ఈ వారం ఎలిమినేషన్‌పై షాకింగ్ అప్‌డేట్: అఖిల్‌‌ను పంపిన తర్వాత బిగ్ బాస్ కొత్త ప్లాన్ ఇదే.!

By Manoj Kumar P

కరోనా మహమ్మారి ప్రభావంతో చాలా రోజులుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వినోద ప్రియులు సినిమాలు లేకపోవడంతో టీవీలకు అతుక్కుపోయారు. సరిగ్గా అలాంటి సమయంలోనే ప్రారంభం అయింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నో అంచనాల నడుమ మొదలైన నాలుగో సీజన్‌ సైతం ఆసక్తికరంగా మారుతోంది. రెండో సగానికి చేరుకోవడంతో ఈ షో ట్విస్టులతో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ గురించి బాగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ అప్‌డేట్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే...

బిగ్ సక్సెస్ దిశగా బిగ్ బాస్ షో

బిగ్ సక్సెస్ దిశగా బిగ్ బాస్ షో

తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఈ మూడింటికీ ప్రేక్షకుల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక, నాలుగో సీజన్ సైతం ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించి దూసుకుపోతోంది. ఫలితంగా ఇది కూడా మంచి ఫలితాన్నే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

100 శాతం వినోదం కోసం ప్లాన్లు

100 శాతం వినోదం కోసం ప్లాన్లు

నాలుగో సీజన్ ప్రారంభానికి ముందే.. ఈ సారి వందకు వంద శాతం వినోదాన్ని పంచబోతున్నామని బిగ్ బాస్ యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఈ సీజన్‌లో అన్నీ సరికొత్తగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చూడని టాస్కులు, స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, మసాలా సన్నివేశాలు, లవ్ ట్రాకులు, గొడవలు సహా ఎన్నో అంశాలను చూపిస్తున్నారు.

ఎలిమినేషన్‌ అంటేనే ప్రత్యేకంగా

ఎలిమినేషన్‌ అంటేనే ప్రత్యేకంగా

బిగ్ బాస్ షోలో ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందన్న విషయం తెలిసిందే. సోమవారం ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ తమ తమ అభిప్రాయాల మేరకు ఇద్దరేసి సభ్యులను నామినేట్ చేస్తుంటారు. వాళ్లు నిజాయితీగా గేమ్ ఆడుతూ ప్రేక్షకుల ఓట్లు రాబట్టుకోవాలి. ఇలా వారం చివర్లో ఎవరికి తక్కువ ఓట్లు పోలవుతాయో వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నారు.

ఇది మాత్రం నమ్మశక్యంగా లేదు

ఇది మాత్రం నమ్మశక్యంగా లేదు

బిగ్ బాస్ షో మొత్తంలో ఎలిమినేషన్ ప్రక్రియే ప్రధానమైనది. అందుకే దీని విషయంలో షో నిర్వహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న కొందరు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు షోపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది.

ఎలిమినేషన్‌పై షాకింగ్ అప్‌డేట్

ఎలిమినేషన్‌పై షాకింగ్ అప్‌డేట్

వీకెండ్ ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌కు సంబంధించిన వివరాలు రెండు రోజుల ముందే లీకైపోతున్నాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా వారం మధ్యలో అఖిల్ సార్థక్ ఇంటి నుంచి బయటకు వెళ్లడం షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఎలిమినేషన్ గురించి ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

సీక్రెట్ రూమ్ తర్వాత ప్లాన్ ఇదే.!

సీక్రెట్ రూమ్ తర్వాత ప్లాన్ ఇదే.!

అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని అంతా అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉంటుందట. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ తర్వాత అంటే వచ్చే వారం ప్రారంభంలో కానీ, మధ్యలో కానీ అఖిల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X