For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jr NTR's Evaru Meelo Koteeswarulu: ‘మర్యాద’కు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్.. 640000 లక్షల ప్రశ్నకు జవాబు ఏమిటంటే?

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో మరో ఫీల్‌గుడ్ ఎపిసోడ్‌కు సాక్ష్యంగా నిలిచింది. ఈ షోలో హైదరాబాద్‌కు చెందిన మనీష్ మర్యాద హాట్ సీట్‌పై చాలా చురుకుగా సమాధానాలు చెప్పారు. ఈ షో నుంచి మనీష్ ఎంత గెలుచుకొన్నారు. ఎన్టీఆర్‌ను ఇంప్రెస్ చేస్తూ గేమ్‌ను ఎలా ఆడారనే విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  ఎపిసోడ్ 8కి సంబంధించిన ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే

  కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లేటప్పుడు అది ఆగే వరుసలో ఈ ప్రదేశాలను అమర్చండి

  కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లేటప్పుడు అది ఆగే వరుసలో ఈ ప్రదేశాలను అమర్చండి


  A) రేణిగుంట

  B) నెల్లూరు
  C) విజయవాడ
  D) వరంగల్

  సరైన సమాధానం: వరంగల్, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట

  ప్రై ప్రశ్నకు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌ పోటీలో హైదరాబాద్‌కు చెందిన మనీష్ మర్యాద చాలా వేగంగా సమాధానం ఇచ్చారు. దాంతో ఆయన హాట్ సీట్‌పైకి వచ్చారు. ఈ సమాధానాన్ని 5.789 సెకన్లలో జవాబు చెప్పారు. యూస్ రిటర్న్ అయిన మనీష్.. స్టార్టప్ కంపెనీకి సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్నారు.

  రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

  1. ఈ పదాలలో నౌకాధ్యక్షుడు అని మరియు ఒక క్రీడాజట్టుకి నాయకత్వం హించేవాడనీ అర్దం వచ్చే పదం ఏది?
  a) కెప్టెన్
  b) కమాండర్
  c) కోచ్
  d) కండక్టర్

  Answer: కెప్టెన్

  రూ.2000 కోసం రెండో ప్రశ్న

  రూ.2000 కోసం రెండో ప్రశ్న

  1. వీటిలో దేని ముందు ముళ్లు అని పెడితే మరో ప్రాణి పేరు వస్తుంది?
  a) పంది
  b) కుక్క
  c) పిల్లి
  d) పులి

  Answer: పంది

  రూ.3000 కోసం మూడో ప్రశ్న

  రూ.3000 కోసం మూడో ప్రశ్న

  3. వీటిలో భేల్‌పూరిలో ప్రధాన పదార్థం ఏది?
  a) శనగపప్పు
  b) బొరుగులు
  c) సేమ్యా
  d) గోధుమ

  Answer: బొరుగుల

  రూ.5000 కోసం నాలుగో ప్రశ్న

  రూ.5000 కోసం నాలుగో ప్రశ్న

  4. ఈ పాట పాడిన గాయకులు ఎవరు? ( నువ్వొస్తానంటే వద్దంటానా? చిత్రంలోని చంద్రుడిలో ఉండే కుందేలు.. కిందికి వచ్చిందా? అనే పాట)
  a) శంకర్ మహదేవన్
  b) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  c) కార్తీక్
  d) ఎంఎం కీరవాణి

  Answer: శంకర్ మహదేవన్

  ఈ పాటను చాలా సార్లు విన్నాను. నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి అని మనీష్ చెబితే.. నాకు కూడా ఇష్టమైన పాట అంటూ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు.

  రూ.10000 కోసం ఐదో ప్రశ్న

  రూ.10000 కోసం ఐదో ప్రశ్న

  5. టోల్ బూతులలో నగదు రహిత చెల్లింపు చేయడానికి వీలు కలిపించే సౌకర్యం పేరు ఏమిటి?
  a) నేమ్ ట్యాగ్
  b) టోల్ ట్యాగ్
  c) స్లోట్యాగ్
  d) ఫాస్ట్ ట్యాగ్

  Answer: ఫాస్ట్ ట్యాగ్

  పై ప్రశ్నకు సరైన సమాధానాన్ని మనీష్ చెప్పడంతో తొలి మైలురాయిని అధిగమించారు. ఈ షోలో కనీసం పదివేల రూపాయలు ఇంటికి తీసుకెళ్లే అవకాశం కలిగింది.

