For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Sept 15th Show: ఎన్టీఆర్ షోలో ఆటో డ్రైవర్.. ఎంత సంపాదించారంటే.. ప్రశ్నలు జవాబులు ఇవే

  |

  అత్యంత ప్రేక్షకదారణ పొందిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో విజయవాడకు చెందిన ఆనంద్ ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ పోటీలో విజయం సాధించిన హాట్ సీట్‌పైకి చేరుకొన్నారు. సినిమాలంటే ఇష్టపడే ఆనంద్ కుమార్ మూడు షార్ట్ ఫిల్మ్స్‌లకు కూడా దర్శకత్వం వహించారు. క్రికెట్, పింగిళి వెంకయ్యపై ష్టార్ట్ ఫిలిం రూపొందించారు. తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకు ఈ గేమ్ షోలోకి వచ్చానని చెప్పారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆనంద్ ఎంత గెలిచాడు. ఈ గేమ్‌లో సంపాదించిన సొమ్ముతో తండ్రి చేసిన అప్పులను తీర్చాడా? ఎలాంటి ప్రశ్నలకు తడబాటుకు గురయ్యారు అనేది తెలుసుకొందాం

  Pawan Kalyan చైత్ర కుటుంబానికి జనసేన అధినేత పరామర్శ.. గుండెలకు హత్తుకొని ఎమోషనల్ (ఫోటోలు)

  ఈ సినిమాలకు, వాటి పేర్లలో కనిపించే సంఖ్యల ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకి అమర్చండి.

  ఈ సినిమాలకు, వాటి పేర్లలో కనిపించే సంఖ్యల ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకి అమర్చండి.


  A) F2 ఫన్ అండ్ ప్రస్టేషన్
  B) కేడీ నంబర్ 1
  C) ఖైదీ నంబర్ 150
  D) ఆర్ఎక్స్ 100

  పై ప్రశ్నకు ఆనంద్ కుమార్ సరియైన సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే..

  Answer: B, A, D, C

  1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

  1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

  సాధారణంగా రేడియేటర్, కార్పురేటర్, ఇండికేటర్ మరియు యాక్సిలేటర్ వీటిలో ఎందులో కనిపిస్తాయి?

  a) బై సైకిల్
  b) కారు
  c) కంప్యూటర్
  d) రిఫ్రిజిరేటర్

  Answer: కారు

  2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

  2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

  వీటిలో ఒక పువ్వు పేరు లేని సినిమా పేరు ఏది?
  a) సంపంగి
  b) రోజా
  c) ఎర్ర మందారం
  d) ఈగ

  Answer: ఈగ

  3000 వేల రూపాయల కోసం మూడో ప్రశ్న

  3000 వేల రూపాయల కోసం మూడో ప్రశ్న

  వీటిలో లస్సీలో ప్రధాన పదార్థం ఏది?
  a) చెరకు
  b) పెరుగు
  c) కొబ్బరి
  d) గుడ్డు

  Answer: పెరుగు

  5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

  5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

  ఒక సామెత ప్రకారం ఏది లేనిదే పొగరాదు?

  a) ఉప్పు
  b) తప్పు
  c) నిప్పు
  d) పప్పు

  Answer: నిప్పు

  10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

  10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

  కెప్టెన్ కూల్ అని పిలవబడే భారత క్రికెటర్ ఎవరు?

  a) విరాట్ కోహ్లి
  b) ఎంఎస్ ధోని
  c) హర్బజన్ సింగ్
  d) హార్థిక్ పాండ్యా

  Answer: ఎంఎస్ ధోని

  కోవిడ్-19 టీకా అందించడానికి వాడే యాప్ మరియు వైబ్‌సైట్ పేరు ఏమిటి?

  కోవిడ్-19 టీకా అందించడానికి వాడే యాప్ మరియు వైబ్‌సైట్ పేరు ఏమిటి?

  a) కొవాక్సిన్
  b) కోవిన్
  c) కోవిషిల్డ్
  d) కోవిడ్ హెల్ప్

  Answer: కోవిన్

  పై ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వడంతో ఆనంద్ గేమ్ నుంచి వైదొలిగారు. కేవలం 10 వేల రూపాయలను గెలుచుకోవడం జరిగింది. అయితే ఇది ఓటమి కాదు.. గెలుపుకు మెట్టు అని ఆనంద్‌కు ఎన్టీఆర్ చెప్పారు.
  ------------------------

  ఆనంద్ వెళ్లిపోవడంతో మళ్లీ పాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో అడిగిన ఫాస్టెస్ట ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే

  సగటున ఒక గంటకి అత్యధిక విద్యుత్తు వాడే పరికరంతో మొదలుపెట్టి, వీటిని ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి.

