twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Sept 16th Show: ఎన్టీఆర్ షోలో రాజమౌళి, కొరటాల శివ ఎంత గెలిచారంటే?

    |

    వెండితెర మీద అద్భుతాలు సృష్టిస్తున్న ప్రముఖ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ ఇద్దరూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు షోలో ముఖ్య అతిథులుగా వచ్చారు. ఛారిటీ కోసం సహాయం చేయడానికి వచ్చిన ఈ ఇద్దరు హాట్ సీట్‌పై హంగామా చేశారు. హోస్ట్ సీటుపై ఉన్న ఎన్టీఆర్‌ను చిలిపిగా, అల్లరిగా ఆటపట్టించారు. ఈ షోలో రాజమౌళి, కొరటాల శివ ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు? ఎంత మొత్తం గెలుచుకొన్నారు అని తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నలను ఫాలో అవ్వండి.. అది కాకుండా మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ఓ సారి మీ నాలెడ్డ్ పరీక్షించుకోండి.

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    1000 రూపాయల కోసం మొదటి ప్రశ్న

    1. విజువల్ ఎఫెక్ట్స్‌లోని CGIలో C దేనిని సూచిస్తున్నది?

    a) క్రాస్టింగ్
    b) కంప్యూటర్
    c) కాంట్రిబ్యూషన్
    d) కండీషన్

    Answer: కంప్యూటర్

     2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    2000 రూపాయల కోసం రెండో ప్రశ్న

    2. రామయణంలో అశోకవనం ఎక్కడ కనిపిస్తుంది.
    a) కిష్కింద
    b) మిథిల
    c) కోసల
    d) లంక

    Answer: లంక

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    3000 రూపాయల కోసం మూడో ప్రశ్న

    3.
    ఈ పాట పాడిన గాయకుడు ఎవరు?
    a) ఘంటసాల
    b) మొహమ్మద్ రఫీ
    c) మన్నాడే
    d) ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం

    Answer: మొహమ్మద్ రఫీ

    ఆరాధన చిత్రంలోని పాటను బాలసుబ్రహ్మణ్యంకు అత్యంత ఇష్టమైన మొహమ్మద్ రఫీ పాడారు అని రాజమౌళి సమాధానం చెప్పారు. అయితే ఈ సినిమా పేరుతో మొత్తం మూడు సినిమాలు వచ్చాయని ఈ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పారు.

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    వీటిలో, గోల్డెన్ లయన్, గోల్డెన్ పీకాక్, మరియు గోల్డెన్ పామ్ దేనికి ఉదాహరణలు?
    a) స్టూడియోలు
    b) కెమెరాలు
    c) అవార్డులు
    d) ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు

    Answer: అవార్డులు

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    5.
    ఈ చిత్రంలో కనిపిస్తున్న ల్యాండ్ మార్క్ ఏ దేశంలో ఉన్నదో గుర్తించండి
    a) లావోస్
    b) థాయ్ లాండ్
    c) కంబోడియా
    d) వియత్నాం

    Answer: కంబోడియా

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    20000 రూపాయల కోసం ఆరో ప్రశ్న

    అమర చిత్ర అనే కామిక్ పుస్తక ప్రచురణ సంస్థను స్థాపించింది ఎవరు?
    a) అనంత్ పాయ్
    b) వర్గీస్ కురియన్
    c) సత్యజిత్ రే
    d) బాబా సాహెబ్ ఫాల్కే

    Answer: అనంత్ పాయ్

     40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    40000 రూపాయల కోసం ఏడో ప్రశ్న

    చిన్నదేవీ, మరియు తిరుమలదేవీ వీరిలో ఏ పాలకుని యొక్క రాణులు?
    a) ప్రతాపరుద్రుడు
    b) గణపతి దేవుడు
    c) రాజరాజచోళుడు
    d) కృష్ణదేవ రాయులు

    Answer: కృష్ణదేవ రాయులు

     80000 రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

    80000 రూపాయల కోసం ఎనిమిదో ప్రశ్న

    వీరిలో గయోపాఖ్యానం మరియు గణపతి అనే రచనలు చేసింది ఎవరు?

    a) యుద్ధనపూడి సులోచనరాణి
    b) చిలకమర్తి లక్ష్మీ నరసింహం
    c) విశ్వనాథ సత్యనారాయణ
    d) దాశరథి కృష్ణమాచార్యులు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50: 50 లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు యుద్ధనపూడి సులోచనరాణి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఉండటంతో చిలకమర్తి లక్ష్మీ నరసింహం అని సమాధానం చెప్పి 80000 గెలుచుకొన్నారు.

