twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu OTT విషయంలో కీలక నిర్ణయం.. హోస్ట్‌గా నాగార్జున కాదు.. ఎవరంటే?

    |

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజయవంతంగా పూర్తయింది. అందరూ ఊహించిన విధంగా సన్నీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే రోజు త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 రాబోతున్నట్లు గా నాగార్జున ప్రకటించారు. అలాగే ఓటీటీలో కూడా బిగ్ బాస్ గురించి ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. దీంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో కి యాంకర్ ఓంకార్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

    బిగ్ బాస్ ఓటీటీ

    బిగ్ బాస్ ఓటీటీ

    సాధారణంగా ఓంకార్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు 2006 నుంచి తెలుగు టెలివిజన్ పరిశ్రమలో నిలదొక్కుకుని రకరకాల డాన్సు షోలు, రియాలిటీ షోలు నిర్వహిస్తూ కొన్ని సినిమాలకు సైతం దర్శకుడిగా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వ్యవహారాలు పూర్తిగా ఓంకార్ సొంత నిర్మాణ సంస్థ ఓఏకే ఎంటర్టైన్మెంట్స్ కి అందించిన ట్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది.

     నిర్వహణ బాధ్యతలు ఓంకార్ కి

    నిర్వహణ బాధ్యతలు ఓంకార్ కి

    నిజానికి బిగ్ బాస్ ఒరిజినల్ నిర్మాతలైన ఎండోమెల్ షాన్ ఇండియా సంస్థ పూర్తిగా నిర్వహణ బాధ్యతలు ఓంకార్ కి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఐదో సీజన్ ముగిసింది. తదుపరి ఆరో సీజన్ కూడా మరో రెండు నెలల్లోనే మొదలవుతుందని దానికి హోస్ట్గా కూడా నేనే వ్యవహరిస్తానని నాగార్జున ప్రకటించారు.

     కాస్త కలర్ మార్పులు చేసి

    కాస్త కలర్ మార్పులు చేసి

    ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా సీజన్ ఫైవ్ నిర్వహించిన చోటనే కాస్త కలర్ మార్పులు చేసి సీజన్ సిక్స్ కూడా నిర్వహించాలి అనేది నిర్వాహకుల యోచనగా చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే హిందీలో సైతం ఇప్పటికే విజయవంతంగా 15 సీజన్లు పూర్తి కాగా కొత్తగా ఓటీటీ బిగ్ బాస్ అనే ఒక ప్రయోగాన్ని చేశారు. అయితే ఈ ప్రయోగం సఫలం కాలేదు అనుకోండి అది వేరే విషయం.

     బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్

    బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్


    అయినా సరే ఎందుకో ఆ ప్రయోగాన్ని తెలుగులో కూడా చేయాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తక్కువ మంది కంటెస్టెంట్స్, తక్కువ ప్రైజ్ మనీ తో ఓటీటీలో 24 గంటల ప్రసారం చేసే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది రంగంలోకి దిగితే గానీ తెలియదు. దాదాపు బిగ్ బాస్ 6కి, బిగ్ బాస్ ఓటీటీకి పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చు అని భావిస్తున్న కారణంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తే ఈ ఓటీటీ వెర్షన్ కి మాత్రం ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.

     ఆయనే హోస్ట్ గా

    ఆయనే హోస్ట్ గా

    ఎందుకంటే ఓంకార్ ప్రొడక్షన్ నుంచి ఇప్పటివరకు వచ్చిన దాదాపు అన్ని ప్రోగ్రామ్స్ కి ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీ ఇప్పట్లో ప్రారంభం అవుతుందా? అంటే కష్టం అనే చెప్పవచ్చు. ఎందుకంటే రెండు నెలలలో మొదలు కావాలంటే ఇప్పటికే ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ పూర్తిగా కంటెస్టెంట్ లు కూడా ఫైనల్ చేయలేని పరిస్థితి నెలకొంది. సో బిగ్ బాస్ ఓటీటీకి ఒకవేళ ఓంకార్ హోస్ట్ గా వ్యవహరించినా సరే రెండు మూడు నెలల్లో దీనిని మొదలు పెట్టే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

    English summary
    Ohmkar to be host bigg boss telugu ott.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X