బిగ్‌బాస్ 2: నూతన్ నాయుడు రీ ఎంట్రీ హాట్ టాపిక్, నిజమెంత?

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Nutan Naidu Re Entry

బిగ్‌బాస్ 2 నుండి నూతన్ నాయుడు రెండో వారమే ఎలిమినేట్ అయన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నూతన్ నాయుడు పేరు మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఆయన బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత? అనే విషయం తేలాల్సి ఉంది. బిగ్ బాస్ షో నిర్వాహకుల నుండి మాత్రం దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నూతన్

ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నూతన్

సామాన్యుడిగా బిగ్‌బాస్ హౌస్‌‌లోకి ప్రవేశించిన నూతన్ నాయుడు తనదైన యాటిట్యూడ్, ఆలోచనా విధానంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది నూతన్ నాయుడు ఎవరు? బ్యాగ్రౌండ్ ఏమిటి? అని ఆరా తీశాను. ఆయన గతంలో పీఆర్పీ తరుపున పోటీ చేశారని, పవన్ కళ్యాణ్ భక్తుడని ఇలా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 అందుకే రీ ఎంట్రీ అంటూ ప్రచారం

అందుకే రీ ఎంట్రీ అంటూ ప్రచారం

నూతన్ బయటకు వచ్చిన తర్వాత హౌస్‌లో నెగిటివిటీ బాగా పెరిగిపోయిందని, ఆయనలాంటి పాజిటివిటీ, హ్యుమానిటీ ఉన్న వ్యక్తి హౌస్‌లో ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారట...అందుకే ఆయన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఎప్పుడు ఏదైనా జరుగొచ్చు

ఎప్పుడు ఏదైనా జరుగొచ్చు

రెండు రోజుల క్రితం బిగ్ బాస్ ఇంట్లోకి హీరోయిన్ హెబ్బ పటేల్ ఎంట్రీ ఇస్తోందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇపుడు నూతన్ నాయుడు పేరు తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ చెప్పినట్లు ఎప్పుడు ఏదైనా జరుగొచ్చు. జనాల ఊహకు అందని విధానాలు, నిర్ణయాలతో బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ సాగుతోంది.

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

ఈ వారం ఎలిమినేషన్ లిస్టులు భానుశ్రీ, దీప్తి నల్లమోతు, గణేష్ ఉన్నారు. వీరిలో ఎవరు షో నుండి బయటకు వెళతారు అనేది రేపు ఆదివారం క్లారిటీ రానుంది. సామాన్యుడుగా ఉన్న గణేష్‌ను ప్రక్షకులు తమ ఓట్ల ద్వారా బయటకు పంపితే..... సామాన్యుడైన నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X