Bigg Boss Telugu 6: ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్ వీరే.. టాప్ 5లో ఉన్నది ఎవరంటే?
బిగ్ బాస్ మొదట్లో కాస్త నీరసంగా కొనసాగినప్పటికీ మళ్ళీ ఏడో వారం నుంచి కొంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ సరికొత్త టాస్కులతో కంటెస్టెంట్స్ మధ్యలో పోటీ తీవ్రతను మరింత పెంచుతున్నాడు. ఇక కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అయితే శాటిలైట్ అలాగే సోషల్ మీడియా డిజిటల్ ప్రపంచంలో సర్వేలు నిర్వహిస్తున్న ఓరామాక్స్ రీసెంట్ గా బిగ్ బాస్ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్ లిస్టును విడుదల చేసింది. ఇక అక్టోబర్ చివరి వారంలో నిర్వహించిన ఈ సర్వేలో టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ వివరాల్లోకి వెళితే...

రేవంత్ నెంబర్ 1
ఎప్పటిలానే రేవంత్ అత్యధిక స్థాయిలో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్ గా నిలిచాడు. అతను మొదటి నుంచి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేక్ సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి తరహాలో కోపానికి గురి అవుతున్నప్పటికీ కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అసలు తగ్గడం లేదు. పోటీగా ఎంతమంది వచ్చినా కూడా మరోసారి నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు.

రెండవ స్థానంలో శ్రీహాన్
ఓరామక్స్ మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో రెండవ స్థానంలో శ్రీహన్ నిలిచాడు. అతను ఓట్లు అందుకోవడంలో కూడా తన బలాన్ని చూపించుకుంటున్నాడు. నెటిజన్స్ నుంచి అతనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే దక్కుతుంది. ఇక ఈసారి ఈ సర్వేలో కూడా అతను రెండవ స్థానంలో నిలిచాడు. గతంలో రెండు సార్లు విడుదల చేసిన ఓరామాక్స్ లిస్టులో కూడా అతనికి టాప్ 5 లోనే చోటు దక్కడం విశేషం.

ఈసారి టాప్ 5లో శ్రీ సత్య
ఇక ఈసారి శ్రీ సత్య ర్యాంక్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె గత వారం అయితే కనీసం టాప్ ఫైవ్ లిస్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఇక ఈసారి ఓరామాక్స్ సర్వేలో శ్రీ సత్య మూడవ స్థానంలో నిలిచింది. ఆమె గతవారం కొనసాగిన విధానం ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంటుంది. ఇక ఎలిమినేషన్ నుంచి కూడా చాలా తెలివిగా తప్పించుకుంటుంది.

ఫైమా టాప్ 4లో
జబర్దస్త్ కమెడియన్ ఫైమా కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంచుకుంటుంది. వివాదాలు ఎదురవుతున్నా కూడా తనవైపు నుంచి తప్పు లేకుండా చూసుకుంటుంది. ఎదురుగా టాప్ నెంబర్ వన్ కంటెస్టెంట్ ఉన్నా కూడా ఫైమా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక ఈ సర్వేలోనే ఫైమా నాలుగో స్థానంలో నిలిచి మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది.

ఆదిరెడ్డి 5వ స్థానంలో..
మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో ఈసారి ఊహించిన విధంగా ఆదిరెడ్డి టాప్ 5లో నిలవడం విశేషం. గతంలో గీతూ టాప్ 5 లిస్టులో నిలిచింది. కానీ ఈసారి ఆమెకు ఆ రేంజ్ లో గుర్తింపు లభించలేదు. ఇక ఆదిరెడ్డి న్యాయమైన గేమ్ ఆడుతూ గతవారం తన స్థాయిని పెంచుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు ఓరామాక్స్ సర్వేలో అతను ఐదవ స్థానంలో నిలిచి మరింత క్రేజ్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక ప్రతీ వారం కూడా ఓరామాక్స్ సర్వేలో ర్యాంక్స్ మారుతున్నాయి. మరి వచ్చే వారం ఎవరు టాప్ 5లో స్థానం అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











