నూతన్ నాయుడు జాక్‌పాట్.. పవన్ అండతో బిగ్‌బాస్‌లోకి.. గబ్బర్‌సింగ్‌లా ఎంట్రీ!.. గోగినేని సంగతి చూస్తా
అందరి అంచనాలు తగినట్టే నూతన్ నాయుడు జాక్‌పాట్ కొట్టారా? అంటే అవుననే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆరంభంలోనే ఎలిమినేట్ అయిన నూతన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త పలువురు ధృవీకరించడమే కాకుండా స్వయంగా నూతన్ ఆ దిశగా సోషల్ మీడియాలో సిగ్నల్స్ ఇస్తున్నారు. నూతన్ నాయుడు రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన అంశాలు ఇవే..
Recommended Video


ఓటింగ్ పూర్తయిన తర్వాత
బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎలిమినేట్ అయిన సెలబ్రిటీలను తిరిగి మళ్లీ వెనకకు రప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఓటింగ్ నిర్వహించారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ పూర్తయింది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నూతన్ నాయుడు జోష్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నది.

లైవ్‌లో నూతన్ నాయుడు జోష్
శనివారం ఉదయం నుంచే నూతన్ నాయుడు నెటిజన్లతో తన లైవ్‌లో మాట్లాడుతూ జోష్‌లో కనిపించాడు. పలు దశల్లో నూతన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యాడు. పవన్ ఫ్యాన్స్, కౌశల్ ఆర్మీకి థ్యాంక్స్ చెప్పారు.

బాబు సంగతి చూస్తా
ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చిన నూతన్ నాయుడు మాట్లాడుతుండగా.. బిగ్‌బాస్ హౌస్‌లో బాబు గోగినేని నరకం చూపిస్తున్నాడన్నా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. కాస్తా ఆగు ఆయన సంగతి చూపిస్తా అనే విధంగా సమాధానం ఇచ్చాడు. మరో వ్యక్తి బిగ్‌బాస్ షూట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయట కదా అన్నా అంటే మీకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి అని నూతన్ వ్యాఖ్యానించాడు.

పవన్ ఫ్యాన్స్ అండ
నూతన్ నాయుడిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించడానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపినట్టు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అందుకు తగినట్టే పవన్ పేరును నూతన్ నాయుడు స్మరించడం చర్చనీయాంశమైంది.

కౌశల్ ఆర్మీ సపోర్ట్
అలాగే బిగ్‌బాస్‌లో ఒంటరి వాడైన కౌశల్‌కు అండగా నిలిచేందుకు నూతన్ సిద్ధమని ప్రకటించాడు. అలాగే నూతన్‌కు కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు తెలిపి ఇంట్లోకి వెళ్లడానికి ఆయన ఓట్లు భారీ ఎత్తున వేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

నూతన్ సోషల్ మీడియా టీమ్
ఇది ఇలా ఉండగా, నూతన్ నాయుడు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసి తనకు ఓట్లు వచ్చే విధంగా ప్లాన్ చేశాడన్నది మరో ప్రచారం జరుగుతున్నది. అలాగే రూ.40 లక్షలు కూడా ఈ మేరకు ఖర్చు చేసినట్టు ఓ వార్త కూడా బయటకు వచ్చింది. ఏదిఏమైనా నూతన్ నాయుడు ఒకవేళ బిగ్‌బాస్ ఇంట్లోకి నిజంగానే వెళితే ఆయన ప్లానింగ్ పక్కాగా పనిచేసినట్టే..


Click it and Unblock the Notifications











