ఎవరీ అ‘సామాన్యుడు’ నూతన్ నాయుడు.. పవన్, కౌశల్, సంపూ ఫ్యాన్స్‌కు ఎందుకింత క్రేజ్

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Nutan Naidu Lifestyle Details

బిగ్‌బాస్‌లోకి రానంత వరకు నూతన్ నాయుడు ఎవరో సామాన్య ప్రజలకు తెలియదు. బిగ్‌బాస్‌లో ఉన్నన్నీ రోజులు సామాన్యుడిలానే కనిపించారు. ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత నూతన్‌లో మరో కోణం బయటపడింది. సోషల్, టెలివిజన్ మీడియాలో ఆవేశపూరిత ప్రసంగాలతో దుమ్మురేపేశాడు. ఇలా దూసుకెళ్తున్న తరుణంలోనే మరోసారి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించే అవకాశం లభించింది. అందివచ్చిన ఛాన్స్‌తో మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి నూతన ఉత్సాహంతో దూసుకెళ్లారు. ఇలా మళ్లీ సంచలనం రేపిన నూతన్ నాయుడు ఎవరంటే..

విశేషంగా నెటిజన్ల స్పందన

విశేషంగా నెటిజన్ల స్పందన

బిగ్‌బాస్‌లోకి ఎలిమినేటెడ్ అభ్యర్థులకు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నామనే ప్రకటనతో నూతన్ పేరు మళ్లీ రంగంలోకి వచ్చింది. ఓట్లు వేయమని నూతన్ తనదైన శైలిలో ఆకర్షించి ఓట్లు అడిగాడు. దాంతో నెటిజన్లు విశేషంగా స్పందించారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అండగా

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అండగా

ప్రధానంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నూతన్ నాయుడికి అండగా నిలిచారు. భారీ ఎత్తున ఆయనకు మద్దతుల పలికారు. దాంతో నూతన్‌కు రికార్డు స్థాయిలో ఆ వర్గం నుంచి ఓట్లు పోలయ్యాయనే మాట వినిపిస్తున్నది. మళ్లీ బిగ్‌బాస్‌లో తన సత్తా చూపించేందుకు సిద్దమయ్యాడు.

కౌశల్ ఆర్మీ సపోర్ట్

కౌశల్ ఆర్మీ సపోర్ట్

బిగ్‌బాస్2 ప్రారంభమైనప్పటి నుంచి కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతివ్వడమే కాకుండా ఇతర సెలబ్రిటీలకు అండగా నిలిచారు. ఇంట్లో కౌశల్‌కు అనుకూలంగా ఉంటే వారికి కూడా ఓట్లు వేస్తూ తమ ప్రభావం చూపిస్తున్నారు.

సంపూ సంపూర్ణ సపోర్ట్

సంపూ సంపూర్ణ సపోర్ట్

బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆరుగురిలో ఒకరికి మళ్లీ ఛాన్స్ అనే వార్త రాగానే నూతన్ నాయుడికి మద్దతుగా సంపూర్ణేష్ బాబు నిలిచాడు. నూతన్‌కు ఓట్లు వేయాలని బహిరంగంగా తన అభిమానులకు సంపూ పిలిపునిచ్చాడు. అందుకే రీఎంట్రీ సందర్భంగా సంపూ పేరును వేదికపై స్మరించుకొన్నాడు.

విశాఖలో జన్మించి హైదరాబాద్‌లో

విశాఖలో జన్మించి హైదరాబాద్‌లో

ఇంతకీ ఇలా అందరి మనసులను ఆకర్షించిన నూతన్ నాయుడు విశాఖపట్నంకు చెందిన కాపు వర్గీయుడు. కాకపోతే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. విద్యాధికుడే కాకుండా మంచి వక్త కూడా. ఎంఫిల్‌లో పట్టబద్రుడు. ఉత్తేజకర ప్రసంగాలతో ప్రజలకు, యువతకు స్ఫూర్తి నింపడంలో మంచి పేరు ఉంది.

సామాజిక కార్యకర్తగా

సామాజిక కార్యకర్తగా

గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. సామాజిక కార్యకర్తగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అనేక సామాజిక అంశాలపై సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ హైదరాబాద్, విజయవాడలో సేవలందిస్తున్నారు.

బర్నింగ్‌స్టార్‌గా కనిపిస్తా

బర్నింగ్‌స్టార్‌గా కనిపిస్తా

బిగ్‌బాస్‌లో ప్రవేశించిన తర్వాత నానితో మాట్లాడుతూ.. సంపూర్ణేష్ బాబులా సంపూర్ణంగా నా టాలెంట్‌ను ప్రదర్శిస్తాను. ఇంట్లో బర్నింగ్‌స్టార్‌గా ఉంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాను. ఈసారి తనలో గానీ.. ఇంట్లో గానీ కొత్త నూతన్ నాయుడిని చూడబోతున్నారనే సంకేతాలను అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X