For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Sept 8th Show: ఎన్టీఆర్‌కు డాక్టర్‌ షాక్.. 1250000 ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోలో మరో రోజు ఆసక్తికరంగా సాగింది. సెప్టెంబర్ 13వ తేదీన గుంటూరుకు చెందిన అంజనీ కుమార్ హాట్ సీట్‌పైకి వచ్చారు. ఈ హాట్ సీట్‌పైకి రావడానికి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ ఎలా ఆడారు. ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అనే విషయంలోకి వెళితే..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే..

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే..

  ఈ దుస్తులను, సాధారణంగా అవి ధరించకే భాగాల ప్రకారంగా, కింది నుంచి మొదలుపెట్టి వరుసగా పైకి అమర్చండి.
  A) షార్ట్స్
  B) సాక్స్
  C) టై
  D) హెడ్ బ్యాండ్

  Answer: B, A, C D

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  ఈ తిను బండారాల్లో వినాయక చవితికి సంబంధించిన ఏది?

  ఈ తిను బండారాల్లో వినాయక చవితికి సంబంధించిన ఏది?

  a) పొంగల్
  b) ఉండ్రాళ్లు
  c) బొబ్బట్లు
  d) కాజు కట్లి

  Answer: ఉండ్రాళ్లు

  వీటిలో రోడ్డు మీద U ఆకారంలో ఉండే మలుపులను సూచించడానికి దేని వాడుతారు?

  వీటిలో రోడ్డు మీద U ఆకారంలో ఉండే మలుపులను సూచించడానికి దేని వాడుతారు?

  a) లిప్‌స్టిక్
  b) హెయిర్ పిన్
  c) పెర్‌ఫ్యూమ్
  d) ఐ లైనర్

  Answer: హెయిర్ పిన్

  ఈ చిత్రంలోని వస్తువును గుర్తించండి

  ఈ చిత్రంలోని వస్తువును గుర్తించండి

  రాడార్ గన్
  షాట్ గన్
  టెంపరేచర్ గన్
  వాటర్ గన్

  Answer: టెంపరేచర్ గన్

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న

  సాధారణంగా వీటిలో మహా సముద్రంగా పరిగణించబడనిది ఏది?
  a) ఫసిఫిక్
  b) అట్లాంటిక్
  c) హిందూ
  d) అరేబియా


  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50: 50 లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. ఆప్షన్ ఉపయోగించుకొన్న తర్వాత హిందూ, అరేబియా మిగలడంతో అరేబియా సమాధానం చెప్పారు. దాంతో కరెక్ట్ కావడంతో ఐదు వేలు గెలుచుకొన్నారు.
  Answer: అరేబియా

   10000 రూపాయల కోసం ప్రశ్న

  10000 రూపాయల కోసం ప్రశ్న

  హిట్ మ్యాన్ పిలువబడే, ముంబై ఇండియన్ జట్టుకి ఎక్కువ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించినది ఎవరు?

  a) హార్తిక్ ప్యాండ్యా
  b) రోహిత్ శర్మ
  c) బ్రూమ్రా
  d) హర్బజన్ సింగ్

  Answer: రోహిత్ శర్మ

  20000 రూపాయల కోసం ఏడవ ప్రశ్న

  20000 రూపాయల కోసం ఏడవ ప్రశ్న

  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ జాబితాలో కనిపించే NOTA లో N అంటే ఏమిటి?
  a) నల్
  b) నంబర్
  c) నన్
  d) నేమ్

  Answer: నన్

  40000 రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

  40000 రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

  రామాయణంలో దశరథుడు, రాముడు పరిపాలించిన రాజ్యం ఏది?
  a) కోసల
  b) జనక
  c) మిథిల
  d) అంగ

  Answer: కోసల

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో అంజనీ కుమార్ ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ ఎక్కువగా కోసలకు సమాధానం ఇవ్వడంతో దానిని సమాధానంగా చెప్పారు. దాంతో 40 వేలు గెలుచుకొన్నారు.

