Bigg Boss Telugu షోలో టాప్ 5 కంటెస్టెంట్లు వీరే.. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో నిరాటకంగా సాగుతున్నది. ఇంటి సభ్యులు టాప్ 5 జాబితాలో చోటు సంపాదించుకొనేందుకు పోటీ పడుతున్నారు. అయితే కంటెస్టెంట్లు పెద్దగా తన ప్రతిభతో ఆకట్టుకోలేకపోవడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు టాప్ 5 జాబితాలోకి చేరుతారు అనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన ప్రకారం.. బిగ్‌బాస్ తెలుగు 5లో ఎవరు చేరడానికి అవకాశ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

70 రోజులకు బిగ్‌బాస్

70 రోజులకు బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు 5 షో ఇప్పటికే దాదాపు 70 రోజులు పూర్తి చేసుకోవడానికి సిద్ధమైంది. ఇంకా సుమారు 40 రోజులపాటు గేమ్ కొనసాగే అవకాశం ఉంది. రానున్న 40 రోజుల్లో కంటెస్టెంట్లకు గేమ్ మరింత కీలకంగా మారునున్నది. ఈ క్రమంలో కంటెస్టెంట్లు ప్రేక్షకుల మనసు దోచుకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. భారీ ఓటింగ్‌ను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆకట్టుకోలేకపోతున్న షో

ఆకట్టుకోలేకపోతున్న షో

అయితే గత బిగ్‌బాస్ షోలను పరిశీలిస్తే.. గతంలో ప్రతీ సీజన్ భారీ ఓటింగ్ నమోదు చేసింది. బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ మాత్రం ఆ రేంజ్‌లో ఓటింగ్ నమోదు చేయడం లేదనే వాదన వినిపిస్తున్నది. కంటెస్టెంట్లు డిఫెన్స్ మోడ్‌లో ఆడటం, అంతేకాకుండా ఒకరిద్దరు కంటెస్టెంట్లు మాత్రమే ఆకట్టుకోవడంతో షో కాస్త నిరాశజనకంగా సాగుతుందనే మాట ఆడియెన్స్ నుంచి వినిపిస్తున్నది.

టాప్ 5 రేసులో పదిమంది

టాప్ 5 రేసులో పదిమంది

బిగ్‌బాస్ తెలుగు 5 షో 19 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. దాదాపు ఇప్పటికే ఇంటి నుంచి 9 మంది ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇంటిలో పది మంది ఉండగా.. అందులో జస్వంత్ పడాల ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల బయటకు వెళ్లి ప్రస్తుతం సీక్రెట్ రూమ్‌లో క్వారంటైన్ పీరియడ్‌లో ఉన్నారు. త్వరలోనే బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఇంటిలోకి మళ్లీ అడుగు పెట్టే అవకాశం ఉంది.

టాప్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లు వీరే

టాప్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లు వీరే

ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ షోలో అత్యధికంగా పాపులారిటి సొంతం చేసుకొన్న కంటెస్టెంట్ల జాబితాను ఓర్మాక్స్ సంస్థ వెల్లడించింది. ఈ షోలో అత్యధికంగా ఓటింగ్‌తోపాటు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో సన్నీ, మూడో స్థానంలో శ్రీరామ చంద్ర, నాలుగో స్థానంలో రవి, ఐదో స్థానంలో సిరి హన్మంతు ఉన్నారు. వీరు టాప్ 5లో ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Recommended Video

Devarakonda Brothers About Pushpaka Vimanam Movie | Part 2
బిగ్‌బాస్ తెలుగు 5 టీఆర్పీ ఇలా..

బిగ్‌బాస్ తెలుగు 5 టీఆర్పీ ఇలా..

ఇక బిగ్‌బాస్ రియాలిటీ షో టెలివిజన్ రేటింగ్‌ పరంగా పెద్దగా ఆకట్టుకొలేకపోతున్నది. ఈ సంవత్సరంలో 43వ వారంలో అంటే గతవారం మోస్తారు రేటింగ్‌ను నమోదు చేసింది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 5.20 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 3.04 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. నాగ్ హోస్ట్ చేసే రెండు ఎపిసోడ్స్‌కు కాస్త మెరుగైన రేటింగ్ నమోదైంది. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.17 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 5.47 రేటింగ్‌ను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X