హాట్ టాపిక్ : కరీనా కపూర్ తో జతకడుతున్న ఎన్టీఆర్

By Srikanya

హైదరాబాద్ : త్వరలో ఎన్టీఆర్ సరసన కరీనా కపూర్ కనపడనుంది. ఇది నిజం. అయితే అది సినిమాల కోసం కాదు. మలబార్ గోల్డ్ వారి డైమండ్స్ ఎడ్వర్టైజ్మెంట్ కోసం ఆమెను ఎన్టీఆర్ సరసన నటింపచేస్తున్నారు. త్వరలోనే ఈ మేరకు ఫోటో షూట్ జరిపి ప్రింట్ మీడియాకు ఇస్తారు. అలాగే.. యాడ్ చిత్రీకరించి టీవి లకు ఇస్తారు. చాలా పెద్ద బడ్జెట్ తో ఈ యాడ్ నిర్మాణం కానుందని సమాచారం.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బాద్ షా మూడ్ లో ఉన్నారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''' దమ్ము తరవాత నాలుగు నెలలు ఖాళీగా ఉన్నా. ఆ విరామంలో శ్రీను వైట్ల నాకు ఆరు కథలు చెప్పాడు. ప్రతి కథా.. అదిరిపోయింది. ఆరు కథల్లో నచ్చిన ఒక్కో అంశం తీసుకొని 'బాద్‌షా' రూపొందించారు. అందుకే.. ఇంత పెద్ద విజయం సాధించింద''న్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'బాద్‌షా'. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

అలాగే... కొన్ని కొన్ని ఆనందాలను మాటల్లో వ్యక్తం చేయలేం. నేను ఈ రోజు అదే స్థితిలో ఉన్నా. నా కెరీర్‌లో గొప్ప విజయాన్ని నాకు అందించిన దర్శకుడు, నా అన్న.. శ్రీను వైట్లకు కృతజ్ఞతలు. కేవలం ఆయన్ని నమ్మే యేడాదిపాటు ఈ సినిమాతో ప్రయాణం చేశా. ఈ సినిమా హిట్టవ్వకపోతే.. పరిశ్రమలో ఉండలేనేమో అనే ఆలోచనలు ఎంత మాత్రం లేవు. నన్ను కన్న నా తల్లిదండ్రులు, నా దైవం ఎన్టీఆర్‌ అండదండలు నాకెప్పటికీ ఉంటాయి. అభిమానుల ప్రోత్సాహం కూడా మర్చిపోలేనుఅన్నారు.

ఇక 'బాద్‌షా' విషయానికొస్తే.. ఆ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు కూడా భయపడ్డాను. నా జీవితాంతం మర్చిపోలేని సన్నివేశం అది. నా నుంచి ఏమీ ఆశించకుండా స్నేహితుడి పాత్ర వేశాడు సిద్ధార్థ్‌. తనకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నిర్మాత కూడా చాలా కష్టపడ్డాడు. ఎప్పుడు పలకరించినా.. 'బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఇవ్వాలన్నా..' అనేవాడు. తథాస్తు దేవతలు అతని మాట విన్నారేమో అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X