  రూ.20000 కోసం ఆరో ప్రశ్న

  రూ.20000 కోసం ఆరో ప్రశ్న

  6. వీటిలో రూంలలో ఆడియో ద్వారా మాట్లాడుకొనే యాప్ ఏమిటి?
  a) ఇన్స్‌టాగ్రాం
  b) ఫేస్ బుక్
  c) క్లబ్ హౌస్
  d) స్నాప్ చాట్

  Answer: క్లబ్ హౌస్

  తాను పై నున్న నాలుగు యాప్‌లను ఉయోగిస్తాను. ఎక్కువగా ఇన్స్‌టాగ్రామ్, క్లబ్ హౌస్ వాడుతున్నాను. ఊర్లలో గల్లీలో ముచ్చట్లు పెట్టుకొనే విధంగా క్లబ్ హౌస్‌లో అందరూ మాట్లాడుకొంటారు అని మనీష్ సమాధానం చెబితే... నేను ఎప్పుడూ వాడలేదు అని ఎన్టీఆర్ సమాధానం చెప్పారు. పాల్ డేవిడ్సన్ దీనిని ప్రారంభించారు అని ఎన్టీఆర్ మరింత సమాచారం ఇచ్చారు.

  రూ.40000 కోసం ఏడో ప్రశ్న

  రూ.40000 కోసం ఏడో ప్రశ్న

  7. మహాభారతం ప్రకారం.. భీష్ముడు గంగకు మరియు వీరిలో ఎవరికీ సంతానంగా జన్మించారు?
  a) ఇంద్రుడు
  b) వేద వ్యాసుడు
  c) శంతనుడు
  d) శివుడు

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. ఆడియెన్స్ అత్యధిక మంది ఇచ్చిన సమాధానం శంతనుడు ను లాక్ చేసి 40 వేలు సంపాదించుకొన్నాడు.

  Answer: శంతనుడు

  రూ.80000 కోసం ఎనిమిదో ప్రశ్న

  రూ.80000 కోసం ఎనిమిదో ప్రశ్న

  8. బాపు, జాతిపిత అని పిలువబడే వ్యక్తి పేరు మీదుగా వీటిలో ఏ రాష్ట్ర రాజధానికి పేరు పెట్టారు?
  a) మహారాష్ట్ర
  b) కర్ణాటక
  c) తమిళనాడు
  d) గుజరాత్

  Answer: గుజరాత్

  రూ.160000 కోసం తొమ్మిదో ప్రశ్న

  రూ.160000 కోసం తొమ్మిదో ప్రశ్న

  9. 2021 ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ భారతదేశం నుంచి వీటిలో ఏ దేశానికి మార్చారు?
  a) సౌదీ అరేబియా
  b) దక్షిణాఫ్రికా
  c) ఓమన్
  d) బార్బడోస్

  Answer: ఓమన్

  రూ.320000 కోసం 10వ ప్రశ్న

  రూ.320000 కోసం 10వ ప్రశ్న

  10. సౌర కుటుంబంలో ఒక సంవత్సరం కన్నా ఒక రోజు ఎక్కువ సేపు ఉండే ఒకే ఒక్క గ్రహం ఏది?
  a) బుధుడు
  b) శుక్రుడు
  c) శనిగ్రహం
  d) యురేనస్

  Answer: శుక్రుడు

  పై ప్రశ్నకు మనీష్ మర్యాద సరిగా సమాధానం చెప్పడంతో రూ.320000 గెలుచుకొన్నారు. దాంతో మనీష్ పేరుపై చెక్ రాసి ఎన్టీఆర్ సంతకం పెట్టి పక్కనే పెట్టుకొన్నాడు. మరింత డబ్బు గెలుచుకోవాలని సూచిస్తూ మరో ప్రశ్న కోసం ముందుకెళ్లారు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  రూ.640000 కోసం 11వ ప్రశ్న

  రూ.640000 కోసం 11వ ప్రశ్న

  11. మెఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ పుట్టిన ప్రదేశం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది?
  a) కజకిస్తాన్
  b) ఉజ్బెకిస్తాన్
  c) ఇరాన్
  d) అఫ్గానిస్తాన్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఫ్రెండ్ అనే ఆప్షన్‌ను ఎంచుకొన్నాడు. తన స్నేహితుడికి కాల్ చేస్తే.. సమాధానం చెప్పడంలో తడబడ్డాడు. దాంతో సమయం ముగిసిపోడంతో 50:50 ఆప్షన్‌ను ఎంచుకొన్నాడు. అయితే సమాధానం అఫ్గానిస్తాన్ అని చెప్పడంతో ఆ జవాబు తప్పు కావడంతో గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. గేమ్ నుంచి 320000 రూపాయలతో వైదొలిగాడు.

  Answer: ఉజ్బెకిస్తాన్

  English summary
  NTR's EMK Show August 31th Episode: Manish Maryada of Hyderabad, has participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X