ఇది కౌశల్ అంటే.. తెగించి నూతన్‌కు సాయం, కెప్టెన్‌ని ఎదిరించి మరీ!
Recommended Video

బిగ్ బాస్ షోలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో తిరుగులేదనుకున్న కౌశల్ గీత వలన ఈ సీజన్ మొత్తం నామినేషన్ కు గురయ్యాడు. ఈ పరిణామాన్ని ఆడియన్స్ ఊహించలేదు. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతోంది. టైటిల్ బరిలో నిలిచేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు జరగబోయే ఎపిసోడ్ మరింత ఉత్కంఠ భరితంగా సాగనుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజగా విడుదుల చేశారు.

కెప్టెన్సీ టాస్క్
ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్ గా దీప్తి కొనసాగుతోంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నిన్న ఎపిసోడ్ లో ప్రారంభమైంది. నేడు కూడా కొనసాగనుంది. కెప్టెన్సీ పోటీదారులుగా కౌశల్, నూతన్, రోల్ రైడ పాల్గొంటున్నారు.

ఆపకుండా
కెప్టెన్సీ పోటీదారులు ముగ్గురూ ఆగకుండా గార్డెన్ ఏరియాలో ఉన్న సైకిల్స్ తొక్కుతూనే ఉండాలి. చివరి వరకు ఎవరు తొక్కుతుంటే వాళ్లే కెప్టెన్సీ టాస్క్ విజేతలు. మిగిలిన వాళ్ళు వారికి నచ్చిన వ్యక్తులకు మద్దత్తు తెలపవచ్చు. నచ్చని వ్యక్తులని సైకిల్ నుంచి కిందికి దించడానికి ప్రయత్నించవచ్చు. కానీ వారిని కానీ, సైకిల్ ని కానీ ముట్టుకోకూడదు.

ఊహించని కష్టం
నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముగ్గురూ సైకిల్ తొక్కడం ప్రారంభించిన తరువాత నూతన్ నాయుడుకి ఊహించని కష్టం ఎదురైంది. నూతన్ కు కౌశల్ మద్దత్తుగా నిలిస్తున్నాడు. నూతన్ సైకిల్ తొక్కుతుండగా మధ్యలో చైన్ ఊడిపోయింది.

తెగించి మరీ
సైకిల్ చైన్ ఓడిపోతే సైకిల్ తొక్కడం కష్టం. బిగ్ బాస్ విధించిన నిబంధన ప్రకారం సైకిల్ నుంచి కిందకు దిగకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నూతన్ కు కౌశల్ అండగా నిలుస్తున్నాడు. చైనా ఊడిపోయినా పెడల్ తొక్కడం ఆపకు అని అతడికి చెప్పాడు. సైకిల్ ని ముట్టుకోకుండా చైన్ బిగించే ప్రయత్నం చేస్తున్నాడు.
కెప్టెన్‌ని ఎదిరించి
సైకిల్ చైన్ బిగించాలని కౌశల్ ప్రయత్నిస్తుండగా.. ముట్టుకోకు అంటూ దీప్తి అడ్డు చెప్పింది. నేను సైకిల్ ని ముట్టుకోకుండానే చైన్ బిగిస్తా అంటూ కౌశల్ ఆమెతో వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సైకిల్ ముట్టుకోకుండా చైన్ ఎలా బిగించాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