  80000 రూపాయల కోసం ప్రశ్న

  80000 రూపాయల కోసం ప్రశ్న

  అరుకు లోయ వీటిలో ఏ తోటలకు ప్రసిద్ధి?
  a) రబ్బర్
  b) చెక్కెర
  c) కాఫీ
  d) ఆరెంజ్

  Answer: కాఫీ

   160000 రూపాయల కోసం ప్రశ్న

  160000 రూపాయల కోసం ప్రశ్న

  ఈ కట్టడాలలో ఒక యుద్ధ స్మారకం ఏది?
  a) ఇండియా గేట్
  b) చార్మినార్
  c) జంతర్ మంతర్
  d) గేట్ వే ఆఫ్ ఇండియా

  Answer: ఇండియా గేట్

   10 320000 రూపాయల కోసం ప్రశ్న

  10 320000 రూపాయల కోసం ప్రశ్న

  2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశ ప్రధాని ముఖ్య అతిథిగా రావాల్సి ఉండి తన పర్యటనను రద్దు చేసుకొన్నాడు?
  a) ఫ్రాన్స్
  b) జర్మనీ
  c) యూకే
  d) దక్షిణాఫ్రికా

  Answer: యూకే

  ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత అంజనీ కుమార్ చిన్నప్పుడు ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను చూపించాడు. దాంతో ఎన్టీఆర్ షాక్ తిన్నారు. ఆ తర్వాత యమదొంగ సినిమాలోని అతిపెద్ద డైలాగ్‌ను ఏకబిగిన చెప్పి ఎన్టీఆర్ ప్రశంసలు అందుకొన్నారు. ఆ తర్వాత అరవింద సమేత చిత్రం కోసం మూడు గంటల సినిమాను గంటన్నరలోపే రాసి సినిమాకు వెళ్లాను అని చెబితే.. పాస్ అయ్యారా అంటూ అడిగితే అయ్యాను అంటూ అంజనీ కుమార్ సమాధానం చెప్పారు.

  11 640000 రూపాయల కోసం ప్రశ్న

  11 640000 రూపాయల కోసం ప్రశ్న

  మహాత్మ గాంధీని అప్యాయంగా మిక్కి మౌస్ అనే ముద్దుపేరుతో పిలిచిన వారు ఎవరు?
  a) ఎంఎస్ సుబ్బలక్ష్మీ
  b) ఇందిరాగాంధీ
  c) సరోజినీ నాయుడు
  d) అరుణ అసఫ్ ఆలీ

  Answer: సరోజిని నాయుడు

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్‌ ఆప్షన్ ఉపయోగించుకొని తన తండ్రికి కాల్ చేశారు. పై ప్రశ్నను చెప్పగానే ఆప్షన్లను చెప్పకుండానే సమాధానం చెప్పడం జరిగింది. దాంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి 640000 రూపాయలు గెలుచుకొన్నారు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  1250000 రూపాయల కోసం ప్రశ్న

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  గోల్కొండ పత్రిక అనే పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించిన సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎవరు?
  a) విశ్వనాథ సత్యనారాయణ
  b) త్రిపురనేని గోపిచంద్
  c) ఆచార్య రాయప్రోలు సుబ్బరావు
  d) సురవరం ప్రతాపరెడ్డి

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో.. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. కాబట్టి నేను గేమ్ నుంచి క్విట్ అవుతాను అని అంజనీ కుమార్ అనడంతో ఎన్టీఆర్ సరే అన్నారు. దాంతో అంజనీ కుమార్ గేమ్ నుంచి బయటకు వచ్చారు.

  Answer: సురవరం ప్రతాపరెడ్డి

  అంజనీకుమార్ గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శంఖం మోగడంతో ఆట నుంచి ముగించారు.

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show September 13th Episode: Guntur's Doctor Anjani Kumar played Brilliantly.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X