twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బడ్జెట్ మొత్తం...శాటిలైట్ రేటు రూపంలో వచ్చేసింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో శాటిలైట్ రైట్స్ పడిపోయిన తర్వాత చిన్న సినిమా పరిస్ధితి గడ్డుగా మారింది. ఏదన్నా చిన్న సినిమాకు శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయంటే అది పెద్ద విజయం క్రింద లెక్కే. తాజాగా క్లాస్ సినిమాగా పేరు తెచ్చుకున్న 'ఊహలు గుసగుసలాడే'చిత్రం శాటిలైట్ రైట్స్ కోటి డబ్బై ఐదు లక్షలకు అమ్ముడయ్యాయని విశ్వసనీయ సమాచారం. మాటీవి వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. డివీడీ రైట్స్ లేకుండా కేవలం శాటిలైట్ రైట్స్ ని మాటివి కి అమ్మినట్లు తెలుస్తోంది. దాంతో సినిమా బడ్జెట్ వచ్చినట్లే అంటున్నారు. ఇక మిగలిన పబ్లిసిటీ మీద ఖర్చుపెట్టింది, లాభాలు...డిస్ట్రిబ్యూషన్ మీద వస్తుందని అంచనా వేస్తున్నారు. మరో ప్రక్క ఓవర్సీస్ లో తొలి మూడు రోజుల్లోనే 48,232 డాలర్స్ వసూలు సాధించి సరికొత్త రికార్డును సాధించింది.

    'అష్టాచమ్మా'హీరో శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారాడు. వారాహి చలనచిత్రం, సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ పతాకంపై 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. రజనీ కొర్రపాటి రూపొందించిన ఈ చిత్రంలో శౌర్య, రాశిఖన్నా జంటగా నటించారు.

     Oohalu Gusagusalaade satellite rights sold

    శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ "ఈ కథను 15 నిమిషాల్లో సాయిగారికి చెప్పాను. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. నేను కూడా ఓ పాత్రను చేద్దామనుకుని తర్వాత వద్దనుకున్నాను. కానీ సాయిగారు చేయమనడంతో చేసేశాను. 'అష్టాచమ్మా' చేసినప్పటి నుంచి నాకు కల్యాణిగారు బాగా తెలుసు. మంచి సంగీతాన్నిచ్చారు. శౌర్య, రాశి చాలా బాగా నటించారు'' అని అన్నారు.

    చిత్ర సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి మాట్లాడుతూ "మెలోడీలను చేయడానికి ఆసక్తి చూపుతాను. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ఓ పాటకు రెండు రకాల ట్యూన్లు కట్టాం. అనంతశ్రీరామ్ రెండు పాటలను రాశారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

    రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: కల్యాణి కోడూరి, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.

    English summary
    Naga Shourya, Raashi Khanna's “Oohalu Gusagusalaade”'s satellite rights are bagged by MAA TV for Rs 1.75crs. Filmmakers sold the satellite rights without DVD rights to MAA TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X