  సగటున ఒక గంటకి అత్యధిక విద్యుత్తు వాడే పరికరంతో మొదలుపెట్టి, వీటిని ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి.

  A) జీరో వాట్ బల్బ్
  B) స్టేడియం ఫ్లడ్‌లైట్
  C) ఎయిర్ కండిషనర్
  D) సిలింగ్ ఫ్యాన్

  Answer:B C D A

  పై ప్రశ్నకు గుంటూరుకు చెందిన సునీత కరెక్టుగా సమాధానం చెప్పడంతో హాట్ సీట్‌పైకి వచ్చారు.

   మొదటి ప్రశ్న 1000 రూపాయల కోసం

  మొదటి ప్రశ్న 1000 రూపాయల కోసం

  గ్రంథాలయంలో ప్రధానంగా కనిపించే సూచన ఏది?
  a) వాహనములు నిలుపరాదు
  b) అపాయం
  c) ప్రవేశం లేదు
  d) నిశ్శబ్దం పాటించండి

  Answer: నిశ్శబ్దం

  రెండో ప్రశ్న 2000 రూపాయల కోసం

  రెండో ప్రశ్న 2000 రూపాయల కోసం

  రవ్వ లడ్డు చేయడానికి వీటిలో ఏ రకం రవ్వ వాడుతారు?
  a) బొంబాయి
  b) ఢిల్లీ
  c) కలకత్తా
  d) మద్రాస్

  Answer: బొంబాయి

  మూడో ప్రశ్న 3000 రూపాయల కోసం

  మూడో ప్రశ్న 3000 రూపాయల కోసం

  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పదవ తరగతి బోర్డు పరీక్షలని, వీటిలో ఏ పేరుతో పిలుస్తారు?

  a) జేఈఈ
  b) ఎస్‌ఈఈటీ
  c) యూపీఎస్‌సీ
  d) ఎస్ఎస్‌సీ

  Answer: ఎస్ఎస్‌సీ

  నాలుగో ప్రశ్న 5000 రూపాయల కోసం

  నాలుగో ప్రశ్న 5000 రూపాయల కోసం

  సంప్రదాయ హిందూ దేవాలయాల్లో మూలవిరాట్టుని వీటిలో ఏ ప్రదేశంలో చూడవచ్చు?
  a) గోపురం
  b) గుర్బగుడి
  c) ప్రకారం
  d) మండపం

  Answer: గర్బగుడి

   ఐదో ప్రశ్న 10000 కోసం

  ఐదో ప్రశ్న 10000 కోసం

  వీటిలో ఎనలాగ్ గడియారంలో ముళ్లు సరళరేఖలో ఉండే సమయం ఏది

  a) 6 గంటలు
  b) 1 గంట
  c) 5 గంటలు
  d) 3 గంటలు

  Answer: 6 గంటలు

  ఆరో ప్రశ్న 20000 రూపాయల కోసం

  ఆరో ప్రశ్న 20000 రూపాయల కోసం

  రాజ్ ఘాట్ ఏ నాయకునికి అంకితం చేయబడిన స్మారకం?
  a) జవహర్ లాల్ నెహ్రూ
  b) రాజీవ్ గాంధీ
  c) మహాత్మాగాంధీ
  d) లాల్ బహద్దూర్ శాస్త్రి

  Answer: మహాత్మాగాంధీ

  అయితే ఈ ప్రశ్నకు తడబాటు పడటంతో సునీత లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోగా, ఎక్కువ మంది మహాత్మాగాంధీ సమాధానం చెప్పారు. దాంతో సునీత కూడా అదే సమాధానం చెప్పి 20000 గెలుచుకొన్నారు. అయితే శంఖం మోగడంతో ఆట ముగిసిందని ప్రకటించారు. సునీత గురువారం రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా గేమ్ ఆడుతారు.

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show September 15th Episode: Auto Driver Anand of Vijayawada has participated in EMK Show on September 15th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X