Bigg Boss Telugu 7: టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే... అమర్ దెబ్బకు అంతా ఉల్టాపుల్టా!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక 12వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... మరో మూడు వారాల్లో ముగియనుంది. డిసెంబర్ 17న ఈ షో గ్రాండ్ ఫినాలి జరుపుకోనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉండగా.. నిన్న అశ్విని ఎలిమిమిమనేట్ అయింది. ఇక ఈరోజు షోలో మరొకరు ఎలిమినేట్ కానున్నారు. 13వ వారానికి హౌస్ లో 8 మంది ఉంటారు. మరి ఆ 8మంది కంటెస్టెంట్స్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. ఏంటి అనేది ఆర్మాక్స్ సర్వే నిర్వహించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక ఈ షో రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈషోలో ప్రస్తుతం హౌస్ లో 12వ వారం ఇద్దరు ఎలిమినేట్ అవ్వగా... 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక ఈ వారం రతికా రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ 8 మందిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ సినీ తారాలపై, సినీ విషయాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్స్ పై సర్వే నిర్వహించింది. అందులో టాప్ 5 లిస్టును రిలీజ్ చేసింది ఆర్మాక్స్. తన సోషల్ మీడియా వేదికగా ఆర్మాక్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టాప్ 5 కంటెస్టెంట్స్ జాబితాను విడుదల చేసింది. ఇక గత వారం అమర్ దీప్ దెబ్బకు టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ అంతా ఉల్టా పుల్టాగా మారిపోయింది.
టాప్ 1లో మైండ్ గేమ్ తో ఆడుతున్న శివాజీ ఉన్నాడు. అమర్ దీప్ కెప్టెన్సీ విషయంలో నెగిటివిటి మూటగట్టుకున్న శివాజీ... ఆ తర్వాత హ్యాండ్ పెయిన్ స్ట్రాటజీతో టాప్ 1లోకి చేరిపోయాడు. హ్యాండ్ పెయిన్ వస్తుంది.. ఎలిమినేట్ అయిపోతాను అంటూ సోషల్ మీడియాలో శివాజీ పీఆర్ టీమ్స్ ట్రెండ్ చేశాయి. దీంతో అమర్ విషయం అంతా మరిచిపోయారు. దీంతో ఆయన మళ్లీ టాప్ లోకి వచ్చేశాడు. అంతే కాదు బిగ్ బాస్, నాగార్జున కూడా శివాజీకి విన్నర్ చేసేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక టాప్ 2లో ప్రశాంత్ నిలిచాడు. ప్రశాంత్ తన గేమ్ తను ఆడుతూ.. దూసుకుపోతున్నాడు. ఇక టాప్ 3లో అమర్ దీప్ నిలిచాడు. అమర్ దీప్ అసలు టాప్ 5లోనే ఉండడు అనుకుంటే.. రోజురోజుకు అమర్ దీప్ గ్రాఫ్ మారిపోతుంది. శివాజీ కన్నింగ్ గేమ్ బయటకు వచ్చి.. అమర్ దీప్ రియాలిటీ అందరికీ కనిపిస్తుంది. అలా ఇప్పుడు టైటిల్ విన్నర్ రేసులో అమర్దీప్ ఉన్నాడు. ఇక రాబోయే కాలంలో అమర్ టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యం లేదు.
ఇక టాప్ 4లో గౌతమ్ కృష్ణ నిలిచాడు. మొదటి నుంచి ఏ బ్యాచ్ లో నిలవకుండా.. తన గేమ్ తాను ఆడుతూ... గౌతమ్ టాప్ 4లో నిలిచాడు. ఇక టాప్ 5లో శోభా శెట్టి నిలిచింది. శోభా శెట్టి కూడా చాలా బాగా ఆడుతూ జనాలను ఆకట్టుకుంటుంది. ఇవి ఆర్మాక్స్ సర్వేలో ఈ వారం టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్. మరి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో మరో మూడు వారాల్లో తెలియనుంది.


Click it and Unblock the Notifications










