Bigg Boss Telugu 6: ఆ సర్వేలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉన్నది వీరే.. ఊహించని స్థానంలో శ్రీసత్య!
డిజిటల్ సోషల్ మీడియా సర్వేల ఆధారంగా ర్యాంకులు విడుదల చేసే ఓరామాక్స్ సంస్థ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ కు సంబంధించిన మరొక లిస్టుని విడుదల చేసింది. అక్టోబర్ మొదటి వారంలో టాప్ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అనే వివరాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓట్ల వివరాలు ఒకలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న వారి ర్యాంక్స్ మరొక విధంగా ఉన్నాయి. ఇక అక్టోబర్ 1 నుంచి 7 వరకు మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ వివరాల్లోకి వెళితే..

నెంబర్ స్థానంలో
బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి అందరి ఫోకస్ ఎక్కువగా రేవంత్ పైనే ఉంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతను ఓట్లు అందుకొవడంలో కూడా నెంబర్ వన్ స్థానంలోనే నిలుస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఓరామాక్స్ సర్వేలో కూడా అతను నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. సోషల్ మీడియాలో అతని ప్రభావం అయితే గట్టిగానే ఉంది. చాలామందిని నెటిజన్లు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.

రెండవ స్థానంలో శ్రీహన్
రేవంత్ మొదటి స్థానంలో ఉంటే అత్యధిక ఓట్లు అందుకుంటున్న కంటెస్టెంట్స్ లో అయితే ప్రతిసారి కూడా శ్రీహన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సర్వేలో అతను కూడా రెండవ స్థానంలో నిలవడం విశేషం. అతను టాస్క్ లలో చాలా తెలివిగా కొనసాగుతున్నాడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగని గొడవలు పెట్టుకోకుండా మరి సౌమ్యంగా ఉండకుండా కూడా చాలా బ్యాలెన్స్ తో గేమ్ అడుతున్నట్టు అనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఓరామాక్స్ సర్వేలో అతను రెండవ స్థానంలో నిలిచాడు.

శ్రీసత్య 3వ ర్యాంక్
ఇక మూడో స్థానంలో ఎవరు ఊహించని విధంగా ఓరమ్యాక్స్ సర్వేలో శ్రీ సత్య నిలవడం విశేషం. ఈమె అసలు రెండో వారంలోనే బయటకు వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇప్పుడు మెల్లమెల్లగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా సర్వేలో ఆమెకు మూడో ర్యాంకు దక్కడం విశేషం.

ఫైమా 4వ స్థానం
ఇక నాలుగో స్థానంలో పైమా ఉండడం విశేషం. ఆమె గతవారం నుంచి కూడా నామినేషన్స్ లో ఉండకూడదు అని ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. కెప్టెన్సీ టాస్క్ లో బలమైన పోటీని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు కామెడీ చేస్తూనే మరొకవైపు ఆటలు చాలా సీరియస్ గా కొనసాగుతోంది అనే ప్రశంసలు అందుకుంటుంది. దీంతో ఇప్పుడు ఓరామాక్స్ సర్వేలో 4వ స్థానంలో నిలిచింది.
5వ స్థానంలో
ఇక ఐదవ స్థానంలో తప్పకుండా బాలాజీ లేదా అర్జున్ ఉంటారు అని అందరూ అనుకున్నారు. ఇక వారందరి కంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు గీతూ రాయల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ డిజిటల్ మీడియా సర్వేలో ఆమె ఐదవ స్థానంలో నిలిచింది. ఒక విధంగా మొదటి రెండు మూడు వారాల్లో అత్యధిక ఓట్లు అందుకుంటూ నెంబర్ వన్ రేవంత్ కు పోటీగా నిలిచిన గీతూ ఇప్పుడు మాత్రం కాస్త హడావిడి తగ్గించింది. ఇక ఇప్పుడు ఓరామాక్స్ సర్వేలో అయితే 5వ స్థానంతో సరిపెట్టుకుంది.


Click it and Unblock the Notifications











