twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ షోలో కీలక ఘట్టం: టాప్ ప్లేస్‌లో ఆ కంటెస్టెంట్.. అభిజీత్‌కు ఘోర అవమానం!

    |

    తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు నమోదైన రేటింగ్, బద్దలైన రికార్డులే ఇందుకు నిదర్శనం. అన్నింటికీ మించి మూడు సీజన్లు సూపర్ హిట్ అవడం వల్లే నాలుగోది కూడా మొదలైంది. కొద్ది రోజులుగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ కూడా మంచి స్పందనతో సాగుతోంది. ఈ నేపథ్యంలో షోపై మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా షోలో ఓ కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఇందులో అభిజీత్‌కు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

    రేస్ టు ఫినాల్ టాస్క్‌తో ఊపు

    రేస్ టు ఫినాల్ టాస్క్‌తో ఊపు

    బిగ్ బాస్ షో తుది దశకు చేరుకోవడంతో నిర్వహకులు సరికొత్త టాస్కులను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వారం ‘రేస్ టు ఫినాలే' అనే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు రౌండ్లలో సాగే ఈ టాస్క్‌లో గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫినాలేకు చేరుకుంటాడు. అయితే, సదరు ఇంటి సభ్యుడు ఒకవేళ నామినేషన్స్‌లో ఉంటే అది తప్పించుకోవాల్సి ఉంటుంది.

    విజేతగా నిలిచిన అఖిల్ సార్థక్

    విజేతగా నిలిచిన అఖిల్ సార్థక్

    ‘రేస్ టు ఫినాలే' మొదటి రౌండ్‌‌లో అవినాష్, ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రౌండ్‌లో దేత్తడి హారిక, అభిజీత్ నిష్క్రమించారు. దీంతో తుది పోరు అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మధ్య జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టాస్కులో అఖిల్ గెలిచినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అతడు ‘రేస్ టు ఫినాలే' మెడల్ సొంతం చేసుకున్నాడట.

    బిగ్ బాస్ షోలో నెంబర్ గేమ్

    బిగ్ బాస్ షోలో నెంబర్ గేమ్

    ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్‌లో నెంబర్ గేమ్‌ను నిర్వహించినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫినాలేకు అర్హత సాధించిన కారణంగా ఈ టాస్కులో అఖిల్ సార్థక్ పాల్గొనలేదని సమాచారం.

    టాప్ ప్లేస్‌లో ఆ కంటెస్టెంట్‌‌నే

    టాప్ ప్లేస్‌లో ఆ కంటెస్టెంట్‌‌నే

    ప్రతి టాస్కులో వందకు వంద శాతం శ్రమిస్తూ మంచి ఫైటర్‌గా పేరు తెచ్చుకున్న సోహెల్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. గతంలో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చిన సమయంలోనూ అతడినే టాప్ -5లో చేర్చారందరూ. అలాగే, రేస్‌ టు ఫినాలే టాస్కులోనూ సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు సోహెల్ ఆ ప్లేస్‌లో నిల్చునట్లు సమాచారం.

    అభిజీత్‌కు ఘోర అవమానం

    అభిజీత్‌కు ఘోర అవమానం

    సోహెల్ తర్వాత ప్లేస్‌లో ఆరియానా గ్లోరీ నిల్చుందట. ఇక, మూడు నాలుగు స్థానాల్లో దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్ నిలిచారని సమాచారం. ఐదో స్థానంలో అవినాష్ ఉండగా, చిట్ట చివరన అభిజీత్ ఉన్నట్లు తెలిసింది. బయట భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతడికి.. చివరి స్థానం దక్కడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నెంబర్ల విషయంలో పలు గొడవలు జరిగినట్లు టాక్.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
    అభినీ అలా శిక్షించిన బాస్

    అభినీ అలా శిక్షించిన బాస్

    నెంబర్ గేమ్‌లో చివరి స్థానంలో ఉన్న అభిజీత్‌ను బిగ్ బాస్ శిక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అతడిని హౌస్‌లో ఉన్న జైలుకు పంపారని సమాచారం. ఈ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగబోతుందని తెలిసింది. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి అభిజీత్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బిగ్ బాస్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

    English summary
    Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X