OG Box Office: పవన్ కళ్యాణ్ ఆల్‌టైం రికార్డ్.. 3 రోజుల్లోనే ఓజీ సరికొత్త చరిత్ర

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌.. పవన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. తాము పవర్‌స్టార్‌ను ఎలా చూడాలని అనుకున్నామో సుజీత్ అలా చూపించాడంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే రికార్డుల్ని బ్రేక్ చేస్తోన్న ఓజీ.. ప్రీమియర్స్ నుంచి నేటి వరకు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు ఈ వివరాల్లోకి వెళితే..

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఓజీని నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహించారు.

ఓజీ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

OG Box Office Collections Worldwide Pawan Kalyan movie officially enter Rs 200 crore club

ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

ఓజీ కలెక్షన్స్
ఓజీకి పెయిడ్ ప్రీమియర్స్‌తో 21 కోట్ల రూపాయలు, తొలి రోజు ఇండియా వైడ్‌గా 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు, మూడో రోజున 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే ఓజీ భారత్‌లో 130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఓజీ ఊచకోత కోస్తున్నాడు. అడ్వాన్స్ బుకింగ్‌, ప్రీమియర్ షోలతో హవా చూపించాడు పవన్ కళ్యాణ్.

నార్త్ అమెరికాలో మూడు రోజుల్లోనే 42 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలు + రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలిపి మరో 32 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఓజీకి 74 కోట్ల నుంచి 80 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మూవీ 200 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ వసూళ్లతో కలిపి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓజీ నిలిచింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పెయిడ్ ప్రీమియర్స్‌తో 22 కోట్ల రూపాయలు, తొలి రోజున 67 కోట్ల రూపాయలు, రెండో రోజున 19 కోట్ల రూపాయలు, మూడో రోజున 18 కోట్ల రూపాయలతో 126 కోట్ల రూపాయలు రాబట్టింది ఓజీ. ఏరియాల వారీగా వసూళ్లు చూస్తే.. కర్ణాటకలో 12.50 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 126 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.50 కోట్ల రూపాయలు, కేరళ + హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 4 కోట్ల రూపాయలు రాబట్టింది.

More from Filmibeat

Read more about: pawan kalyan og box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X