‘ఊహలు గుసగుసలాడే’టీవీలో వచ్చేస్తోంది...తేదీ

By Srikanya

హైదరాబాద్ :'అష్టాచమ్మా' హీరో శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారి 'ఊహలు గుసగుసలాడే'చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. వారాహి చలనచిత్రం, సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం రిలీజయ్యి జూన్ 20న విడుదల అయ్యి...మంచి విజయం సాధించింది. ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించటానికి సిద్దమవుతోంది.

ఆగస్టు 24 న మాటీవిలో ఈ చిత్రం ప్రీమియర్ షో వేయనున్నారు. చిత్రం ఫ్యామీలను ఆకట్టుకునే ఫన్,ప్రేమ వంటివి ఉండటంతో టీఆర్పీలు బాగానే వస్తాయని భావిస్తున్నారు. రజనీ కొర్రపాటి రూపొందించిన ఈ చిత్రంలో శౌర్య, రాశిఖన్నా జంటగా నటించారు.

Oohalu Gusagusalaade premier on TV

చిత్రం కథేమిటంటే...

ఎన్. వెంకటేశ్వరరావు అలియాస్ వెంకి (నాగ శౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది జీవితాశయం (అందుకో సెంటిమెంట్ ప్లాష్ బ్యాక్ ఉంటుందనుకోండి). తన లక్ష్యం కోసం ఓ ఛానెల్ లో పనిచేస్తున్న అతన్ని బాస్ ఉదయ్ భాస్కర్ (శ్రీనివాస్ అవసరాల) ఈ లక్ష్యం తెలుసుకుని,లైఫ్ ఇస్తానంటూ వాడేసుకుంటూంటాడు. అంతేకాక తనుపెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి సలహాలు ఇచ్చి, పెళ్లి దాకా తీసుకువస్తే, న్యూస్ రీడర్ పోస్ట్ ఇస్తానని ఆశపెడతాడు.

దాంతో బాస్ కి సాయపడదామని బయిలుదేరిన వెంకికి ఓ నిజం తెలుస్తుంది. అది...తను గతంలో ప్రేమించి,బ్రేక్ అప్ అయిన అమ్మాయి శిరీష (రాసి ఖన్నా) నే తన బాస్ ...ఇష్టపడుతున్నాడని....ఆ సమయంలో వెంకీ ఏం నిర్ణయం తీసుకున్నాడు. తన బాస్ కి సాయం చేసాడా...తను ప్రేమించుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: కల్యాణి కోడూరి, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X