మీ హీరోలా ఆడవాళ్ళని బూతులు తిట్టడం వచ్చు..విజయ్ దేవరకొండపై అనసూయ షాకింగ్ కామెంట్స్
తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఒక వెలుగు వెలుగిన టాప్ మోస్ట్ యాంకర్స్ లో గ్లామర్ ని జోడించి మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. కాగా అనుసయ మొదటిగా సినిమాలోనే వచ్చినప్పటికీ నెక్స్ట్ స్మాల్ స్క్రీన్ పై వచ్చి అక్కడ హిట్ అయ్యింది. దీనితో నెమ్మదిగా బిగ్ స్క్రీన్స్ పై సాలిడ్ రోల్స్ అనసూయకి పడ్డాయి. కాగా ఈ సినిమాల్లో అడివి శేష్ తో "క్షణం" సినిమాలో అనసూయ అదరగొట్టి అక్కడ నుంచి బిగ్ స్క్రీన్స్ పై బిజీగా మారింది.
అయితే అనసూయ ఈ ఫేమ్ తో పాటుగా పలు కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కోవడంతో బాగా ఫేమస్ అయ్యింది. మెయిన్ గా ట్విట్టర్ లోకి అనసూయ వచ్చింది అంటే ఏదొక కాంట్రవర్సీ తప్పదు. అన్నట్టే ఉంటుంది. ఇలా ఆ మధ్య అంతా తనని ఆంటీ అన్నవాళ్లపై విరుచుకుపడితే కొంతమంది మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని చెప్పింది. ఇంతే కాకుండా రీసెంట్ గానే ఓ టెలివిజన్ షో లో స్టేజిపైనే బట్టలు తీస్తూ షాకిచ్చింది.

దీనితో మరోసారి ఆమెపై విమర్శలు పెరిగాయి. ఇక ఇది మర్చిపోయే లోపే మరోసారి అనసూయ షాకిచ్చింది. అయితే టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండతో ఎప్పటి నుంచో వైరం ఉన్న సంగతి తెలిసిందే. పలు ప్రెస్ మీట్ ల విషయంలో విజయ్ దేవరకొండ ప్రవర్తన విషయంలో అనసూయకి కొన్ని కంప్లైంట్స్ ఉండడం వాటిపై విజయ్ సెటైరికల్ గా మాట్లాడ్డం ఇలా పలు మార్లు ఇద్దరి వార్ వైరల్ గా మారింది.
కాగా నిన్ననే మరోసారి ప్రెస్ మీట్ లో బాహాటంగానే నన్ను అడిగే ప్రశ్నలు విజయ్ దేవరకొండని ఎందుకు అడగరు అంటూ ఘాటుగానే స్పందించడంతో మళ్ళీ అంతా మొదటికే వచ్చింది. ఇక ఇది చాలదు అన్నట్టు మళ్ళీ ట్విట్టర్ లోకి వచ్చి ఒక షాకింగ్ పోస్ట్ తో అందరినీ ట్రిగ్గర్ చేసింది రంగమ్మత్త.. మరి తాను పోస్ట్ చేసి "మరీ చాతకాని వాళ్ళలా ఉంటే ఎలాగండి.

నిజంగా మీకు కాలుతుంది అంటే అది నా మీద కాదు అస్తమాను నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే.. కానీ మీరు అలా చెయ్యరు కదా ఎందుకంటే మీకు చాతకాదు.. మీ హీరోలా ఆడవాళ్ళని బూతులు తిట్టడం మాత్రమే వచ్చు.. కదా పాపం. మీకోసం నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను రియల్ జాబ్ ఏమన్నా చేసుకోండి" అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది.
దీనితో మరోసారి ఇప్పుడు అనసూయ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మరి దీనిపై విజయ్ ఏమన్నా సమాధానం ఇస్తాడో లేదో పక్కన పెడితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరి ఈ కాంట్రవర్సీకి అనసూయ ఎప్పుడు చెక్ పెడుతుందో ఏంటో చూడాలి మరి. ఇది అంతా ఎప్పుడో అర్జున్ రెడ్డి సినిమా సమయం నుంచే ఇద్దరికీ వార్ నడుస్తుంది.


Click it and Unblock the Notifications











