twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'Ntv'ప్రసారాల పై నిషేధం...హైకోర్టుకు కేసు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించామంటూ 'ఎన్‌ టీవీ'ఛానల్‌ ప్రసారాలను వారంరోజుల పాటు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుచేయాలంటూ టీవీ యాజమాన్యం మంగళవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    సంబంధిత ఉత్తర్వులను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి వాటిని కొట్టివేయాలని అభ్యర్థిస్తూ.. రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ టి.రమాదేవి తన వ్యాజ్యంలో కోరారు. 2012లో ఫిబ్రవరి నుంచి మే వరకు ఎన్‌టీవీలో మధ్యరాత్రి 'సిని కలర్స్‌' పేరుతో ప్రసారం అయిన పాటల్లో అశ్లీలత చోటుచేసుకుంటోందంటూ ఓ వ్యక్తి సమర్పించిన ఫిర్యాదు అధారంగా తమకు 2014 ఆగస్టు 7న సంబంధిత మంత్రిత్వశాఖ షోకాజ్‌ నోటీసు జారీచేసిందన్నారు.

    ఆ ఆరోపణలను ఖండిస్తూ ఆదే నెల్లో వివరణ ఇచ్చామని, వ్యక్తిగతంగానూ హాజరై వివరించామని పేర్కొన్నారు. తమ వాదనలను పట్టించుకోకుండా టీవీ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిషేధిస్తూ ఈనెల 19న ఆదేశాలు జారీచేసిందన్నారు. 2012లోనే ఈ కార్యక్రమాన్ని నిలుపు చేశామన్నారు.

    Ntv case goes to High Court

    పూర్తి వివరాల్లోకి వెళితే..

    తమ చానల్ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌టీవీ) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

    కేంద్ర ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆ సంస్థ డెరైక్టర్ టి.రమాదేవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు.

    గతంలో ఎన్‌టీవీలో రాత్రి 11.30 గంటలకు సినీకలర్స్ పేరుతో ప్రసారమయ్యే కార్యక్రమంలోని పాటల్లో అసభ్యత, అశ్లీలత ఉంటోందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ కార్యక్రమ డీవీడీలను పరిశీలించింది. అందులో అశ్లీలత, అసభ్యత ఉంటోందని, వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ కార్యక్రమం లేదని తేల్చింది.

    ఇది కేబుల్ టీవీ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఎన్‌టీవీ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి వారం రోజుల పాటు నిషేధిస్తున్నట్లు ఆ శాఖ డెరైక్టర్ నీతి సర్కార్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2012, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంపై కేంద్రానికి రాతపూర్వకంగా వివరణ ఇచ్చామని పిటిషన్‌లో ఎన్‌టీవీ డెరైక్టర్ పేర్కొన్నారు.

    ఆ కార్యక్రమాన్ని 2012లోనే నిలిపేశామని, దానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సరికాదన్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, నిషేధం విధించే అధికారం డెరైక్టర్‌కు లేదని,నిషేధం ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆమె కోర్టును అభ్యర్థించారు.

    English summary
    Rachana Television (NTV) filed a petition at High Court Hyderabad. The Information and Broadcasting Ministry has directed NTV, a Telugu news channel, to keep off air for seven days for allegedly airing obscene contents. The offensive visuals were shown in a song-based programme on films in 2012. The ministry, in an order issued on Monday, asked the channel to shut down its operations from February 3 to 10, and submit a compliance report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X