ఎంత మంది వచ్చినా సరే ఆ చానెల్ పెద్ద కొడుకును నేనే!.. ఓంకార్ సెన్సేషనల్ కామెంట్స్
ప్రస్తుతం బుల్లితెర అంటే చిన్నచూపు చూసే కాలం పోయింది. వెండితెరకు ధీటుగా ఎదుగుతోంది. సీరియల్స్‌లో భారీదనాన్ని తీసుకొచ్చారు. ఎంతో క్వాలిటీతో కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో దుమ్ములేపుతున్నారు. ఈ సీరియల్స్ అన్నీ ఒకెత్తు అయితే ఓ చానెల్‌లో వచ్చే సీరియల్ ఆర్టిస్ట్‌లంరదరూ ఒకేచోట కలిస్తే అది పెద్ద పండుగలా ఉంటుంది. అలాంటి పండుగనే ఈ ఆదివారం జీ తెలుగు ప్రేక్షకులను అందించబోతోంది.

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్..
జీ తెలుగు చానెల్ ఆదివారం రోజు స్పెషల్ ప్రోగ్రాంను ప్లాన్ చేసింది. తమ చానెల్‌లోని సీరియల్స్‌కు అవార్డులు ఇవ్వడం, అందర్నీ ఒకే చోటకు తీసుకురావడం, ప్రత్యేకంగా అతిథులను పిలవడంతో ఈ ఈవెంట్ లెవెల్ మారిపోయింది. ఈ స్పెషల్ ఈవెంట్‌లో పెద్ద పెద్ద తారలందరూ వచ్చేశారు.

రమ్యకృష్ణ, శ్రుతీ హాసన్..
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఈవెంట్‌కు రమ్యకృష్ణ వచ్చింది. స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నాగ భైరవి అనేసీరియల్‌తో రమ్యకృష్ణ జీ ఫ్యామిలీలోకలిసిపోయిందన్న సంగతి తెలిసిందే. ఇక శ్రుతీ హాసన్ కూడా ఎంట్రీ అందర్నీ ఎంటర్టైన్ చేసింది.

అందాల నిధి..
నిధి అగర్వాల్ స్టేజ్ ఎక్కితే ఎలా ఊపేస్తుందో అందరికీ తెలిసిందే. మామూలుగా చూడటానికి పద్దతిగా కనిపిస్తుంది కానీ స్టేజ్ ఎక్కితే ఊర మాస్ అని తెలిసిందే. అదిరిపోయే మాస్ స్టెప్పులతో నిధి అదరగొట్టేసింది. ఆమెతో పాటు నమిత కూడా భారీ స్టెప్పులు వేసింది.

ఓంకార్ అలా..
ఇప్పుడంటే ఓంకార్ దర్శకుడిగా బాగా ఫేమస్ అయ్యాడు. కానీ ఓంకార్‌కు బుల్లితెరకు ఉన్న సంబంధాన్ని ఎవ్వరూ విడదీయలేదు. ఓంకార్‌కు గుర్తింపును ఇచ్చిందే బుల్లితెర. అందులోనూ జీ తెలుగు చానెల్. ఆట, డ్రామా జూనియర్స్, మాయా ద్వీపం ఇలా ఎన్నో షోలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆట అనే షోతో ఓంకార్ లెవెల్ మారిపోయింది. అలా తనకు అంతటి గుర్తింపును ఇచ్చిన ఓంకార్ఇలాంటి ఈవెంట్లకు రాకుండాఉంటాడా.
Recommended Video

పెద్ద కొడుకును నేను..
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఈవెంట్‌లో ఓంకార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతో అందరికీ షాక్ ఇచ్చాడు. జీ కుటుంబంలోకి ఎంత మంది వచ్చినా సరే ఒకే ఒక్క పెద్ద కొడుకు ఉంటాడు అది నేనే అంటూ గర్వంగా చెప్పుకున్నాడు.


Click it and Unblock the Notifications











