బిగ్ బాస్ 3: ఎన్టీఆర్ హోస్టింగ్‌పై అనుమానాలు, నో చెప్పాడా?
ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రారంభమైన 'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తారక్ స్టార్ ఇమేజ్ ఈ రియాల్టీ షోను మరో లెవల్‌కు తీసుకెళ్లడంతో పాటు భారీగా టీఆర్పీ రేటింగ్స్ సాధించింది. అయితే 'అరవింద సమేత' షూటింగ్ బిజీ వల్ల రెండో సీజన్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ షో నిర్వాహకులు హీరో నానితో రెండో సీజన్ హోస్ట్ చేయించారు. తొలి సీజన్ స్థాయిలో రేటింగ్స్ రాకపోయినా నాని తనదైన శైలిలో షోను రక్తికట్టించారు. అయితే నాని మరో సీజన్ చేయడానికి ఆసక్తి చూపక పోవడంతో మళ్లీ ఎన్టీఆర్‌తో 'బిగ్ బాస్ 3' హోస్ట్ చేయించే ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ నో చెప్పారట
‘బిగ్ బాస్ 3' హోస్ట్ చేయాలనే ప్రపోజల్‌కు యంగ్ టైగర్ నో చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళితో మాట్లాడిన తర్వాత తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ షూటింగ్
రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా రూపొందుతోంది. ఏప్రిల్ నుంచి మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి సినిమా షూటింగ్ పార్ట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు.

వీలు కాదు, మరొకరిని చూసుకోండని ఎన్టీఆర్ చెప్పారా?
‘ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ బిజీ వల్ల తాను ‘బిగ్ బాస్ 3' షో హోస్ట్ చేయలేనని, మీరు మరొకరిని చూసుకోవాలని ఇప్పటికే తారక్ షో నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం.

ఎన్టీఆర్‌కు ఇష్టమే కానీ...
‘బిగ్ బాస్' షో చేయడంపై ఎన్టీఆర్ ఆసక్తిగా ఉన్నప్పటికీ... ‘ఆర్ఆర్ఆర్' సినిమా వల్ల డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని, పైగా ఇది తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కాబట్టి రెండింటికి డేట్స్ ఇచ్చి రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయడం లేదని సమాచారం.


Click it and Unblock the Notifications











