షాకింగ్ న్యూస్.. శ్రీముఖిపై పుకార్లు పుట్టిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈమె ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3 లోకి పార్టిసిపెంట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. జులై 21వ ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే ఈ షోలో కొనసాగుతున్న శ్రీముఖిపై పుకార్లు పుట్టిస్తున్నారంటూ ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు చూస్తే..

దుమారం రేపిన శ్రీముఖి వ్యాఖ్యలు
సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో గత ఎపిసోడ్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను 'బ్లాక్ షీప్' అంటూ శ్రీముఖి కామెంట్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగింది. రాహుల్ పట్ల శ్రీముఖి వర్ణ వివక్ష చూపిస్తోందంటూ ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో శ్రీముఖిపై ట్రోల్స్ పెరిగాయి.

శ్రీముఖిపై అసత్య ప్రచారాలు
ఇదే విషయమై ప్రముఖ జాతీయ దినపత్రిక ఓ కథనాన్ని రాసింది. దీంతో శ్రీముఖి సోదరుడు శుష్రుత్ ఆ కథనాలను తప్పు పట్టాడు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా జరుగుతున్న ప్రచారాలను ఆధారంగా తీసుకుని శ్రీముఖిపై ఆ పత్రిక అసత్య ప్రచారాలు చేస్తోందని పోలీసులను ఆశ్రయించాడు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సదరు పత్రిక శ్రీముఖిపై దుష్ప్రచారం రోజు రోజుకూ ఎక్కువ చేస్తోందని పేర్కొంటూ ఆమె సోదరుడు శుష్రుత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. మొదట ఇలాంటి వార్తలను లైట్ తీసుకున్నామని, కానీ అవి రోజు రోజుకూ ముదురుతుండటంతో ఇలా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. శుష్రుత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఓటింగ్ శాతం తగ్గిచాలనే ప్రయత్నమే
శ్రీముఖి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని, తద్వారా ఆమె ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనే ఇలా కొందరు కుట్ర పన్నారని శుష్రుత్ ఆరోపించాడు. దీంతో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఈ రూపంలో మరోసారి బిగ్ బాస్ సీజన్ 3 పై వివాదాలు చుట్టముట్టడం గమనార్హం.


Click it and Unblock the Notifications











