మళ్లీ అదే తప్పు చేసిన అఖిల్: చేతులెత్తి వేడుకున్నా వదిలిపెట్టని బిగ్ బాస్ కెప్టెన్.!

బిగ్ బాస్ నాలుగో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. సరికొత్త టాస్కులు, మధ్య మధ్యలో ఊహించని సంఘటనలతో ఈ సీజన్ రంజుగా మారింది. ఇలాంటి సమయంలో కంటెస్టెంట్ల మధ్య జరుగుతోన్న కొన్ని వివాదాలు, కొట్లాటలు షోను మరింత పైకి తీసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే రీఎంట్రీ తర్వాత అఖిల్ సార్థక్ వ్యవహరిస్తున్న తీరుతో హౌస్ వాతావరణం మారిపోయింది. తాజాగా జరిగిన నామినేషన్ టాస్కులో అతడు గతంలో చేసిన ఓ తప్పును పునరావ‌ృతం చేశాడు. ఈ సందర్భంలో ఓ కంటెస్టెంట్ చేతులెత్తి వేడుకున్నా వదిలిపెట్టలేదు. ఆ వివరాలు మీకోసం.!

అంచనాలు లేకుండా వచ్చి పాపులర్

అంచనాలు లేకుండా వచ్చి పాపులర్

బిగ్ బాస్‌ నాలుగో సీజన్‌లోకి సాదాసీదా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు హైదరాబాదీ మోస్ట్ డిజైరబుల్ మెన్ అఖిల్ సార్థక్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం.. టాస్కుల్లో వంద శాతం కష్టపడడంతో పాటు స్నేహానికి విలువ ఇస్తూ తన మార్కు చూపిస్తున్నాడు.

ట్రైయాంగిల్ లవ్‌తో ఫేమస్ అయ్యాడు

ట్రైయాంగిల్ లవ్‌తో ఫేమస్ అయ్యాడు

షో ఆరంభంలో పెద్దగా కనిపించని అఖిల్.. మోనాల్‌ గజ్జర్‌తో చనువుగా ఉండడం ప్రారంభించిన తర్వాత బాగా హైలైట్ అవుతున్నాడు. మరీ ముఖ్యంగా ట్రైయాగింల్ లవ్ అంటూ షో నిర్వహకులు చెప్పిన సమయంలో అతడు హాట్ టాపిక్ అయిపోయాడు. ఆ సమయంలోనే అభిజీత్‌తో కొన్ని గొడవలు పెట్టుకోవడం అతడిని మరింత ఫేమస్ అయ్యేలా చేసిందనడంలో సందేహం లేదు.

ఆట మారిపోయింది.. మోనాల్ కోసమే

ఆట మారిపోయింది.. మోనాల్ కోసమే

మోనాల్ దగ్గరైనప్పటి నుంచి అఖిల్ సార్థక్‌ ఆటలో మార్పులు కనిపించాయి. షో మొదట్లో తన కోసమే గేమ్ ఆడుతూ కనిపించిన అతడు.. ఆమె ఎంట్రీ తర్వాత ప్లాన్ మార్చుకున్నాడు. ఏ టాస్క్ అయినా ఆమెకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ అంశం అప్పట్లో బాగా హైలైట్ అయింది. దీన్నే హౌస్‌మేట్స్ సైతం తరచూ ప్రస్తావించడంతో వీళ్ల బంధం బాగా పాపులర్ అయింది.

మోనాల్ పేరు.. నాగార్జున సీరియస్

మోనాల్ పేరు.. నాగార్జున సీరియస్


ఓ వారం నామినేషన్ ప్రక్రియ సమయంలో అభిజీత్‌ను నామినేట్ చేస్తూ గొడవకు దిగాడు అఖిల్ సార్థక్. ఆ సమయంలోనే మోనాల్ పేరును ప్రస్తావించాడు. అప్పుడు తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని గ్రహించిన ఆమె బాగా బాధ పడిపోయింది. అంతేకాదు, తన పేరును తీసుకురావద్దని ఏడుస్తూ వేడుకుంది. ఈ విషయంలో నాగ్.. అఖిల్‌పై సీరియస్ కూడా అయ్యాడు.

మళ్లీ అదే తప్పు చేసిన అఖిల్ సార్థక్

మళ్లీ అదే తప్పు చేసిన అఖిల్ సార్థక్


ఆ సంఘటన తర్వాత ఎవరినైనా నామినేట్ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తిని తీసుకు రావద్దని నాగార్జున హౌస్‌మేట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా హౌస్‌లోకి ఆడవాళ్లతో ఏమాత్రం చెడుగా ప్రవర్తించిన ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సార్థక్ మళ్లీ ఓ తప్పు చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

Recommended Video

Teja Launches Vikram Movie First Look
చేతులెత్తి వేడుకున్నా వదిలిపెట్టలేదు

చేతులెత్తి వేడుకున్నా వదిలిపెట్టలేదు


సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో.. వేరే వ్యక్తిని తీసుకురావద్దని చెబుతున్నా అభిజీత్‌ను నామినేట్ చేసిన సమయంలో అఖిల్.. మోనాల్ పేరును తీసుకొచ్చాడు. అప్పుడు అభి కూడా అది తప్పు అని చెప్పాడు. అదే సమయంలో స్పందించిన మోనాల్ గజ్జర్.. ‘మీరు మీరు నామినేట్ చేసుకునేటప్పుడు నా పేరును తీసుకురావద్దు' అని చేతులెత్తి మరీ వేడుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X