    Answer: చిలకమర్తి లక్ష్మీ నరసింహం

    160000 రూపాయల కోసం తొమ్మిదో ప్రశ్న

    160000 రూపాయల కోసం తొమ్మిదో ప్రశ్న

    2021 టీ 20 ప్రపంచకప్‌కు భారత జట్టు మెంటర్‌గా ఎవరు నియమితులయ్యారు?
    a) రాహుల్ ద్రావిడ్
    b) వీవీఎస్ లక్ష్మణ్
    c) ఎంఎస్ ధోని
    d) సురేష్ రైనా

    Answer: ఎంఎస్ ధోని

    320000 రూపాయల కోసం పదో ప్రశ్న

    320000 రూపాయల కోసం పదో ప్రశ్న

    జూలై 2021లో బ్లూ ఆరిజన్ అనే తన సంస్థ నిర్మించిన అంతరిక్ష నౌకలో అంతరిక్షానికి వెళ్లిన శ్రీమంతుడు ఏవరు?
    a) జెఫ్ బెజోస్
    b) మార్క్ జుకర్‌బర్గ్
    c) ఎలాన్ మస్క్
    d) రిచర్డ్ బ్రాన్సన్

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డకు వీడియో కాల్ ఫోన్ చేసి లైఫ్ లైన్‌ను ఉపయోగించుకొన్నారు. దాంతో ఆయన జెఫ్ బెజోస్ సమాధానం అని చెప్పారు. దాంతో రాజమౌళి, కొరటాల శివ అదే సమాధాన్నాన్ని చెప్పి 320000 గెలుచుకొన్నారు.

    Answer: జెఫ్ బెజోస్

    640000 రూపాయల కోసం పదో ప్రశ్న

    640000 రూపాయల కోసం పదో ప్రశ్న

    హిందూ పురాణాలల్లో, ఇంద్రుడి వజ్రాయుధం ఏ రుషి యొక్క ఎముకలతో తయారు చేయబడింది?
    a) దదీచి
    b) విశ్వామిత్రుడు
    c) కశ్యపుడు
    d) వశిష్టుడు

    Answer: దదీచి

    1250000 రూపాయల కోసం పదకొండో ప్రశ్న

    1250000 రూపాయల కోసం పదకొండో ప్రశ్న

    వీటిలో ఏది మొదట చర్చిగా, తరువాత మసీదుగా, ప్రదర్శన శాలగా, మరల మసీదుగా ఉన్నది?
    a) ద డోమ్ ఆఫ్ ది రాక్
    b) హగియా సోఫియా
    c) టాప్ కాపి ప్యాలెస్
    d) సగ్రాడ ఫమీలియ

    Answer: హగియా సోఫియా

    Recommended Video

    Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
     2500000 రూపాయల కోసం పన్నెండో ప్రశ్న

    2500000 రూపాయల కోసం పన్నెండో ప్రశ్న

    ఈ భారత రాష్ట్రాలలో, ద్విసభా శాసన వ్యవస్థలేనటువంటి రాష్ట్రం ఏది?

    a) తెలంగాణ
    b) మధ్యప్రదేశ్
    c) కర్ణాటక
    d) బీహార్

    Answer: మధ్యప్రదేశ్

    2500000 గెలుచుకొన్న ఆనందంలో రాజమౌళి, కొరటాల శివ ముచ్చట్లోపడిపోయారు. అంతలోనే శంఖం మోగడంతో ఎన్టీఆర్ ఈ రోజుకు ఆట ముగిసిందని చెప్పారు. అలా జక్కన్న, కొరటాల శివ ఇద్దరూ భారీ మొత్తంతో గేమ్ నుంచి నిష్క్రమించారు.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show September 20th Episode: Koratala Siva and SS Rajamouli participated in the NTR's Show and won Rs.2500000
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X