Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ మాటతో అందరూ చప్పట్లు కొట్టేశారు.. ముమైత్ ఖాన్ పరువుతీసేసిన ఓంకార్
ప్రస్తుతం బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఎన్నో వస్తోన్నాయి. ఒకదాన్ని మించి మరొకటి అనేలా కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో దూసుకుపోతోన్నాయి. ఇక లవ్ ట్రాకులు, పులిహోర బ్యాచ్‌లు, కాంట్రవర్సీ కామెంట్లతో షోలను బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఓంకార్ తన షోలను ముందుకు తీసుకెళ్లడంతో ప్రత్యేక శ్రద్ద పెడుతుంటాడు. ఆయన యాంకర్‌గా వచ్చిన షోలెన్నో సక్సెస్ అయ్యాయి.
డ్యాన్స్ ప్లస్ సైతం..
బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించిన డ్యాన్స్ ప్లస్ బాగానేక్లిక్ అయింది. మోనాల్ అందాలు, ముమైత్ ఖాన్, యానీ మాస్టర్ అతి.. బాబా భాస్కర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ల కామెంట్లు, గొడవలు ఇలా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంతో బాగానే రన్ అవుతోంది.
ఎంటర్టైన్మెంట్ అలా..
డ్యాన్స్ ప్లస్ షోలో బాబా భాస్కర్ ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్లో ఉంటోంది. మోనాల్ గ్లామర్‌ను, క్రేజ్‌ను బాగానే వాడుకుంటున్నారు. రఘు మాస్టర్, యశ్ మాస్టర్లతో మోనాల్ వేసే స్టెప్పులు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక యానీ మాస్టర్‌ను బాబా భాస్కర్ తెగ ఆడేసుకుంటాడు.
తాజాగా అలా..
అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ రౌండ్స్ జరుగుతున్నాయి. ఇందులో జడ్జ్లుఇచ్చిన జడ్జ్‌మెంట్‌పై ఓంకార్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ముమైత్ ఖాన్‌ను ఓంకార్ దారుణంగా అవమానించేశాడు.
ముమైత్ ఖాన్ నిర్ణయం..
తనకు నచ్చిన కంటెస్టెంట్లు తప్పులు చేసినా ప్లస్ పాయింట్ ఇచ్చింది.. అదే తప్పులు మిగతా వాళ్లు చేస్తే మాత్రం మైనస్ పాయింట్ ఇచ్చింది. ఇదే విషయాన్ని ఓంకార్ నిలదీశాడు. అందరి ముందు ముమైత్ ఖాన్‌ను కడిగిపాడేశాడు.
పరువుతీసేశాడు..
ముమైత్ ఖాన్ అంటూ మీ నిర్ణయం నాకు నచ్చలేదని ఓంకార్ చెప్పుకొచ్చాడు. ఎలిమినేషన్ సమయం.. ఒకరు తప్పు చేస్తే మైనస్.. ఇంకొకరు తప్పు చేస్తే పస్ల్ ఎలా ఇచ్చారు.. అంటే చిన్న పిల్లలు అడగలేరు అని అలా ఇచ్చారా? అని ముమైత్ ఖాన్‌ను నిలదీస్తుంటే.. అక్కడి వారంత చప్పట్లు కొట్టేశారు. మొత్తానికి ముమైత్ ఖాన్ మొహం మాడిపోయింది. అయితే పూర్తి ఎపిసోడ్లో మాత్రం వ్యవహారం మారిపోయి ఉంటుందని తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుందో చూడాలి.