twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Sept 16th Show: ఎన్టీఆర్‌కు అభిమాని అరుదైన గిఫ్టు.. యంగ్ టైగర్‌కు ఏమిచ్చారంటే!

    |

    అత్యంత ప్రేక్షకదారణను సొంతం చేసుకొంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా గుంటూరుకు చెందిన సునీత హాట్ సీట్‌పైకి వచ్చారు. అయితే సునీత గురువారం ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది? కోటి రూపాయలు గెలుచుకొన్నారా? ఎంత మొతాన్ని గెలుచుకొన్నారనే విషయాన్ని తెలుసుకొందాం..

    ఎనిమిదో ప్రశ్న 80000 రూపాయల కోసం

    ఎనిమిదో ప్రశ్న 80000 రూపాయల కోసం

    జూలై 2021లో భారత ప్రభుత్వం వీటిలో ఏ మంత్రిత్వశాఖను నూతనంగా ఏర్పాటు చేసింది?
    a) సహకారం
    b) శాంతి
    c) నిజం
    d) కనికరం

    Answer: సహకారం

    తొమ్మిదో ప్రశ్న 160000 రూపాయల కోసం

    తొమ్మిదో ప్రశ్న 160000 రూపాయల కోసం

    రాణీ రాంపాల్ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో వీటిలో ఏ ఆటకి భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహించారు?

    a) షాట్‌పుట్
    b) అథ్లెటిక్స్
    c) హాకీ
    d) వాలీబాల్

    Answer: హాకీ

    పదో ప్రశ్న 320000 రూపాయల కోసం

    పదో ప్రశ్న 320000 రూపాయల కోసం

    పోచంపల్లిచీరల అద్దకపు కళ అయిన ఇక్కత్ ఏ భాష నుండి వచ్చిన పదం?

    a) మలయ్
    b) పర్షియన్
    c) ఉర్దూ
    d) జపనీస్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్స్ ఉపయోగించుకొన్నారు. మొదటి 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకోగా తెరపైన మలయ్, పర్షియన్‌ జవాబులు మిగిలాయి. అయితే ఇంకా అనుమానం ఉండటంతో వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. అయితే మలయ్ సమాధానం చెప్పి 320000 గెలుచుకొన్నారు.

    Answer: మలయ్

    తొమ్మిదో ప్రశ్న 640000 రూపాయల కోసం

    తొమ్మిదో ప్రశ్న 640000 రూపాయల కోసం

    ఒక మహిళ అధ్యక్షురాలిగా ఉన్న మొట్టమొదటి దేశం ఏది?
    a) అర్జెంటీనా
    b) న్యూజిలాండ్
    c) శ్రీలంక
    d) ఐస్ ల్యాండ్

    గుంటూరుకు చెందిన సునీత పైప్రశ్నకు శ్రీలంక అని సమాధానం చెప్పారు. అయితే ఆ సమాధానం తప్పు కావడంతో హాట్ సీట్‌ నుంచి బయటకు వచ్చారు. తప్పుడు సమాధానం చెప్పడంతో ఆటను కొనసాగించలేక మొత్తం 320000 గెలుచుకొని గేమ్ నుంచి వైదొలిగారు.


    Answer: అర్జెంటీనా

    ఇక సునీత గేమ్ నుంచి అవుట్ కావడంతో మరోసారి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ నిర్వహించారు.

    ఇక సునీత గేమ్ నుంచి అవుట్ కావడంతో మరోసారి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ నిర్వహించారు.

    ఈ ముఖ్యమంత్రులను, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రదేశాల ప్రకారం, ఉత్తరం నుంచి మొదలుపెట్టి దక్షిణం దిక్కుకు అమర్చండి

    A) బసవరాజ్ బొమ్మయి
    B) అరవింద్ కేజ్రీవాల్
    C) నితీష్ కుమార్
    D) పినరయి విజయన్

    ఈ టాస్క్‌లో విశాఖపట్న జిల్లాకు చెందిన దయాసాగర్ ఉల్లాసముగల చాలా వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. గత రెండు మూడు రోజులుగా కరెక్ట్ సమాధానాలు చెప్పాను. కానీ వేగంగా చెప్పలేకపోయాను. ఈ రోజు వేగంగా సమాధానం చెప్పి ఇక్కడి వచ్చాను అని దయా చెప్పారు. గేమ్‌లోకి వెళ్లడానికి ముందు యంగ్ టైగర్‌కు సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను స్వయంగా చిత్రించి బహుమతిగా ఇచ్చారు.

