twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jr NTR's Evaru Meelo Koteeswarulu: చూడగానే అన్నయ్యా అంటూ ఏడ్చేసి ఎంత గెలుచుకొన్నారంటే?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రసారమైన షోలో ఇద్దరు కంటెస్టెంట్లు హాట్ సీట్‌పైకి వచ్చారు. వారిలో ఇద్దరూ ఉత్తరాంధ్రకు చెందినవారే కావడం గమనార్హం. వారిలో ఒకరు సంతోష్ నాయుడు కాగా మరొకరు గౌతమి. ఈరోజు ఎపిసోడ్ లో ఈ ఇద్దరూ కూడా వెనకడుగు వేసిన పరిస్థితి. ఈ ఇద్దరూ ఎంత డబ్బు గెలుచుకున్నారు ? ఏయే ప్రశ్నల దగ్గర బోల్తా పడ్డారు అనే వివరాల్లోకి వెళితే

    నిన్నటి ఎపిసోడ్ లో సంతోష్ నాయుడు హాట్ సీట్‌పైకి వచ్చారు. మూడో ప్రశ్నను కంప్యూటర్‌పై ఉంచబోతుండగా శంఖం మోగడంతో సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ ముగిసింది. ఇక ఆయనే ఈరోజు రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా రాగా ఈరోజు మూడవ ప్రశ్న 3000 రూపాయల ప్రశ్న అడిగారు.

    3000 రూపాయల కోసం మూడవ ప్రశ్న

    3000 రూపాయల కోసం మూడవ ప్రశ్న

    3) సాధారణంగా, డయాబెటిస్ ఉన్న వారికి వీటిలో ఏది సిఫారసు చేయబడదు?

    A: పాలకూర
    B: క్యాబేజీ
    C: బాదుషా
    D : గుడ్డు

    Answer: C: బాదుషా

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    ఈ చిత్రంలోని రాజకీయ నాయకురాలిని గుర్తించండి?అంటూ సోనియాగాంధీ ఫోటో పెట్టారు.

    A: స్మృతి ఇరానీ
    B: మనేకా గాంధీ
    C: మీరా కుమార్
    D: సోనియా గాంధీ

    Answer: D: సోనియా గాంధీ

     10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    రామాయణంలో,వీరిలో ఇద్దరు కుమారులు గల వారు ఎవరు?

    A: కౌసల్య
    B: కైకేయి
    C: సుమిత్ర
    D: శూర్పణఖ

    Answer: C: సుమిత్ర

     20000 రూపాయల కోసం అరవ ప్రశ్న

    20000 రూపాయల కోసం అరవ ప్రశ్న

    జూన్ 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ని భారత్ ఏ నగరంలో ఆడింది?

    A: సౌథాంప్టన్
    B: వెల్లింగ్టన్
    C: మాంచెస్టర్
    D: లండన్

    Answer: C: సుమిత్ర కాగా సంతోష్ లండన్ అని చెప్పి ఓటమి పాలయ్యాడు.

    ఇక సంతోష్ వైదొలగడంతో మరో సారి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడారు. ఎపిసోడ్‌లో మొదటి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్

    ఇక సంతోష్ వైదొలగడంతో మరో సారి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడారు. ఎపిసోడ్‌లో మొదటి ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్

    ఈ విద్యార్థి దశలను అవి చదివే కాల క్రమంలో అమర్చండి
    A: నర్సరీ
    B: ఇంటర్మీడియట్ కళాశాల
    C: ప్రాథమిక పాఠశాల
    D: ఉన్నత పాఠశాల

    Answer: నర్సరీ, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల

    రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

    రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

    వీటిలో దేనిని ఒక చెంచాడు తీసుకుని గ్లాసు నీళ్ళలో వేస్తే పూర్తిగా కరిగిపోతుంది?

