కౌశల్ అంత సేపు ఉండి ఏం పీకాడు.. దీప్తితో గొడవ, అడ్డంగా బుక్కైన కౌశల్, నా బ్రతుకేంటి ఇలా!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్2 లో కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని ఎలిమినేషన్స్ ఉత్కంఠ పెంచుతుంటే, ఎలిమినేట్ అయిన వారిని మళ్ళీ హౌస్ లోకి పంపుతున్నారు. శ్యామల, నూతన్ నాయుడు తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా డబుల్ నామినేషన్ ఉండే అవకాశం ఉందంటూ నాని చెప్పిన విషయం ఆసక్తి రేపుతోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.

ఊహించని విధంగా
నామినేషన్ ప్రక్రియని ఇంటి సభ్యుల ప్రవర్తన, ఆడియన్స్ రెస్పాన్స్ ఆధారంగా ఉంటుంది. కానీ ఈ వారం బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. నామినేషన్ కోసం నంబర్ గేమ్ పెట్టారు. ఎప్పటిలా టాస్క్ కాకుండా నంబర్ గేమ్ ఆధారంగా నామినేషన్ జరిగింది.

తమ స్థాయి ఏంటి
బిగ్ బాస్ ఆదేశిస్తూ.. సభ్యులంతా ఇంటిలోని సభ్యులంతా ఇంటిలో వారి స్థానం వారే నిర్ణయించుకుని బయట గార్డెన్ లో ఉన్న నంబర్స్ ఎదురుగా నిలబడాలి. ఆ నంబర్ వద్దే ఎందుకు నిలబడుతున్నారో ఇతర ఇంటి సభ్యులతో చర్చించవచ్చు అని ఆదేశించారు. ఇది నామినేషన్ కోసం అనే సంగతి ఇంటి సభ్యులకు తెలియదు.

వరుసగా
నెంబర్ 1 స్థానంలో తనీష్, 2 వద్ద రోల్ రైడ, 3 వద్ద కౌశల్, దీప్తి, 4 వద్ద సామ్రాట్, 5 వద్ద అమిత్, 6 వద్ద సునైనా, 7 వస్థానంలో బాబు, 8 వద్ద గణేష్, 9 వద్ద నందిని, 10 ఖాళీ, 11 గీత, 12 వస్థానంలో పూజ నిలుచున్నారు.

దీప్తి, కౌశల్ గొడవ
3 వస్థానం కోసం కౌశల్, దీప్తి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటిలో తన స్థానం 3 అని బలంగా నమ్ముతున్నా. మీతో కత్తి పట్టుకుని యుద్ధం చేయలేను. మిగిలిన వారంతా ఏస్దానాల్లో ఉన్నారనే విషయం అనవసరం అని దీప్తి కౌశల్ తో వాదించింది. చివరకు ఇద్దరూ అదే స్థానం వద్ద నిలుచున్నారు.

వాళ్ళు సేఫ్
వరుస క్రమంలో ఇంటి సభ్యులు నిలుచున్న తరువాత బిగ్ బాస్ ప్రకటన ప్రారంభం అయింది. మొదటి ఆరు స్థానాల్లో నిలుచున్న వారు ఈ వారం నామినేషన్ నుంచి సురక్షితులయ్యారు. చివరి ఆరు స్థానాల్లో నిలుచున్నవారు నామినేట్ అయ్యారు అని బిగ్ బాస్ ప్రకటించారు.

అక్కడే ట్విస్ట్
నామినేషన్ ప్రక్రియలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.బిగ్ బాస్ మరో ప్రకటన చేశారు. గీత ఇంటి కెప్టెన్ అయిన కారణంగా ఆమె నామినేషన్ నుంచి రక్షించబడింది. పూజ కొత్తగా వచ్చిన కారణంగా ఆమె కూడా రక్షించబడింది. ఇక కౌశల్, దీప్తి ఇద్దరూ ఒకే స్థానం వద్ద నుంచుని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కావట్టి వారిద్దరూ నామినేట్ అయ్యారు.

ఈ వారం నామినేషన్
మొత్తంగా ఈ వారం కౌశల్, దీప్తి, బాబు, నందిని, గణేష్ నామినేట్ అయ్యారు. దాదాపుగా గత వారం నామినేట్ అయిన వారే ఈ వారం కూడా నామినేట్ కావడం విశేషం.

నా బతుకేంటి ఇలా
తాను తొలి వారం నుంచి నామినేట్ అవుతూనే ఉన్నానని, నా బతుకేంటి అని గణేష్ వాపోయాడు. గణేష్ అలా అనగానే బాబు గోగినేని పగలబడి నవ్వారు. అలా అంటుంటే నవ్వొస్తోంది గణేష్ సారీ అని గీత సముదాయించింది.

వాడిని కూడా
నందిని దీప్తితో మాట్లాడుతూ.. నువ్వు బుక్కయ్యావు, వాడిని కూడా బుక్ చేశావ్.. నువ్వు సూపర్ అంటూ నందిని వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ వ్యవహారంలో అంతా కౌశల్ ని ఏకాకిని చేశారనే వాదన వినిపిస్తోంది.

ఏం పీకాడు
కౌశల్ అంతసేపు అక్కడ నుంచిని ఏం పీకాడు అని గీత బాబుతో మాట్లాడింది. నేను కౌశల్ వివాదంలో ఉన్నాను కాబట్టి నవ్వితే బాగోదు అంటూ బాబు బదులిచ్చారు.


Click it and Unblock the Notifications











