twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నూతన్‌కు తీవ్రగాయం.. అనూహ్యంగా బిగ్‌బాస్ నుంచి నిష్క్రమణ... కౌశల్, దీప్తి కంటతడి!

    By Rajababu
    |

    Recommended Video

    Bigg Boss Season 2 Telugu: 67 Day Highlights

    బిగ్‌బాస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. ఇంట్లో తనదైన శైలిలో రాణిస్తున్న సభ్యుడు నూతన్ నాయుడు అనూహ్యంగా, అర్ధాంతరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా గాయపడిన నూతన్‌ను మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఇంట్లో నూతన్ నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో గాయానికి గురయ్యాడంటే..

    68 రోజు నూతన్ ఉత్తేజంగా

    68 రోజు నూతన్ ఉత్తేజంగా

    బిగ్‌బాస్ ఇంట్లో 68 రోజును ఇంటి సభ్యులు హుషారుగా ప్రారంభించారు. నూతన్ నాయుడు కూడా ఉత్తేజంగా కనిపించాడు. ఉదయం వచ్చే పాటకు చక్కగా డ్యాన్స్ చేశాడు. గీత వేసిన సైటైర్‌కు తనదైన శైలిలో స్పందించారు.

    కెప్టెన్ టాస్క్‌లో కౌశల్, రోల్ రైడా

    కెప్టెన్ టాస్క్‌లో కౌశల్, రోల్ రైడా

    ఇంట్లో మధ్యాహ్నం కెప్టెన్ టాస్క్ మొదలైంది. కెప్టెన్ షిప్ కోసం కౌశల్‌, రోల్ రైడా పోటీ పడ్డారు. కొన్ని బ్లాక్స్‌ను ఇచ్చి పిరమిడ్ నిర్మించాలని టాస్క్‌గా నిర్దేశించారు. పడగొట్టు.. నిలబెట్టు అని పేరు పెట్టారు. రోల్ రైడాకు ఎర్రటి బ్లాకులు, కౌశల్‌కు గ్రీన్ బ్లాకులు ఇచ్చారు. వాటిని ఇంటి సభ్యులు బంతిని విసిరి పడగొట్టేందుకు ప్రయత్నిస్తే వాటిని పోటీదారులు కాపాడుకోవాల్సి ఉంటుంది.

    కౌశల్‌కు వ్యతిరేకంగా

    కౌశల్‌కు వ్యతిరేకంగా

    కెప్టెన్ టాస్క్‌లో కౌశల్‌కు వ్యతిరేకంగా తనీష్, అమిత్, గణేష్, ఇంకా కొంత మంది బాల్స్‌తో కొట్టారు. తాను నిర్మించుకొన్న పిరమిడ్‌ను కాపాడుకొనేందుకు కౌశల్ ప్రయత్నించారు. రోల్ రైడాకు పెద్దగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదు. ఎందుకంటే దీప్తి, శ్యామల, గీతా మాధురి బలంగా కొట్టి రోల్ రైడా పిరమిడ్‌ను పడేయలేకపోయారు.

    కెప్టెన్‌గా రోల్ రైడా

    కెప్టెన్‌గా రోల్ రైడా

    కెప్టెన్ టాస్క్ పడగొట్టు.. నిలబెట్టు‌లో అత్యధికంగా రోల్ రైడా 74, కౌశల్ 69 బ్లాక్స్‌తో పిరమిడ్ నిర్మించారు. టాస్క్ పూర్తయినట్టు బెల్ మోగగానే పూజా వాటిని లెక్కించింది. అత్యధికంగా బ్లాక్స్ రోల్ రైడాకు ఉండటంతో అతడి పేరును పూజా బిగ్‌బాస్‌కు తెలిపింది. దాంతో తనీష్ నుంచి రోల్ రైడాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.

    నూతన్‌కు భుజంలో తీవ్రగాయం

    నూతన్‌కు భుజంలో తీవ్రగాయం

    పడగొట్టు.. నిలబెట్టు టాస్క్ కొన్ని గంటలపాటు జరిగింది. ఈ టాస్క్‌కు పూజా రామచంద్రన్ సంచాలకులుగా వ్యవహరించారు. కౌశల్‌కు మద్దతుగా నూతన్ నాయుడు నిలిచారు. రోల్ రైడా నిర్మించిన పిరమిడ్‌ను కొటేందుకు ప్రయత్నించగా భుజంలోని ఎముకు డిస్ లొకేట్ (స్థాన భ్రంశం) జరిగింది. దాంతో ఆయనను కన్ఫెషన్ రూమ్‌లోకి పంపిచారు.

    మెరుగైన చికిత్స కోసం

    మెరుగైన చికిత్స కోసం

    నూతన్‌ గాయం తీవ్రం కావడంతో ప్రాథమిక చికిత్సను అందించారు. నూతన్ పరిస్థితి క్రిటికల్ కావడంతో వైద్యులు హాస్పిటల్‌కు తరలించాలని సూచించారు. కన్ఫెషన్ రూంలో ప్రాథమిక చికిత్స పొందుతున్న నూతన్ నాయుడితో బిగ్‌బాస్ మాట్లాడాడు. నీకు క్రిటికల్ షోల్డర్ డిస్ లొకేషన్ జరిగింది. కావున మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. దాంతో నూతన్ నాయుడికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

    కన్ఫెషన్ రూమ్‌కి కౌశల్

    కన్ఫెషన్ రూమ్‌కి కౌశల్

    కౌశల్‌ను కన్ఫెషన్ రూమ్‌కు బిగ్‌బాస్ పిలిపించారు. తన భుజానికి తీవ్ర గాయమైంది. తనను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారని నూతన్ తెలిపాడు. దాంతో కౌశల్ ఒక్కసారిగా షాక్ గురి అయ్యాడు. నూతన్ నాయుడిని ఇంటి నుంచి పంపిస్తున్నారని చెప్పగానే కౌశల్ కుప్పకూలిపోయాడు.

    విషాదంలో ఇంటి సభ్యులు

    విషాదంలో ఇంటి సభ్యులు

    నూతన్ నాయుడిని ఇంటి నుంచి పంపిస్తున్నారని చెప్పగానే కౌశల్ కుప్పకూలిపోయాడు. కన్ఫెషన్ రూమ్‌లో నుంచి హాలులోకి రాగానే ఇంటి సభ్యులు చుట్టుముట్టారు. నూతన్ నాయుడు ఇంటి నిష్క్రమిస్తున్నాడు అని చెప్పగానే ఇంటి సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు.

    కౌశల్, దీప్తి నల్లమోతు కంటతడి

    కౌశల్, దీప్తి నల్లమోతు కంటతడి

    కెప్టెన్ టాస్క్‌లో తన కోసం శ్రమిస్తూ తీవ్ర గాయానికి గురైన నూతన్ నాయుడు పరిస్థితిని తలుచుకొని కౌశల్ కంటతడి పెట్టారు. దీప్తి నల్లమోతు కూడా దు:ఖంలో మునిగిపోయింది. ఇంట్లో అందరూ చాలా బాధలో మునిగిపోవడంతో ఇళ్లంతా నిశబ్దంగా మారింది.

    English summary
    Bigg Boss 2 Telugu 67 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. On 61th day, a interesting task was assigned to Bigg Boss contestent. On 68th day, Nutan Naidu seriously injured in big boss captain task.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X