    A: ఉప్పు
    B: ఇసుక
    C: బియ్యం
    D: జీలకర్ర
    Answer : A: ఉప్పు

    రూ.2000 కోసం రెండవ ప్రశ్న

    రూ.2000 కోసం రెండవ ప్రశ్న

    ఈ సామెతను పూర్తి చేయండి:

    నీరు పల్లమెరుగు----దేవుడెరుగు?

    A: అబద్ధం
    B: నిజం
    C: తేనె
    D: పాలు
    Answer :B: నిజం

     3000 రూపాయల కోసం మూడవ ప్రశ్న

    3000 రూపాయల కోసం మూడవ ప్రశ్న

    క్రికెట్ పిచ్ ప్రతి చివర ఎన్ని వికెట్లు ఉంటాయి?

    A: పది
    B: తొమ్మిది
    C: మూడు
    D: ఒకటి

    Answer :C: మూడు

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    5000 రూపాయల కోసం నాలుగో ప్రశ్న

    హిందూ పురాణాలలో, వీటిలో ఏది విష్ణువు యొక్క అవతారం కాదు?

    A: వామనుడు
    B: నటరాజు
    C: కల్కి
    D: వరాహం

    Answer :B: నటరాజు

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    10000 రూపాయల కోసం ఐదో ప్రశ్న

    ఈ పాట పాడింది ఎవరు? అంటూ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో పాట పాడి వినిపించారు.

    A: కె ఎస్ చిత్ర
    B: ఎస్ జానకి
    C: సునీత
    D: శ్రేయ ఘోషల్

    Answer : A: కె ఎస్ చిత్ర

    20000 రూపాయల కోసం అరవ ప్రశ్న

    20000 రూపాయల కోసం అరవ ప్రశ్న

    వీటిలో, మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన యాప్ పేరు ఏమిటి?

    A: నిషా
    B: మానస్
    C: మదద్
    D: దిశ

    Answer : D: దిశ(ఆడియన్స్ పోల్ తో ఈ సమాధానం ఇచ్చారు)

    40000 రూపాయల కోసం ఏడవ ప్రశ్న

    40000 రూపాయల కోసం ఏడవ ప్రశ్న

    భారతదేశానికి ఉత్తరాగ్రంలో ఉన్న రాష్ట్రం ఏది?

    A: హిమాచల్ ప్రదేశ్
    B పంజాబ్
    C: ఉత్తర ప్రదేశ్
    D: ఉత్తరాఖండ్

    Answer : A: హిమాచల్ ప్రదేశ్(వీడియో కాల్ ఎ ఫ్రెండ్ అంటూ శ్రీరాం అనే కొలీగ్ కి కాల్ చేయగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు)

    Recommended Video

    Prabhudeva Biography.. ఇన్స్పిరేషన్ మెగాస్టార్ !
    80000 రూపాయల కోసం ఎనిమిదవ ప్రశ్న

    80000 రూపాయల కోసం ఎనిమిదవ ప్రశ్న

    వీటిలో, మొదటిగా అంతరిక్షంలోకి వెళ్ళిన జంతువులు ఏవి?

    A: మనుషులు
    B: కుక్కలు
    C: కోతులు
    D: పిల్లులు
    Answer : C: కోతులు
    ఈ ప్రశ్నకు ఆమె కుక్కలు అనుకుని అదే సమాధానం ఇవ్వగా ఆమె షో నుంచి పదివేల రూపాయలతో బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఆమె హాట్ సీట్ కి వచ్చినప్పుడే తాను ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్ ని అని చెబుతూ ఎమోషనల్ అయింది. అంతే కాక అన్నయ్య అని పిలుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కూడా. ఇక వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంటూ ఎన్టీఆర్ నేటి ఎపిసోడ్ కు ముగింపు పలికారు.

    English summary
    NTR's EMK Show September 2nd Episode: Santhosh Naidu of vizianagaram and gouthami of vishakapatnam, have participated in this show. Here are the questions and Answers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X