శ్యామల లేదు, నూతన్ నాయుడు ఒక్కడే.. పార్సిల్ కట్టి మరీ, బిత్తరపోయిన గణేష్!
Recommended Video

బిగ్ బాస్ హౌస్ లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని మలుపులు ఆడియన్స్ కు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందనే ఊహాగానాలు బిగ్ బాస్ పై ఆసక్తిని మరింతగా పెంచేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్ లోకి వెళ్లనుండడమే. ఈ వారం నామినేట్ అయినవారిలో కౌశల్, దీప్తి, నందిని, బాబు, గణేష్ ఉన్నారు. ఎవరు ఎలిమినేటి అవుతారో ఆదివారం తేలనుంది. నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోని తాజగా విడుదల చేశారు.

ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కో గిఫ్ట్
ఇంటిలోని సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో గిఫ్ట్ వచ్చింది. ప్రోమోలో చూపిన దాని ప్రకారం హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం వారికీ వచ్చిన గిఫ్ట్స్ అందుకుంటున్నారు. గిఫ్ట్స్ చూసి వాళ్ళు షాక్ అవుతున్నారు.

బిత్తరపోయిన గణేష్
అందరికంటే చివరగా గణేష్ గిఫ్ట్ అందుకుంటాడు. అతడి గిఫ్ట్ సీక్రెట్ రూంలో ఉంటుంది. పెద్దగా ఉన్న పార్సిల్ చూసి గణేష్ ఆశ్చర్యపోతాడు. అందులో ఏముందని తెరచి చూడడగా నూతన నాయుడు బయటకు వస్తాడు. అనుకోకుండా జరిగిన ఘటనతో గణేష్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు.

నూతన్ నాయుడు రీఎంట్రీ
నూతన్ నాయుడు రీ ఎంట్రీతో హౌస్ లోని సభ్యుల్లో సంతోషం నెలకొంది. నూతన నాయుడు ఆరంభంలో రెండు వారలు హౌస్ లో ఉన్నారు. ఆ తరువాత ఆయన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

శ్యామల ఎక్కడ
కానీ ఈ ప్రోమోలో శ్యామల గురించి ప్రస్తావన లేదు. నూతన నాయుడుతో పాటు శ్యామల కూడా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎంపికైంది. కానీ నేడు నూతన్ నాయుడు మాత్రమే ఎంపిక ఎంట్రీ కావడంతో శ్యామల విషయం సస్పెన్స్ లోకి వెళ్ళింది.

మరింత హీట్
ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపల గీత, కౌశల్, బాబు వివాదంతో వాతావరణం వేడెక్కింది. ఇక నూతన్ నాయుడు కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత హీటెక్కనుంది. ఇటీవల అభిమానులతో నూతన్ నాయుడు మాట్లాడే సమయంలో మీరు నన్ను హౌస్ లోకి పంపించడండి నేను బాబు సంగతి చూస్తా అంటూ మాట్లాడాడు.

ఆరంభంలోనే
నూతన్ నాయుడులో యాంగ్రీ మాన్ ఉన్నాడు. షో ఆరంభంలోనే తనీష్, నూతన్ నాయుడు మధ్య పెద్ద వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై బిగ్ బాస్ 2 లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











