For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Sept 21th Show: ఎన్టీఆర్ షోలో 640000 జవాబుకు కంగారు పడ్డ కంటెస్టెంట్.. ఆ ప్రశ్న ఏమిటంటే?

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా సాగిన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోకు సంబంధించిన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హైదరాబాద్‌కు చెందిన మానస్ తేజ హాట్ సీట్‌పైకి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మానస్ పని చేస్తున్నారు. అయితే ఎలాంటి లైఫ్ లైన్ ఉయోగించుకోకుండా రూ.320000 గెలుచుకొన్నాడు. అయితే 640000 ప్రశ్న వద్ద రెండు లైఫ్ లైన్స్ ఉపయగోించుకొన్నారు. అయితే ఆ ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇచ్చి గేమ్ నుంచి వైదొలిగాడు. ఆ ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెబుతారా? మంగళవారం అడిగిన ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఇవే...

  1000 రూపాయల కోసం

  1000 రూపాయల కోసం

  వీటిలో ఏ పక్షి కూతను కుహు అని వర్ణిస్తారు
  a) డేగ
  b) పావురం
  c) కోయిల
  d) కాకి
  Answer: కోయిల

   2000 రూపాయల కోసం

  2000 రూపాయల కోసం

  వీటిలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్నికి మరియు గాంధీ జయంతికి మధ్యలో వచ్చే నెల ఏది
  a) సెప్టెంబర్
  b) నవంబర్
  c) జూన్
  d) డిసెంబర్

  Answer: నవంబర్

  3000 రూపాయల కోసం

  3000 రూపాయల కోసం

  3000 రూపాయల కోసం
  వీటిలో సాధారణంగా బంతితో ఆడని ఆట ఏది?

  a)టెన్నిస్
  b)క్రికెట్
  c) ఫుట్ బాల్
  d) ఐస్ హాకీ

  Answer: ఐస్ హాకీ

  5000 రూపాయల కోసం

  5000 రూపాయల కోసం

  వీటిలో, ఏమి చేయడానికి ముందు ఒక వ్యక్తి సాధారణంగా సే చీఫ్ అని చెబుతాడు?
  a) ఫోటో తీయడం
  b) టీకా వేయడం
  c) కబడ్డీ ఆడడం
  d) అల్పాహారం తినడం

  Answer: ఫోటో తీయడం

  10000 రూపాయల కోసం

  10000 రూపాయల కోసం

  ఈ పౌరాణిక పాత్రలలో, నారాయణ, నారాయణ అంటూ పలికే వ్యక్తిగా ప్రసిద్ధిగాంచింది ఎవరు?

  a) నారదుడు
  b) శకుని
  c) రావణుడు
  d) శని

  Answer: నారదుడు

  20000 రూపాయల కోసం

  20000 రూపాయల కోసం

  ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రం నుండి తీసుకోబడినదో గుర్తించండి (నవ్వింది మల్లె చెండు పాటను వినిపించారు)
  a) కొండవీటి దొంగ
  b) రుద్రవీణ
  c) అభిలాష
  d) దొంగ మొగడు

  Answer: అభిలాష

  40000 రూపాయల కోసం

  40000 రూపాయల కోసం

  వీటిలో, చర్మంపై బొబ్బలు ఏ వ్యాధిలో సహజ లక్షణం?

  a) క్షయ వ్యాధి
  b) చికెన్ పాక్స్
  c) విరేచనాలు
  d) మైగ్రెయిన్

  Answer: చికెన్ పాక్స్

  80000 రూపాయల కోసం

  80000 రూపాయల కోసం

  1724లో, నిజాం పాలన ప్రారంభించానికి మొదటి అసప్ జా ఏ రాజవంశ పరిపాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు?

  a) పేష్వా
  b) లోడి
  c) తుగ్లక్
  d) మొఘల్

  Answer: మొఘల్

  160000 రూపాయల కోసం ప్రశ్న

  160000 రూపాయల కోసం ప్రశ్న

  ఇతర రాష్ట్రాలతో పంచుకొని ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా ఏది?
  a) విజయనగరం
  b) వైఎస్ఆర్ కడప జిల్లా
  c) కర్నూలు
  d) గుంటూరు జిల్లా

  Answer: వైఎస్ఆర్ కడప జిల్లా

  320000 రూపాయల కోసం ప్రశ్న

  320000 రూపాయల కోసం ప్రశ్న

  2019లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించిన లోక్‌సభ నియోజకవర్గం ఏది?


  a) వారణాసి
  b) వడోదరా
  c) ఇండోర్
  d) అలహాబాద్

  Answer: వారణాసి

  Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
   640000 రూపాయల కోసం ప్రశ్న

  640000 రూపాయల కోసం ప్రశ్న


  2007లో ఏ నగరంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు?
  a) బాన్
  b) సోఫియా
  c) మెక్సికో సిటీ
  d) మాస్కో

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన తొలి లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకోవాలని అనుకొన్నారు. తన స్నేహితుడికి వీడియో కాల్ చేసి ప్రశ్నను చదివి వినిపించారు. అయితే ఆయనకు సమాధానం చెప్పలేకపోగా బాన్, సోఫియాలో ఒకటి అవుతుంది అని చెప్పారు. దాంతో సమాధానం తెలియకపోవడంతో మరో లైఫ్ లైన్ 50:50 ఉపయోగించుకొన్నారు. దాంతో స్క్రీన్ పై సోఫియా, మెక్సికో సిటీ మిగిలాయి. అయితే మానస్ చెప్పిన సోఫియా సమాధానం తప్పు కావడంతో ఆయన గేమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. షో నుంచి 320000 రూపాయలు గెలుచుకొని గేమ్ నుంచి నిష్క్రమించారు.

  Answer: మెక్సికో సిటీ

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show September 21th Episode: Manas of Hyderabad participated in EMK. He won the 320000 in the game.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X