్
    d) పెన్

    Answer: చాక్

    2 వేల రూాపాయల కోసం రెండో ప్రశ్న

    2 వేల రూాపాయల కోసం రెండో ప్రశ్న

    వీటిలో సింగిల్స్ మరియు డబుల్స్‌గా ఆడే ఆట ఏది?
    a) హాకీ
    b) ఫుట్‌బాల్
    c) బాడ్మింటన్
    d) కబడ్డీ

    Answer: బాడ్మింటన్

    3 వేల రూాపాయల కోసం మూడో ప్రశ్న

    3 వేల రూాపాయల కోసం మూడో ప్రశ్న

    ఈ చిత్రంలోని గ్రహాన్ని గుర్తించండి?
    a) శని
    b) గురుడు
    c) నెఫ్ట్యూన్
    d) అంగారకుడు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో సాధన లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఉపయోగించుకోవడంతో ఆడియెన్స్ శని అని ఎక్కువ మంది సమాధానం చెప్పారు. దాంతో సాధన కూడా అదే సమాధానం చెప్పి గేమ్‌లో ముందుకెళ్లారు.

    5 వేల రూాపాయల కోసం నాలుగు ప్రశ్న

    5 వేల రూాపాయల కోసం నాలుగు ప్రశ్న

    హిందూ పురాణాలలో అంతకుడు అనే పేరు గలవారు వీరిలో ఎవరు?
    a) కృష్ణుడు
    b) బ్రహ్మ
    c) యముడు
    d) వాయు

    పై ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో మరో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ ఉపయోగించుకొని సంధ్యారాణికి కాల్ చేశారు. ఆమె యముడు అని సమాధానం చెప్పారు. దాంతో సాధన కూడా యముడు అని చెప్పారు.

    Answer: యముడు

    10 వేల రూాపాయల కోసం 5వ ప్రశ్న

    10 వేల రూాపాయల కోసం 5వ ప్రశ్న

    వీటిలో చేప రాష్ట్ర జంతువుగా కలిగి ఉన్నది ఏది?
    a) పశ్చిమ బెంగాల్
    b) లక్షద్వీప్
    c) కేరళ
    d) అండమాన్ అండ్ నికోబార్

    పై ప్రశ్నకు జవాబు చెప్పలేకపోవడంతో సాధన తన మూడో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. దాంతో స్క్రీన్‌పై లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఆప్షన్లు మిగిలాయి. దాంతో లక్షద్వీప్ అన్సర్ చెప్పి గేమ్‌లో ముందుకు వెళ్లారు.

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    40 వేల రూపాయల కోసం 7వ ప్రశ్న

    40 వేల రూపాయల కోసం 7వ ప్రశ్న

    ఏ భారతీయ నగరంలో సెంట్రల్ విస్టా అనే పేరుగల భారీ ప్రాజెక్టు రూపొందించబడుతున్నది?
    a) న్యూఢిల్లీ
    b) ఆహ్మదాబాద్
    c) ముంబై
    d) బెంగళూరు
    పై ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యారు. చివరగా ఆమె చెప్పిన ఆహ్మదాబాద్ అని చెప్పడంతో తప్పు అయింది. దాంతో 20 వేల రూపాయలు గెలుచుకొని గేమ్ నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత శంఖం మోగడంతో ఈ వారం ఆట ఆగింది.

    Answer: న్యూఢిల్లీ

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show November 25th Episode: Phanindra of Gudivada and Sadhana Sravanti of Nuziveedu occupied on hot seat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X