నూతన్ నాయుడు హ్యాట్రిక్.. మరోసారి బిగ్‌బాస్‌లోకి.. చరిత్ర సృష్టించిన కామన్ మ్యాన్!
బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ నూతన్ నాయుడు మరోసారి ప్రవేశించాడు. బిగ్‌బాస్ తెలుగు షోలోకి ఇది నూతన్ ప్రవేశించడం మూడోసారి. కెప్టెన్సీ టాస్క్ ముగియగానే నూతన్ నాయుడు కన్ఫెషన్ రూమ్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఆదేశాల మేరకు నూతన్ నాయుడు ఇంట్లోకి వెళ్లి సభ్యులకు షాకిచ్చారు. రెండు వారాల క్రితం ఓ టాస్క్ ఆడుతుండగా నూతన్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే..

చికిత్స తర్వాత నూతన్ నాయుడు
క్రిటికల్ షోల్డర్ (భుజం) రిప్లేస్ కావడంతో నూతన్ నాయుడిని బిగ్‌బాస్ అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించాడు. ఆ తర్వాత ఆయన భుజానికి చికిత్స, ఫిజియోథెరపీ అందించారు. ఆతర్వాత కోలుకొన్న నూతన్ ఇంట్లోకి ప్రవేశించాడు.

నూతన్ నాయుడు ఇంట్లోకి వెళ్లగానే
కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ భోజనం చేస్తున్నారు. అప్పుడే ఇంట్లోకి నూతన్ నాయుడు ప్రవేశించాడు. అతడిని చూడగానే అందరూ పరుగెత్తుకొచ్చి కౌగిలించుకొని యోగ క్షేమాలు అడిగారు.

బిగ్‌బాస్ షో చరిత్రలో
బిగ్‌బాస్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో మూడుసార్లు బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన ఘనత నూతన్ నాయుడికే దక్కిందని చెప్పవచ్చు. ఈ అరుదైన అవకాశం సొంతం చేసుకొనన నూతన్ ఇంట్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాల్సిందే.

తనీష్ అల్లాడి అసంతృప్తి
ఇక నూతన్ రాకపై ఇంటి సభ్యుడు తనీష్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. నామినేషన్‌లో ఉన్న నూతన్ ఎలిమినేషన్ ప్రక్రియలో లేడు. అపై మళ్లీ మరుసటి వారం నామినేషన్‌లో కూడా లేడు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడు అని తనీష్ గ్రూప్ మీటింగ్ పెట్టి చెప్పడం గమనార్హం.

నూతన్ నాయుడు వల్లే దీప్తి బయటకు
నూతన్ నాయుడు బయటకు పోవడం వల్ల దీప్తి సునైనాపై ప్రభావం పడింది అని తనీష్ అభిప్రాయపడ్డారు. దానికి ఇతర సభ్యులు వంత పాడటం కూడా జరిగింది. ఏకంగా నూతన్ నాయుడితోనే ఈ విషయంపై తనీష్ చర్చ జరిపాడు.


Click it and Unblock the Notifications











