Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్బాస్ 2: లక్షలు ఇస్తున్నారు... సీక్రెట్ చెప్పిన నూతన్, తేజుపై విమర్శలు!
బిగ్బాస్ 2 తెలుగు రియాల్టీ షో నుండి ఎలిమినేట్ అయిన వారిలో ఒకరికి మళ్లీ ఇంట్లోకి వెళ్లే అవకాశం బిగ్బాస్ కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వేస్తారో వారికే ఈ అవకాశం దక్కనుంది. బిగ్బాస్ ఇంటి నుండి రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు మళ్లీ ఇంట్లోకి ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ను ఇంప్రెస్ చేస్తున్నాడు. తాజాగా తన అభిమానులతో లైవ్ నిర్వహించిన నూతన్ నాయుడు.... పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో పాటు బిగ్బాస్ షోకు సంబంధించిన కొన్ని సీక్రెట్లు సైతం బయట పెట్టారు.
సెలబ్రిటీలకు డబ్బులిస్తున్నారు
బిగ్బాస్ షోలో పాల్గొన్నందుకు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కామన్ మ్యాన్ అవ్వడం వల్ల డబ్బులు ఇవ్వడం లేదు. సెలబ్రిటీలకు ఇస్తున్నట్లు తెలిసింది. వారికి రూ. 1 లక్ష, రూ. 1.50 లక్షలు, రూ. 1.70 లక్షలు వారానికి చెల్లిస్తున్నారు. నాలుగు వారాలకు నాలుగు లక్షల నుండి నాలుగున్నర లక్షలు ఇస్తున్నారని తెలిసిందని నూతన్ నాయుడు తెలిపారు.
మాకు ఇస్తారో లేదో తెలియదు
మొత్తం 29 పేజీల అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం బ్యాంకుల్లో డబ్బులు వేస్తుంటారు. వారం రోజులు జరుగుతున్న ప్రొగ్రాంకు ఒక వారం ముందుగానే వారికి డబ్బుబు పడిపోతాయి. సెలబ్రిటీలందరికీ డబ్బులు ఇస్తున్నారు. కామన్ మ్యాన్ అయిన నాకు ఇప్పటి వరకైతే ఇవ్వలేదు, అలా అని వారు ఇవ్వమని చెప్పలేదు... ఇప్పటి వరకైతే నాకు డబ్బులు రాలేదని నూతన్ తెలిపారు.
నాకు అలాంటివి చేతకాదు
బిగ్బాస్లో అందరూ ఆట ఆడటానికే వెళతాం. నేనైనా, తేజు అయినా గెలవడానికే ఆడాము. కానీ ఆటలో నిజాయితీ ఉందా? లేదా? అనేది మొదటి ప్రశ్న. గ్రూపులు కట్టడం, వెనక మాట్లాడటం నాకు రాదు. దాని వల్ల ఆటలో ముందుకెళ్లినా లైఫ్ లో వెనక్కి వెళ్లిపోతాం.
తేజును వ్యక్తిగతంగా విమర్శించడం లేదు
తేజును నేను వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు. కానీ తేజు ఆడిన విధానం, తీసుకున్న స్టాండ్ అంతా కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. ప్రతీ దాన్ని గ్రూప్ అనే కళ్లద్దాలతో చూసి నిర్ణయించడం వల్ల మనం వాస్తవాలకు దూరంగా వెళ్లిపోతుంటాం. నో డౌట్ షి ఈజ్ బ్రిలియంట్, వెరీ బబ్లీ, వినోదం పంచుతుంది, సేమ్ టైమ్ అంతా గ్రూపులుగా విడిపోవడానికి, నెగిటివిటీ స్థాయిలో పెరిగిపోవడానికి తను కొంత కారణమేమో అని నాకు అనిపిస్తుందని నూతన్ తెలిపారు.
అది ప్రభావితం చేసే స్థాయిలో ఉండటం తప్పు
ఇపుడు పోటీ వాతావణం ఉంది కాబట్టి నేను నన్ను విభిన్నంగా ప్రజంట్ చేసుకుంటాను. నేను వారికంటే ఎలా యూనిక్ గా ఉంటాను అనేది నిరూపించుకుంటాను. ఒకరిని అభిమానించడం, ప్రేమించడం వారి వ్యక్తిగతం. దాంట్లో తప్పుబట్టేది కూడా లేదు. ఆ అభిమానం ఇంటి వాతావరణం ప్రభావితం చేసే స్థాయిలో ఉండటం తప్పు.
అదిపోతే అన్నీ పోయినట్లే
మన అభిమానం అవతలి వారి ఆటను పక్కదారి పట్టించకూడదు. పక్కదారి పట్టించే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. తప్పులు అందరూ చేస్తారు. మరిచిపోవడం మానవతత్వం, క్షమించడం దైవత్వం. మరిచిపోవడం నాకు తెలియదు. చేసిన తప్పులు పదే పదే చేస్తే ఆటలో అయినా, లైఫ్ లో అయినా విశ్వసనీయత కోల్పోతాం. అది పోతే అన్నీ పోయినట్లే అని నూతన్ నాయుడు తెలిపారు.