Sudigali Sudheer: మరోసారి ఆ అమ్మాయితో పెళ్లి అంటూ న్యూస్ వైరల్.. ఎంతవరకు నిజం అంటే..

టెలివిజన్ ప్రపంచంలో ఇటీవల కాలంలో కొంతమంది స్టార్ హీరోల తరహాలోని క్రేజ్ అందుకుంటు ఉన్నారు. ఒక కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగిన సుడిగాలి సుదీర్ ఇప్పుడు స్టార్ హీరోగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక అతను మొదట్లోనే టెలివిజన్ వరల్డ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక అతని పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది అని కథనాలు వెలువడుతున్నాయి. ఇక అవి ఎంతవరకు నిజం అనే వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ ద్వారా..:మొదట ఒక మెజీషియన్ గా కొనసాగిన సుడిగాలి సుదీర్ జీవితం జబర్దస్త్ ద్వారా మాత్రం ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. స్క్రిప్ రైటర్ గా జబర్దస్త్ లోకి ప్రవేశించి ఆ తర్వాత రెగ్యులర్ కమెడియన్ గా మారాడు. అంతేకాకుండా టీమ్ లీడర్ వరకు రావడంతో సుడిగాలి సుదీర్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. తక్కువ కాలంలోనే అతను తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

Once again jabardasth fame Sudigali Sudheer marriage news viral

యాంకర్ తో కెమిస్ట్రీ:కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఈటీవీలో వచ్చే ఇతర టాలెంట్ షోలలో కూడా సుదీర్ హైలెట్ అవుతున్నాడు. ముఖ్యంగా పోవే పోరా షో తో పాటు డి వంటి ప్రోగ్రామ్స్ లో కూడా అతను హైలెట్ అయ్యాడు. ముఖ్యంగా బ్యూటిఫుల్ యాంకర్ రష్మితో అతని కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. వీరి మధ్యలో లో ప్రేమ ఉంది అని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని అనేకసార్లు కథనాలు వెలువడ్డాయి.

టిఆర్పీ కోసమే అలా..:అంతేకాకుండా సుధీర్ రష్మీకి పెళ్లి అంటూ చాలాసార్లు హడావిడి కూడా చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత క్లారిటీ వచ్చేసింది. కేవలం ఎంటర్టైన్మెంట్ షోలలో టిఆర్పి కోసమే ఆ విధంగా వారిద్దరిని మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడినట్లుగా అర్థమయిపోయింది.
అయితే జబర్దస్త్ ద్వారా కెరీర్ సెట్ చేసుకున్న చాలామంది కమెడియన్స్ పెళ్లిళ్లు చేసుకునే పిల్లలతో ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

Once again jabardasth fame Sudigali Sudheer marriage news viral

మరోసారి పెళ్లి అంటూ..:కానీ సుదీర్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలో అతని పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి సుధీర్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందని అలాగే సుధీర్ కు తన ఫ్యామిలీలోనే ఒక అమ్మాయి తో ప్రేమలో ఉన్నాడు అని ఆమెతోనే పెళ్లి అని కూడా చాలాసార్లు గౌసిప్స్ అయితే వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి సుదీర్ పెళ్లి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సుధీర్ తన మరదలిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని కూడా అంటున్నారు.

అందులో నిజం లేదు:అయితే ప్రస్తుతం సుదీర్ సన్నిహితుల ప్రకారం అయితే అది అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది ఎందుకంటే సుదీర్ ఇప్పుడు హీరోగా తన కెరీర్ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు చాలా బిజీ బిజీగా కొత్త కథలు వింటూ ప్రస్తుతం కొన్ని షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక సుధీర్ ప్రస్తుతం హీరోగా అడుగులు వేస్తున్న విషయం తెలిసింది ఆ మధ్య గాలుడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏడు కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడంతో సుధీర్ కు ఒక మార్కెట్ అయితే క్రియేట్ అయింది దీంతో అతనికి ఇప్పుడు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. సమయంలో సుధీర్ మరిన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X