    Answer: B, C, A, D

    రూపాయలు 1000 కోసం మొదటి ప్రశ్న

    రూపాయలు 1000 కోసం మొదటి ప్రశ్న

    వయోజనులు వీటిలో ఏది చేయడానికి ఆర్‌టీవో లైసెన్స్ ఇస్తారు?
    a) వేటాడటం
    b) ఎగరడం
    c) చేపలు పట్టడం
    d) వాహనాలు నడపడం

    Answer: వాహనాలు నడపడం

    రూపాయలు 2000 కోసం రెండో ప్రశ్న

    రూపాయలు 2000 కోసం రెండో ప్రశ్న

    వీటిలో డార్క్, వైట్ మరియు మిల్క్ అనే మూడు ప్రధాన రకాలు కలిగినది ఏది?
    a) చక్కెర
    b) చాక్లెట్
    c) తేనె
    d) టీ

    Answer: చాక్లెట్

    రూపాయలు 3000 కోసం మూడో ప్రశ్న

    రూపాయలు 3000 కోసం మూడో ప్రశ్న

    సాధారణంగా వీటిలో ఏ ఆటలోని బంతులు పసుపు రంగులో ఉంటాయి?
    a) క్రికెట్
    b) టెన్నిస్
    c) ఫుట్ బాల్
    d) బాస్కెట్ బాల్

    Answer: టెన్నిస్

    రూపాయలు 5000 కోసం నాలుగో ప్రశ్న

    రూపాయలు 5000 కోసం నాలుగో ప్రశ్న

    ఈ ఆడియో క్లిప్‌లో పాడుతున్న గాత్రం ఏ నటుడిదో గుర్తించండి?

    a) బ్రహ్మనందం
    b) ఆలీ
    c) తాగుబోతు రమేష్
    d) వేణుమాధవ్

    Answer: వేణుమాధవ్

    రూపాయలు 10000 కోసం ఐదో ప్రశ్న

    రూపాయలు 10000 కోసం ఐదో ప్రశ్న

    బ్యాడగి, గుంటూరు, జ్వాలా మరియు భూత్ జలోకియా అనేవి వీటిలో దేనిలో రకాలు?
    a) బంగాళ దుంపలు
    b) మామిడి కాయలు
    c) మిరప కాయలు
    d) ఉల్లిపాయలు

    Answer: మిరప కాయలు

    రాజారూపాయలు 20000 కోసం ఆరో ప్రశ్న

    రాజారూపాయలు 20000 కోసం ఆరో ప్రశ్న

    రవివర్మ గీసిన చిత్రం జటాయు వధలో పక్షిని చంపుతున్న పాత్రను గుర్తించండి

    a) లక్ష్మణుడు
    b) రావణుడు
    c) కుంభకర్ణుడు
    d) విభీషణుడు

    Answer: రావణుడు

    Recommended Video

    Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
    రూపాయలు 40000 కోసం ఏడో ప్రశ్న

    రూపాయలు 40000 కోసం ఏడో ప్రశ్న

    వీటిలో ప్రధాన భారతీయ నగరాలను కలిపే జాతీయ రహదారుల నెట్‌వెర్క్ ఏది?
    a) గోల్డెన్ స్వ్కేర్
    b) గోల్డెన్ ట్రయాంగిల్
    c) గోల్డెన్ క్వాడ్రిలేటరల్
    d) గోల్డెన్ పెంటగాన్

    పై ప్రశ్నకు గొల్డెన్ స్వ్కేర్ అని దయా సాగర్ సమాధానం చెప్పాడు. అయితే మీకు లైఫ్‌లైన్ ఆప్షన్లు ఉన్నాయి. డౌట్ ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు అంటూ ఎన్టీఆర్ సూచించాడు. అయితే లైఫ్ లైన్ ఉపయోగించుకోకుండా అదే సమాధానం చెప్పాడు. ఆ సమాధానం తప్పు కావడంతో గేమ్ నుంచి అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో 10వేల రూపాయలతో గేమ్ నుంచి వెళ్లిపోయాడు. దాంతో శంఖం ముగియడంతో ఈ గేమ్ ముగిసిపోయింది.

    Answer: గోల్డెన్ క్వాడ్రిలేటరల్

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show September 16th Episode: Sunitha comes as roll over contestan on hot seat. After sunitha, Daya Sagar of Vishakapatnam comes onto Hot seat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X